Tuesday, May 26, 2026
Sunday, May 24, 2026
పాడెద నీ నామమే గోపాలా
పాడెద నీ నామమే గోపాలా....
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాలా
చరణం : 1
మమతలలోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
పాడెద నీ నామమే గోపాలా
చరణం : 2
నీ ముర ళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ ముర ళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై (2)
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా ॥
Saturday, May 23, 2026
Thursday, May 21, 2026
Tuesday, May 19, 2026
# SRIMADBHAGAVADGITA_SUNDARACHAITANYA#18_Chapters_Videos_Links_Archive.org
https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-anugraha-bashyam https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-dhyana-slokamulu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-1-arjuna-vishadayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-2-sankhyayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-3-karmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-4-gnana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-5-karma-sanyasa-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-6-aatma-samyamyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-7-vignana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-8-akshara-para-brahmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-9-raja-vidya-raja-guhya-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-10-vibhutiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-11-vishvarupa-san-darshanayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-12-bhaktiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-13-kshetra-kshetragna-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-14-gunatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-15-purushottamaprapti-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-16-daivasura-sampad-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-17-shraddhatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-18-moksha-sanyasayogamu
Chaitanya Bhagavadgita Vol-02#chapters_4 to 7 #swami_sundara_chaitanyananda
LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy
LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy
Home Recording in 1990 for practice purpose.
DIRECT ARCHIVE ORG. LINLK: CLICK HERE
Monday, May 18, 2026
Sunday, May 17, 2026
ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము మూలం: వేదవ్యాస మహర్షి వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద #తెలుగు వికీపీడియా LINK
కలియుగము ప్రబల దోషయుత మైనను దాని
నివారణము కూడా కలియుగము - నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు.
కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు.
“ఓం నమో భగవతే వాసుదేవాయ”
ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది.
హరిః సదా వసే తత్ర యత్ర భాగవతా
జనా:గాయని భక్తి భావేన హరేర్నామైవ
కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయు చుందురో అచ్చట శ్రీహరి వసించుచుండును.
నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణు డున్నచోట నరకముండదు. జనార్దన నామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలాయన మౌతుంది. భవరోగాలకు భీతి చెందకండి. భగవన్నామం భయాలను భయ పెడుతుంది.
వాతావరణ కాలుష్యం పోవాలా ?
ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచండి. ఆంతర్య కాలుష్యం తొలగాలా ? అచ్యుతుని నామాన్ని గానం చేయండి. - ఏ కులంవా రెనా చేయవచ్చు. ఏ మతం వారైనా చేయవచ్చుకుళ్ళు సృష్టించినకులాలు కుళ్ళిపోనీ..
ముళ్ళు పరచిన మతాలు మరలిపోనీ. కులాలు మనకొద్దు. అనుకూలమే మన కులం....... మతాలు మనకొద్దు. సమ్మతమే మన మతం..........
నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టండి.
కలి పురుషుని ఆగడాలకు కళ్ళెం వేయండి. మంచితనానికి మనిషి తనానికి శుభ పరిణామం ఈ సమయం. కలసి కట్టుగా నామం చేద్దాం ప్రభునామానికి నియమం లేదు....
బుధజన సేవలో
సుందర చెతన్యాశ్రమం గాంధీ జయంతి
ధవళేశ్వరం 2-10-193
.
SRI BHAGAVATAM ETV EPISODES 21 To 25
SRI BHAGAVATAM ETV EPISODES FROM 01 TO 241 LINK:
https://mega.nz/folder/AZZxhJQB#K8sQpIbEaPoY_1cFb7YYLA
SRI BHAGAVATAM ETV EPISODES FROM 18TO 200 LINK
https://drive.google.com/drive/folders/139cq42LJy5px70nRZe_V87ef40g7mVfX?usp=drive_link
SRI BHAGAVATAM ETV EPISODES FROM 201TO 241 LINK
https://drive.google.com/drive/folders/1A2anoh0vPp_99IM2wRpVz8brFi78p2Xk?usp=drive_link
Saturday, May 16, 2026
AMMA_BOOK అమ్మ ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన .... అమృత భాండం అమ్మ .....
AMMA_BOOK
అమ్మ
ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన ....
అమృత భాండం అమ్మ .....
జీవ భాషలో కావ్యం నెరపిన ....
అమర కోశం అమ్మ ....
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది ....
ఋణం తీర్చలేని అమ్మకి ....... LINK:
https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing
అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు...
ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి....
ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా...
ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం...
Venkat Garikapati
" అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతుల పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... ..........................నీవు లేవురా
గుడిలో ఏముంది? ఏముంటుందో - గుడిలో అదే ఉంటుంది నాయనా! #-భండారు శ్రీనివాసరావు 98491 30595
గుడిలో ఏముంది? ఏముంటుందో-
గుడిలో అదే ఉంటుంది నాయనా!
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూ రమణలు. 'బుడ్డూ' అంటాడు గోపాళం. 'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ. 'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ, పేరు లేదా ఆయ్' అంటాడు
అగ్నిహెూత్రావధాన్లు. 'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణగారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం. 'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది
సీగానపెసూనాంబ. శాలీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు
బాపూరమణల బుడుగు. అలానే దేవుడు!
దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం.
నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అం
టారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'. దేవుడి పేరుపెట్టి మను
షులుఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే మిగిలినవన్నీ
ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగె
'సుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని
చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అం
టుంటారు.
'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ
పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని,
అన్నీ ఆయనకే ఒదిలి చాపచుట్టేయడం ఇంకా పనికిమాలిన పని.
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు. ఉన్నాడని నమ్మేవా
ళ్ళంటారు. దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించ
డం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా
నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి.
ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే
ఉంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు
చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం
దర్శనం ఇస్తూనే వుంటారు. వీరు కాక మరో రెండు తరగతుల
వారు ఉన్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని
వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు.
మనసా వాచా కర్మణా పూర్తిగా దేవుడిని నమ్మేవారు రెండో రకం.
వీరుకూడా తాము నమ్మే భగవంతుడిని బజారుకు లాగరు. గుం
డెల్లోనే గుడి కట్టుకుని ఉంచుకుంటారు. టీవీ ఛానళ్ల వారికి కూడా
వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటే వారి రేటింగులకు కావా
ల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడి కోసం
పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న
మాత్రం అనాదినుంచి ఉంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య
దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ
ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు. వ్యర్థ
వాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ
దేవుడే చూసుకుంటాడు. ఆ మాటకూడా ఆయనే చెప్పాడు
గీతలో. 'మీ పని మీరు చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి'
అని. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు ఉన్నాడని
ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తిం
నీమదిలో నిలిచేవారు, వారు నాస్తికులయినా సరే,
సర్వశక్తి కలిగిన ఓ అగోచర శక్తి ఒకటి ఉండేవుంటుందని అనుకుంటే పేచీ
లేదు. అలాగే దేవుళ్ళని నమ్మే వాళ్ళు కూడా. భగవంతుడు ఉన్నాడని
పూర్తిగా విశ్వసించేగజేంద్రుడే మొసలి నోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు, 'కలడు కలండనెడివాడు కలడో
లేడో?' అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.ఒక్కోసారి దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పినమాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్ధుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు ఆమాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్ధుడు దేవుడా అంటే అది మరోచర్చ) 'నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే
వుంటాన'ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు? 'చెట్టులో, పుట్టలో
అంతటా నేనే' అన్నా చెవినపెట్టే దెవరు? చిన్నదో పెద్దదో ఓ
గుడికట్టి అక్కడే కట్టిపడేశారు. గుడిలో ఆయన్ని కొలువుంచినంతమాత్రాన ఆయన అక్కడే ఉండి పోడు. 'ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడు' అన్నట్టు దేవుడు మందిరంలో ఉంటాడు, నమ్మినవారి మనోమందిరంలోను ఉంటాడు. మరి ప్రత్యేకంగా ఆయనకు ఓ గుడి ఎం
దుకు అనే ప్రశ్న వస్తుంది తప్పదు.
దేవుడి మీద గురికుదరడం కోసం గుడి. ప్రశాంత, ఆధ్యాత్మిక
వాతావరణంలో దేవుడి మీద ఏకాగ్రత నిలుపుకోవడం కోసం.
ఆయన అక్కడ ఉన్నాడు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్లి ఓ
దండం పెట్టుకుంటాం. అసలు గుడి రహస్యం వేరే ఉంది అనేవారి
వాదన వేరు. మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొర
తగా ఉండే పరమ పాత రోజుల్లో పులిహారో, పాయసమో చేసి
గుడికి వచ్చిన జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ
మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం. ఆ పాతకాలపు
రోజుల్లో పల్లెల్లోని వయోవృద్ధులకు, అభాగ్యులకు గుడి ప్రసా
దమే మహాభాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధు
లకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుం
టున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొం
తంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు పైకం చేతిలో పెడితే ఏం ప్రయో
జనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో ప్రసా
దంగా లభించే పులిహారో, దక్షోజనమో, దాన్ని మించింది
ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో
తరిస్తున్నాయి. ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో
డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహెూర, పోషకాలు
సమృద్ధిగా వుండే దధోజనం, పాయసం వీటికి మించిన మధ్యా
హ్న భోజనం ఏముంటుంది. అలాగే గుడి అనేది తెలియని విష
యాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చే బడి కూడా. ఊరి
జనం నలుగురూ అరమరికలు లేకుండా ఒకచోట కలుసుకోవడా
నికి గుడిని మించిన సామాజిక వేదిక వేరేమివుంటుంది. పంచాంగ శ్రవణం పేరుతో వానలు ఎలా పడతాయి, ఏపంటలు వేసుకుంటే గిరాకీ ఉంటుంది అనే వివరాలు తెలిసేవి. వాటినినమ్మొచ్చా అంటే మరి ఆ రోజుల్లో పంచాంగమే వారికి గూగులమ్మ. గుడి పూజారే చిన్నా చితకా రోగాలను నిదానం చేసేవైద్యుడు. వాళ్లకు వైద్యం ఏమి తెలుసు ఇది పూర్తిగా అనాగరికం అంటే మరి ఆ పల్లె జనం ఏం చేయాలి? ఎక్కడకు పోవాలి? చదువుకున్న డాక్టర్లు పల్లెటూళ్ళకు పోరు. ఊరిజనం పట్నాలకు
పోలేరు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే నానుడి లాగా, గుడి
అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని
సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధి
స్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే
అవసరం ఉండదు. అయితే, ప్రతిదీ రాజకీయమయమయి పో
తున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమా నమే. ఇక్కడ
గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు అది ఒక మసీదు కావచ్చు. ఒక చర్చి కావచ్చు, ఒక గురు ద్వారా కావచ్చు. మరో మతానికి చెందిన దైవ మందిరం కావచ్చు. అవి ఏవైనా, నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే. కాబట్టి దేవుడ్ని గుడికి పరిమితం చేయవద్దు.
గుడిని పెత్తందార్లకు
-భండారు శ్రీనివాసరావు
98491 30595
ఆంధ్రప్రభ https://epaper.prabhanews.com/c/62175338
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
A.jpg)

