Monday, March 9, 2026

*ఆమే ఆధారం* # అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026

 

*ఆమే ఆధారం*

 పుట్టుక నాది పురిటి నొప్పి నీది
 ఆలన పాలన నాది అమ్మ ప్రేమ నీది
 ఆటలు అల్లరి నావి సోదరిగా ఆలంబన నీది
 అనుభూతులు నావి భార్యగా భరించేది నీవు 
 ఆస్వాదన నాది కూతురుగా ఆప్యాయత నీది 
 అనురాగం నాది కోడలుగా ఆదరణ నీది 
 ఆనందం నాది మనమరాలిగా అనుకరణ నీది 

 అద్భుత సృష్టికి ప్రతినిధి నీవు 
 ఎన్నో రూపాలలో తారసపడి 
 ప్రేమ పంచి అవసరాలన్నీ తీర్చిన 
 అపురూప రూపం నీవు 
 నీవు లేక నే లేనే లేను 
 నీవు లేక నేనేమీ కాను
💐🙏 ఓ మహిళా నీకు వందనం 🙏💐

 ప్రేమ స్వరూపిణులైన మహిళా మణులందరికీ నా హృదయపూర్వక 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐❤️🙏

    ✍️ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్) & Flutist🪷
              08-03-2026


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

మనసుకు ప్రశాంతత ఇచ్చే ధ్యాన గీతం# Lord Buddha Special Telugu Song | Samata Mamatalu Panchi Telugu Song

   మనసుకు ప్రశాంతత ఇచ్చే ధ్యాన గీతం DOWNLOAD VODEO: CLICK HERE  Lord Buddha Special Telugu Song DOWNLOAD VODEO: CLICK HERE