Monday, November 27, 2023

#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు.

#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. మీ అరవై ఏండ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని పదేండ్లలో మార్చగలమా ...?? మార్పు ఇవ్వాల మీరు కొత్తగా అడిగేది ఏంది ...?? తెలంగాణా వాళ్లే మార్పు కోరుకొని పదేండ్ల కిందనే మిమ్మల్ని బొంద పెట్టిండ్రు. ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లల్లో నిలబడ్డ రోజుల్ని మేము ఇంకా మరువలే .... తాగు నీళ్లకోసం ట్యాంకర్ల చుట్టూ తిరిగిన మీ కాలపు రోజుల్ని మేము అస్సలు మరువలే .... కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కట్టిన 36 ఫ్లయ్ ఓవర్లు లేని రోజున ట్రాఫిక్ కష్టాల్ని మేము మరువలే ... 33 మెడికల్ కాలేజీలు ఉన్న మేము 3 కాలేజీలతో వైద్య విద్యకు మా పిల్లల్న దూరం చేసిన రోజుల్ని మరువలే ... ఫ్లోరైడ్ నీళ్లు నిత్యం తాగుతూ వంకర్లు పోయిన కాళ్ళు చేతులతో మమ్మల్ని ఏడిపించిన రోజుల్ని అస్సలు మరువలే ... బతుకు కోసం వలసపోయిన పాలమూరు బతుకులు ఇంకా మరువలే .... ఎన్నని చెప్పాలే ... ఇప్పుడే సల్లగా బతుకుతున్న మా మీదా #మార్పు అంటూ మీ అధికారం కోసం చేసే దండయాత్ర మాత్రం ఎట్లా మరుస్తాం .... మా ఓటు తో మిమ్మల్ని మాల్లోక్కసారి బొంద పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం .... కారు మాదే ... సర్కారు మాదే .... జై తెలంగాణా .... ✊

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...