Sunday, November 22, 2026
#BHAJANAVALI#PDF_BOOK&IMAGES#SUNDARA CHAITANYA ASHRAMAM
GOOGLE DRIVE PDF FILE EMBEDDING IN BOLG ACTUAL VIDEO FULL EXPLANATION VIDEO by YEDAVALLI_SUDARSHAN_REDDY
Saturday, November 21, 2026
Friday, November 20, 2026
Sundara Chaithanya Swamy MP3 Audio CD-1#02#03#view#share
స్వరాంజలి
స్వరాంజలి
స్వరాంజలి సంస్థ నిర్వహణ ముఖ్య ఉద్దేశము భక్తి సంగీతం ద్వారా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేవాలయాలు, ఆధ్యాత్మిక సభలలో భక్తులకు భక్తి సంగీతం అందిస్తూ భక్తులను చైతన్య పరుస్తూ భగవంతునిపై భక్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంగీత గాయకులను, వాయిద్యకారులను ప్రోత్సహిస్తూ వారిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపి తద్వారా భక్తులకు సంగీతామృతాన్ని పంచుతూ, అందరినీ అలరిస్తూ, భక్తి మార్గంలో పయనించుటకు తోడ్పాటునందించుట.
సంగీత కళాకారులకు క్లాసులు నిర్వహిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి రేడియో, TVలలో అవకాశాలను కల్పిస్తూ, ఆధ్యాత్మిక భక్తి ప్రచారంలో భాగస్వామ్యులను చేయుట, తద్వారా, భావి తరాలకు భక్తి సంగీతం ను అందించుట.. నిర్విఘ్నంగా కొనసాగిస్తూ, సంస్థను అభివృద్ధి పధంలో నడిపించుట మహాత్ములు అందించిన భక్తి కీర్తనలు ప్రచారము చేయుట త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురందరదాసు, భజనలు - కబీర్ దాస్, తులసీదాస్, మీరాబాయి, బ్రహ్మానంద నరసీ మెహతా మనకు అందించిన భజన కీర్తనలను ప్రచారము చేయుట పరమోద్దేశము.
స్వరాంజలి music programme ఆంధ్రప్రభ, ఈనాడు న్యూస్ clips Intemet Archive Org. Link:
https://archive.org/details/swaranjali-very-latest
https://archive.org/details/01-swaranjali-group-01
స్వరాంజలి music programmes videos Internet Archive Org. Link:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/19/swaranjali
స్వరాంజలి #telugu wikipedia link:
swami sundara chatanyananda#stotramulu#Internet Archive org. playlist link given view all the stotramulu
swami sundara chatanyananda#stotramulu#Internet Archive org. playlist link given view all the stotramulu Link: https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/101/stotramulu
Wednesday, November 18, 2026
LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS
HOW TO OPEN NEW ACCOUNT IN INTERNET ARCHIVE ORG.#FULL VIDEO EXPLANATION
HOW TO OPEN NEW ACCOUNT IN ARCHIVE DOWNLOAD VIDEO LINK: https://drive.google.com/file/d/1cNdIswuJbGcLdHkZTI9cZKDz-8XOEKJl/view?usp=drive_link
Monday, November 16, 2026
CHAITANYA HRUDAYANJALI INTERNET ARCHIVE ORG VIDEO PLAYLIST LINK#SWAMI SUNDARA CHAITANYANANDA
CHAITANYA HRUDAYANJALI INTERNET ARCHIVE ORG VIDEO PLAYLIST LINK:
https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/99/chaitanya-hrudayanjali
**
Sunday, November 15, 2026
అచల పరిపూర్ణ బోధ YOUTUBE CHANNEL
Saturday, November 14, 2026
#SUNDARACHAITANYA_ASHRAMAM#TELUGU_WIKIPEDIA#video
Friday, November 13, 2026
Melody Bhakti Songs Videos #3 albums# Lord Krishna#rama#srinivasa
Melody Krishna Songs videos
Thursday, November 12, 2026
#ఆనందం అది చాలా చిత్రమైనది#శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)#lyricalvideo
ఆనందం... అది చాలా చిత్రమైనది
#శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
ఆనందం... అది చాలా చిత్రమైనది.
కొందరి దృష్టిలో ఆనందం అంటే ఏదైనా ఫ్రీగా దొరకాలి.
కోటీశ్వరుడైనా కావచ్చు, వాళ్ళ సొత్తు వాళ్లకు ఆనందం ఇవ్వదు. ఏదైనా ఫ్రీగా వస్తేనే ఆనందం.
ఈ రకమైన ఆనందం చాలా మందికి పరిచయమే.
దగ్గర డబ్బులు ఉంటాయి, దానితో ఏదైనా కొనుక్కొని ఆనందించవచ్చు. కానీ అలా ఆనందం చాలామందికి కలగదు.
వారికి ఫ్రీగా రావాలి, ఏదైనా సరే అప్పుడే ఆనందం.
ఒకటి కొంటే మరొకటి ఫ్రీ... ఇది వారికి చాలా ఆనందం ఇస్తుంది.
కొందరికి గెలుపు ఆనందం.
చిత్రంగా కొందరికి ఓటమి ఆనందం ఇస్తుంది. అది ఎప్పుడో తెలుసా? శత్రువులకు ఓటమి కలిగినప్పుడు!
ఇలా గెలుపు ఓటములు వాళ్లకు ఆనందం ఇస్తాయి.
అయితే ఇది నిజమైన ఆనందమేనా?! కాదు.
ఎందుకంటే ఒక్కొక్కరి ఆనందానికి ఒక్కొక్కటి కారణమైతే, అందరి ఆనందానికి మాత్రం ఒకటే కారణమై ఉన్నది. అది ఆనందానికి అసలైన అర్థం. అదేంటో తెలుసా?!
'పొందడం ఏమీ వద్దు' అనుకున్న మనిషి ఆనందంగా నిద్రపోతాడు. ఇది అందరికీ సంబంధించిన ఆనందం.
ఎవరైనా సరే అన్నీ వదులుకుంటేనే నిద్ర వస్తుంది. ఆలోచనలు, జ్ఞాపకాలు అన్నీ వదలాలి, అప్పుడే నిద్ర వస్తుంది. వాస్తవంగా...
"ఆనందం అంటే పొందడం కాదు వదలడం, ఇది అసలు విషయం."
నీవు భలేవాడివే, పొందకపోతే ఆనందం ఎలా వస్తుంది అని అనుకుంటున్నావా?!
నువ్వు ఏదైనా పొంది చూడు, ఎంతగా పొందుతావో అంతగా ఆయాసపడతావు.
ఆనందమంటే పరిపూర్ణమైన స్వేచ్ఛ. ఆలోచన నుండి, చివరికి శరీరం నుండి. అప్పుడే కదా మనకు గాఢమైన నిద్ర వచ్చేది.
డబ్బు సహజంగా ఆనందం ఇస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ డబ్బు కన్నా కూడా నిద్రనే గొప్ప ఆనందం.
మూడు రోజులు నిద్రపోకుండా ఉంటే నీకు కోట్లు ఇస్తామన్నా కూడా, మనిషి కేవలం నిద్రనే కావాలనుకుంటాడు.
'మూడు రోజులే కదా నేను మేల్కొంటాను' అని అంటావా!
ఓకే, నాలుగు రోజులు అయితే... పది రోజులైతే.. అప్పుడు కూడా డబ్బు కోసం నిద్ర వదిలేస్తావా? ట్రై చేసి చూడు...
ఒకతను ఇలాగే పందానికి ఒప్పుకున్నాడు. 24 గంటలు మేల్కున్నాడు. ఆ తర్వాత పరిస్థితి మారింది. అతడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటుంటే, వాళ్ళు వాడి తల మీద చెంబు నీళ్లు కుమ్మరిస్తున్నారు, వాడు మేల్కొంటున్నాడు. ఇలా ఒక స్థాయికి వచ్చేసరికల్లా, తన నిద్రను పాడు చేసే వారిని కత్తి తీసుకొని పొడవడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు వారు వాడికి గుర్తు చేశారు, "నువ్వు ఇక రెండు రోజులు మేలుకుంటే 100 కోట్లు వస్తాయి" అని.
వాడు అన్నాడు, "లక్ష కోట్లు వస్తాయన్న.. ఆ డబ్బులు వద్దు.. నాకు విశ్రాంతి కావాలి" అని అన్నాడు.
కావాలంటే మీరు ఎవరినైనా పరీక్షించండి.
దేవుడు మనకు నిజమైన ఆనందాన్నిచ్చాడు నిద్ర రూపంలో. ప్రతిరోజూ కొన్ని గంటలు ఇస్తున్నాడు. శరీరం నుండి, మనసు నుండి మనల్ని ఆయన వేరు చేస్తున్నాడు, ఇది ఎంతమంది గ్రహించారు?!
అంటే దీని భావం ఏమిటి?
ఆ పరమాత్ముడు నీకు ఏమీ లేకుండా చేస్తున్నాడు, అప్పుడే నీవు ఆనందంగా ఉంటున్నావు, ఇది అర్థమైందా?!
దీనిని ఏమంటారో తెలుసా! సన్యాసం అంటారు. నిజంగా సన్యాసం అంటే ఆనందం. అది అన్ని బంధాల నుండి, బాధల నుండి విడివడటం అని అర్థం.
సన్యాసం అంటే డ్రెస్ కోడ్ కాదు, సన్యాసం అంటే అన్నింటి నుండి విడిపడడం.
సన్యాసి యొక్క లక్షణం ఏమిటో తెలుసా?!
సినిమా హాల్లో కూర్చున్న ప్రేక్షకుని లాంటిది.
ఆడించే దర్శకుడు ఆడించాడు, ఆడే నటులు అతడు ఆడించినట్లు ఆడారు. ఆయన ఎలా ఆడించాడో వీరు అలా ఆడారు.
అలా పరిపూర్ణ ప్రేక్షకుడి లాగా, వినోదంతో చాలా హ్యాపీగా ప్రపంచాన్ని చూస్తాడు సన్యాసి.
అటువంటి సన్యాసి కాషాయం ధరించవచ్చు, లేకపోతే కాషాయం లేకుండానూ ఉండవచ్చు. అతనికి ఎటువంటి నిబంధనలు లేవు.
అతడొక పరిపూర్ణ (ఆనంద పిపాసి) భోగి.
ఆనందంతో నిరంతరం నిండి ఉండేవాడే భోగి. ఇతని భోగం ఇంద్రియాలు కాదు, సాక్షి... పరమ సాక్షి.
మనకు ఇంద్రియ భోగం తెలుసు, సాక్షి వైభోగం తెలియదు.
ఈ విషయంలో మనకు సినిమా ప్రేక్షకుడే గురువు.
ఏమిటి, ఒక ప్రేక్షకుడు కూడా గురువా?! అవును గురువే.
గురువును ఎప్పుడు ఎలా గుర్తించగలవు, ఆయన సర్వవ్యాపి కదా!
గురువు అంటే ఒక స్థానంలో స్థిరంగా ఉన్నవాడు కాదు. ఆయన నిత్యసంచారి, వాయువు లాగా సంచరిస్తూ ఉంటాడు. విద్య కావాలనుకున్నవారు ఆయనను వెంబడించాలి. గురు దర్శనం ఎక్కడెక్కడ అవుతుందా అని తాపత్రయపడాలి.
అలా తాపత్రయపడిన వారిలో దత్తుడు ఒకడు. ఆయన 24 తత్వాలను గురువుగా స్వీకరించాడు, ఇంకెన్ని తత్వాలో.
గురు వైభోగం ఏమని చెప్పేది, మౌనంగా నమస్కరించడం తప్ప! 🌼🌼🌼🙏
ఆనందం యొక్క వివరణ ఇస్తూ నేను గురువు దగ్గరికి వచ్చాను.
అటువంటి గురువులకు నమస్కరిస్తూ, నేను నిన్ను నీకు సరికొత్తగా పరిచయం చేస్తాను. గతంలో ఎందరో నిన్ను నీకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిచయం చేశారు.
కొందరు నిన్ను కోపిష్టిగా, కొందరు నిన్ను ప్రేమ మూర్తిగా, కొందరు నిన్ను శాడిస్టుగా, కొందరు భయస్తుడిగా, కొందరు నిన్ను సింహం లాగా నీకు పరిచయం చేసి ఉండవచ్చు.
ఒక్కొక్కరు నిన్ను ఒక్కొక్క విధంగా ప్రచారం చేసి ఉంటారు. కానీ నిన్ను నేను నీకు శివునిగా పరిచయం చేస్తున్నాను.
నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెబుతున్నాను.
నీవు ఎన్ని రకాలైన పాత్రలైనా ధరించవచ్చు, కానీ నువ్వు ఎప్పుడూ ఏదై ఉన్నావో తెలుసా? అదే శివం.
ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే శరీరం శవం అవుతుంది. మరి ఆ శివంగా నీవు ఎలా ఉన్నావో తెలుసా! ఒక సాక్షి లాగా ఉన్నావు.
కేవలం నిన్ను నేను సాక్షిగా గుర్తిస్తున్నాను.
అది ఎలాగో చెప్తాను వినండి.
నిరంతరం మార్పు చెందే ఈ సృష్టిలో, ఈ జగత్తులో చూసే సాక్షి ఒకటే సత్యం. ఎందుకంటే దాని స్వభావం ఎప్పుడూ మారడం లేదు, అది చూస్తూనే ఉంది. ఈ ప్రపంచాన్ని చూసే ఆ సాక్షి మనలో కూడా ఉంది, మనలను కూడా అది గమనిస్తూ ఉంది.
ముఖ్య విషయం ఏమిటంటే, చిన్నతనం నుండి నేటి వరకు నీవు కలిగి ఉన్న ఈ మనసును గమనిస్తూనే ఉంటావు.
అది ఎన్నో మార్పులు చెందిందని నీకు తెలుసు.
చిన్నతనంలో ఉన్న ఈ శరీరం ఇప్పటివరకు ఎన్నో మార్పులకు గురైందని కూడా నీకు తెలుసు.
నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నది అది నీకు తెలుసు, నీ శరీరం రోగగ్రస్తమై ఉన్నప్పుడు అది కూడా నీకు తెలుసు.
బాధల్లో ఉన్న మనసు నీకు తెలుసు, సంతోషంలో ఉన్న మనసు నీకు తెలుసు. అన్నీ అమరిన వేళ గర్వపడిన మనసు నీకు తెలుసు, అవమానించిన వారిపై కక్ష తీర్చుకున్న మనసు కూడా నీకు తెలుసు.
తన తప్పులు తెలిసి క్షమించమని ప్రాధేయపడిన మనసు కూడా ఒకవేళ నీకు ఉండవచ్చు, దాన్ని కూడా నువ్వు చూసే ఉంటావు.
నీవు కలిగి ఉన్న మనసు, బుద్ధి, శరీరం, చిత్తం, అహంకారం అన్నీ మారుతూ ఉంటాయి కానీ చూసే స్వభావం ఉంది చూడు, అది ఎప్పుడూ మారడం లేదు.
ఆ తత్వం మాత్రం మారలేదు.
బాగా గమనిస్తే నీవు చూసే తత్వాన్ని వదలకుండా ఎప్పుడూ ఉన్నావు. అప్పుడు నీ స్వరూపం మంచిది కాదు, చెడ్డది కాదు, అది శివస్వరూపం.
ఆ స్వరూపమే ఈ శవానికి ఆధారమై ఉన్నది.
అని తెలియజేస్తూ శివస్వరూపులైన నా మిత్రులందరికీ శిరస్సు వంచి ఈ శుభసాయంత్రంలో నమస్కరిస్తున్నాను.
ఇట్లు నీ మిత్రుడు
ఈ కృష్ణ దాసుడు
Doordarshan Bhavavallari songs Audios#4 Melody Albums#Yedavalli_Sudarshan_Reddy
Doordarshan Bhavavallari songs Audios
Internet Archives Org. Playlist Link:
https://archive.org/details/@telugudevotionalswaranjali/lists/16/doordarshan-bhavavallari-songs
SWARANJALI BHAKTI SONGS@DOORDARSHAN VIDEO: https://archive.org/details/bhakti-songs-nidadavolu-sarveshwar-rao-doordarshan-programme_20260607/%23Bhakti+Songs%23Nidadavolu+Sarveshwar+Rao%23DOORDARSHAN+%23PROGRAMME.mp4Wednesday, November 11, 2026
TVRK Murthy#Vishwapathi#ఆధ్యాత్మిక ఇంజనీర్
టి.వి.ఆర్.కె. మూర్తి పూర్తి పేరు తిమ్మరాజు విశ్వపతి రామ కృష్ణ మూర్తి. వీరి కలం పేరు విశ్వపతి. ఆధ్యాత్మిక ఇంజనీర్, కార్టూనిస్ట్, తిరుమలేశుడి విశేషాలపై ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు.
విశ్వపతిగారి వయస్సు 66 ఏళ్లు, విద్య: వరంగల్ NIT(రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ) లో ఎంటెక్ 1982 లో పూర్తిచేశారు. గత వృత్తి ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్ గా ఉద్యోగం. ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాలు రచన, ఉచిత పంపిణీ. నగరంలోని మోతీనగర్ చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు. కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పంచుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిదర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన ఈయన...ఆల్విన్ కంపెనీ లోను, ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పనిచేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో 'సమ్ ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు. తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్లో lordofsevenhills.com వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన ఆనవాయితీ. ఎందరికైనా... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకాలను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు.
Tuesday, November 10, 2026
CHAITANYA BHAGAVAD GITA_SWAMI SUNDARA CHAITANYANANDA. 18 chapters PDF BOOKS
#Chaitanya_Bhagavadgita#4 VOLUMES PDF BOOKS#18 chapters LyricalAudioVideos#Pravachanamulu_14 Chapters_videos#swami_sundara_chaitanyananda
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
-
LORD SHIVA SONGS MY COLLECTION నేను సేకరించిన lord shiva భక్తీ పాటలు 500 లను ఒక డీవీడీ లో వేసికొని మీరు వినవచ్చును లేదా భక్తులకు గాని లే...































