Monday, November 6, 2023

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా#swami_sundara_chaitanyananda

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా * ఆశలన్నీఅలలేనా ఆనందాలన్నీ కలలేనా కళకళలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా * మనసులు కదిపి మమతలు చూపి మంటలురేపే గతియేనా మంచిని కుదిపి వంచన చేసి బూదిగ మిగిలే తిధియేనా *పొరపాటులు యెడబాటులు యెదబాధలు విధియేనా అశ్రులు నిండిన అనుభవ ధనమే మనిషికి మిగిలిన నిధియేనా * అభిమానాలతో అవమానాలతో శతమానంభవతి అలజడి నిండిన ఆవేదనలతో శోకమయం జగతి నీకేదైనా నీవేమైనా వీడదు ధర్మం నిరతి నిండే యెండే జగతి చెఱువులో తీరనిగతికేరీతి జ్ఞానము పంచే చైతన్యగీతి ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

నిత్య పఠన శ్లోకములు #view #share

 సుందర విజ్ఞాన గ్రంధాలయం ద్వారా భక్తులకు నిత్య పఠన శ్లోకములు pocket size booklet  లాగా ప్రింట్ చేసి అందజేసినాము మీరు ప్రయత్నించండి సాధన కొరక...