Friday, September 11, 2026

Indic Wikimedians...Pranayraj Vangari...10 Years of #WikiChallenge

  Indic Wikimedians



10 Years of #WikiChallenge
One More Milestone Reached
(08.09.2016 - 07.09.2026)
3,652 Days... 11,500+ Articles created in Telugu Wikipedia
Today, I am extremely happy and proud to share that I have completed 10 years of my #WikiChallenge — 3,652 consecutive days of creating at least one article every single day on Telugu Wikipedia.
What started on September 8, 2016, with the “100 Days – 100 Wiki Articles” Challenge, has now become a 10-year journey without missing even a single day.
During these 10 years, I have created 11,500+ new articles on Telugu Wikipedia, contributing to the growth and spread of free knowledge.
I feel truly fortunate to have completed what I believe is a rare milestone in the history of Wikipedia — writing at least one Wikipedia article every day continuously for 10 years (3,652 days).
I am also very happy that this milestone was celebrated at Wikiconference India 2026 in Kochi on September 6, 2026, where the Telugu Wikimedians User Group felicitated me in the presence of Wikimedia Foundation Board of Trustees members Lorenzo Losa and Victoria Doronina.
I am deeply grateful to all the Telugu Wikimedians and Wikimedians from different language communities who joined the celebration and congratulated me.
Thank you to everyone who has supported, encouraged, and inspired me throughout this incredible journey.
This is not just my personal milestone — it is a celebration of free knowledge, Telugu Wikipedia, and the wonderful Wikimedia community.
10 Years. 3,652 Days. 11,500+ Articles. One Unbroken WikiJourney.
The journey continues…

(September 08, 2016, to September 07, 2026)
3,652 Days... 11,500+ Articles created in Telugu Wikipedia
*వికీపీడియాలో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రణయ్‌రాజ్ వంగరి
*వరుసగా 10 ఏళ్ళు (3,652 రోజులు) రోజూ ఒక వికీ వ్యాసం రాసిన తొలి వికీపీడియన్‌గా చరిత్ర
ఉచిత సమాచార విజ్ఞాన వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ కి చెందిన తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరి అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
వికీపీడియాలో ‘100 రోజులు - 100 వికీవ్యాసాలు’ ఛాలెంజ్‌తో ప్రారంభించి, రోజుకొక వ్యాసం చొప్పున వరుసగా 10 సంవత్సరాల (3,652 రోజులు) పాటు నిరంతరాయంగా వికీ వ్యాసాలు రాసిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు.
2016 సెప్టెంబరు 8న ప్రతిరోజూ ఒక వ్యాసం రాయడం ప్రారంభించిన ప్రణయ్‌రాజ్ వంగరి, 2026 సెప్టెంబరు 7 నాటికి ఒక రోజు కూడా విరామం లేకుండా 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో ఆయన తెలుగు వికీపీడియాలో ఏకంగా 11,500 కి పైగా కొత్త వ్యాసాలను సృష్టించారు.
*ప్రణయ్‌రాజ్ వికీపీడియా ప్రయాణ విశేషాలు & మైలురాళ్ళు:
* 100 రోజులు - 100 వ్యాసాలు: సెప్టెంబరు 8, 2016 నుండి డిసెంబరు 16, 2016 మధ్యకాలంలో ‘100 రోజులు - 100 వికీవ్యాసాలు’ ఛాలెంజ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
* వికీవత్సరం (365 రోజులు - 365 వ్యాసాలు): 2016 సెప్టెంబరు 8న ప్రారంభించి 2017 సెప్టెంబరు 7 నాటికి ‘వికీవత్సరం’ పూర్తి చేసి, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అభినందించడమే కాకుండా ప్రగతి భవన్‌లోని తన ఛాంబర్‌లో సత్కరించారు.
* తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ తొలి అవార్డు: 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న తెలంగాణ ప్రభుత్వ సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ నిర్వహించిన వార్షిక నివేదిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ‘లోకలైజేషన్ (స్థానికీకరణ)’ విభాగంలో ప్రణయ్ తొలి అవార్డును అందుకున్నారు.
* 1000 రోజులు - 1000 వ్యాసాలు: 2019 జూన్ 4 నాటికి వరుసగా 1000 రోజుల్లో 1000 వ్యాసాలు పూర్తి చేశారు.
* 1500 రోజులు - 1500 వ్యాసాలు: 2020 అక్టోబరు 17 నాటికి 1500 రోజుల్లో 1500 వ్యాసాల మైలురాయిని దాటారు.
* 2000 రోజులు - 3015 వ్యాసాలు: 2022 మార్చి 1 నాటికి 2000 రోజుల్లో 3,015 వ్యాసాలు రాశారు.
* 10 ఏళ్ళ ప్రపంచ రికార్డు (3,652 రోజులు - 11,500+ వ్యాసాలు):* 2016 సెప్టెంబరు 8 నుండి 2026 సెప్టెంబరు 7 వరకు వరుసగా 10 ఏళ్ళ పాటు ప్రతిరోజూ వికీపీడియా వ్యాసం రాసి, మొత్తం 11,500 కంటే ఎక్కువ వ్యాసాలను సృష్టించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక వికీపీడియన్‌గా రికార్డు నెలకొల్పారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని, 2026 సెప్టెంబర్ 6వ తారీఖున కేరళలోని కొచ్చిలో జరిగిన వికీ కాన్ఫరెన్స్ ఇండియా (2026) సదస్సులో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నిర్వహించిన సత్కార కార్యక్రమంలో వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్స్ లోరెంజో లోసా, విక్టోరియా డోరోనినా లు పాల్గొని ప్రణయ్‌రాజ్ ను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికీమీడియన్లు విజే సుశీల, కృపాల్ కశ్యప్, పవన్ సంతోష్, నేతి సాయికిరణ్, దివ్య, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ లతోపాటు ఇతర భాషలకు చెందిన దాదాపు 250 మంది వికీమీడియన్లు పాల్గొని, ప్రణయ్‌రాజ్ ను అభినందించారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా#swami_sundara_chaitanyananda

జీవితమింతేనా download link: https://mega.nz/file/Pk41TRLC#iUM0V7SELvQgYrjcFlJPiyH-Un2-gi-n08j0JBKpDzY   మరపురాదు నీదయ download link : htt...