Friday, August 25, 2023

#నమస్తేతెలంగాణ#ప్రగతిపథం_సంక్షేమరథం#చిటుకుల_మైసారెడ్డి_9490524724

నమస్తే తెలంగాణ:  

ప్రగతి పథం సంక్షేమ రథం: చిటుకుల మైసారెడ్డి 9490524724 

 ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమంముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అనేక సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. మన కేసీఆర్ ప్రభుత్వమంటే ప్రగతి పథం, సంక్షేమ రథం. చిటుకుల మైసారెడ్డి 9490524724 దేశంలో ఎవరూ చేయని సాహసం. ఒకేసారి 114 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా గెలవబోతున్నామనడానికి మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికనే నిదర్శనం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ దమ్మున్న లీడర్. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్లడమే ఆయన లక్షణం. సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు అపారమైన నమ్మకం,విశ్వాసం, ప్రేమ ఉన్నాయి. రాష్ట్ర సాధనలోనైనా, తెలంగాణ పునర్నిర్మాణంలోనైనా ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఈ రోజు తెలంగాణ అంటే ప్రగతి పూదోట, సంక్షేమబాట అనేలా తీర్చిదిద్దారు. అందుకే కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామరక్ష అంటున్నారు. తెలంగాణ ప్రజలు. 60 ఏండ్లలో ఏమీ చేయనోళ్లకు మళ్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలట. ఎందుకు? ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణను ముంచడానికి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. చైతన్యం కలిగిన ఉద్యమ బిడ్డలు. అరవై ఏండ్ల పాటు అరిగోస పడ్డం. కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తున్నది. ఇక ముందు కూడా ఈ ప్రగతి సాగాలంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. భవిష్యత్ దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలి. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పైసా పోగేస్తూ పేదవారికి సంక్షేమం పంచుతున్నారు. సంక్షేమానికే అత్యధిక ఖర్చు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రులలో దేశంలోనే కేసీఆర్ అగ్రభాగాన నిలిచారు. ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆయన రాష్ట్రం ఏర్పాటు కాగానే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ సంక్షేమ పథకాలు తెలంగాణ జనజీవనానికి ఊపిరి పోస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి అవ్వ,అయ్య,అక్కచెల్లెండ్లు సకల జనులంతా కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అంటూ దీవెనలు అందిస్తున్నారు. ఉద్యమ స్వప్నాలను సంక్షేమ ఫలాలుగా అందిస్తున్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు, రైతుబీమా తెలంగాణ రైతు గుండెకు భరోసాగా నిలిచాయి. వ్యవసాయంపండుగలా మారింది. 2018 నుంచి రైతుబంధు పేరుతో పెట్టుబడి కోసం ఎకరాకు 10 వేల చొప్పున 70 లక్షల మంది రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతుబీమా ద్వారా లక్ష మంది రైతు కుటుంబాలకు 5 వేల కోట్లు అందించారు. చేనేత మగ్గం చీరె సారె తెలంగాణ ఆడబిడ్డకు బతుకమ్మ పండుగైంది. దళిత బిడ్డల ఇంటివెలుగు తెలంగాణ దళిత బంధు. కల్యాణలక్ష్మి పేదింటి బిడ్డకు వరం. కేసీఆర్ కిట్ పుట్టిన బిడ్డకు సంజీవని. ఇలా ఎన్నో పథకాలు తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలుపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, సేద్యానికి 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, చేనేతబీమా, దళితబంధు, యాదవులకు గొర్ల పంపిణీ,ముదిరాజులకు చేపల పెంపకం, బీసీలకు బీసీబంధు సాయం, సొంత ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి వంటివి కేసీఆర్ మేధోమథనం నుంచి జాలువారిన చరిత్రాత్మక పథకాలు జీవితాలకు భరోసా ఇచ్చే సాక్ష్యాలు.. సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్చూచిగా నిలుస్తున్నది. 2023-24 బడ్జెట్లో సంక్షేమ రంగానికి రూ.35 వేల కోట్ల కేటాయింపులే దీనికి నిదర్శనం. కడుపులో పెరిగే బిడ్డ మొదలు పండు ముదుసలి వరకు అన్ని వయసుల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నాయి. సంక్షేమ రంగానికి 2015-16లో రూ. 10వేల కోట్ల కేటాయింపులు జరిగితే 2023-2024 వార్షిక బడ్జెట్లో అవి రూ.35,547 కోట్ల కు చేరుకున్నవి. దేశంలోనే ఆరోగ్యరాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతున్నది. పేద ప్రజల ఆరోగ్యం పై మన తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ప్రాధాన్యం చాలా గొప్పది. కేసీఆర్ కిట్, అమ్మవొడి ద్వారా రూ. 1,420 కోట్ల మేర 13లక్షల మంది లబ్ధి పొందారు. ఆరోగ్యలక్ష్మి పేరుతో గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నది ఆరోగ్యశాఖ. బాలింతలకు, పుట్టిన బిడ్డ క్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కేసీఆర్ సంకల్పానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పనితీరుతోడైంది. ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించటం కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటి ద్వారా వేలాది చెరువులు బాగుచేసుకున్నాము. కాళేశ్వరం నీళ్లను నింపుకుని సాగు, తాగునీటి సమస్య లేకుండా చేసుకున్నాము. అంతే కాదు ప్రతి చెరువులో చేపల పెంపకం కార్యకమంతో మత్స్యకారులకు జీవనోపాధి పెరిగింది. మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందుతున్నది. తెలంగాణ సంక్షేమం.. దేశం అనుసరిస్తున్నది. అందుకే దేశం కేసీఆర్ వైపు చూస్తూన్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన తెలంగాణ అభివృద్ధి కొనసాగుతున్నది. కేసీఆర్ నాయకత్యంలో జరుగుతున్న ఆభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమానికి ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వనున్నారు. అందుకే మనం ప్రగతిపథం వైపు నడుద్దాం. సంక్షేమం వైపు నిలుద్దాం. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంను చేద్దాం. భావి భారతావనికి నాయకత్వం వహించే దిశగా సీఎం కేసీఆర్ వెన్నంటే ఉందాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...