Saturday, March 14, 2026

sundara chaitanyashramam latest special video


*_మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి._*
*_మనిషికి మనస్సు అనేది ఒకటుంది. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే.. జీవితం నరకపాయంగా మారుతుంది._*
*_ఈ సృష్టిలో రకరకాల జీవులున్నాయి. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి.ఎందుకంటే అవన్నీ జీవించటానికి తమ శరీరాలను నిలుపుకోవటానికి ఆవశ్యకమైనవి ఏవో అవి లభిస్తే చాలు._*
*_మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది. దప్పిక కలుగుతుంది. తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది. ఆకలి అవుతుంది. కడుపునిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి అని అంటే వద్దు, వద్దు, ఇక చాలు అని అంటాడు._*
*_నిద్ర విషయమూ అంతే. రాత్రంతా గాఢంగా నిద్రపోతే, ఉదయాన్నే సంతోషంగా లేచి పనిచేయటానికి ఉపక్రమిస్తాడు._*
*_అయితే మనిషికి మనస్సు అనేది ఒకటుంది. దాన్ని తృప్తి పరచడం కష్టముతో కూడుకున్న పని. కోరికలు పుట్టేది అక్కడే.అవి అనంతములు. ఒక్క కోర్కెను తీరిస్తే వంద కోరికలు పుట్టుకొస్తాయి._*
*_ఓషో ఒక కథ చెబుతాడు..._*
*_ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వేయమని కోరాడు. రాజే స్వయంగా వచ్చి ఏమి ఇవ్వమంటావు..? అన్నాడు. ఏమి ఇచ్చినా పర్వాలేదు గానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్షాపాత్రను రాజుకు చూపాడు ఆ భిక్షగాడు._*
*_అదేమంత కష్టం, ‘ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వేయండ్రా’ అన్నాడు భటులతో._*
*_వారు ఆ భిక్షాపాత్రలో ఎన్ని వేసినా నిండలేదు._*
*_అద్భుతం!_*
*_‘ఈ పాత్ర దేనితో తయారుచేయబడింది..?’ అని ప్రశ్నించాడు రాజు._*
*_‘ఓ రాజా! ఈ పాత్ర మనిషి పుర్రె’ అన్నాడు భిక్షగాడు._*
*_అసలు విషయం అర్ధమవుతుంది. అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అది. ఎంతిచ్చినా తృప్తి చెందదు, ఏమిచ్చినా తృప్తి చెందదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు మనిషి._*
*_ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు. నాలుగిండ్లు కావాలి అంటాడు మనిషి. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. లక్షరూపాయలుంటే తృప్తి లేదు, కోటి రూపాయలు కావాలి. రెండు తరాలకు సరిపడే ఆస్తి ఉంటే తృప్తిలేదు,పది తరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టాలి._*
*_ఇక శాంతి ఎక్కడుంటుంది..? జీవితమంతా ఆరాటము, పోరాటమే, ఆందోళన, అలసటే..._*
*_అందుకే ఉన్నదానితో తృప్తి పడు అంటారు పెద్దలు. సంతృప్తిగా జీవించడం ఒక కళా.._*
*_అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదు._*
*_వేదాధ్యనము, జపము, దానము ఈ మూడింటి విషయంలో చేసినది చాలు అను తృప్తి ఉండరాదు._*
*_తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే జీవితం అశాంతితో రగిలిపోతుంది. శాంతి లేని జీవితం నరకము తో సమానం._*
*_ఈ విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవ పూర్వకంగా గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు._*

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

LORD KRISHNA SONGS

LORD KRISHNA MALAYALAM DEVOTIONAL SONGS NARAYANA KRISHNA HARI NARAYANA KRISHNA from Yedavalli Sudarshanreddy on Vimeo . NARAYANA...