“హనుమా! నీకు నేను ఇచ్చిన వస్తువును
చూడగానే రామునికి ఆనవాలు బాగా
తెలుస్తుంది. చూడామణిని చూడగానే
కౌసల్యాదశరథులు, నేను రామునికి జ్ఞాపకము
వస్తాము. నాయనా! నా విషయంలో ఏమేమి
చేయాలో అంతా నీవే ఆలోచించాలి”.
త్వ మస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమన్ యత్న మాస్థాయ దుఃఖ క్షయకరోభవ ||
“హనుమంతుడా! ఈ కార్యనిర్వహణలో నీవే
ఆలోచించాలి. నీ ప్రయత్నముతో నాదుఃఖాన్ని
పోగొట్టు" అన్నది సీతమ్మ. తథేతి - "అలాగే" అన్నాడు
హనుమంతుడు.
ఇక్కడ నాదొక్క (పూజ్య శ్రీ సుందర చైతన్యానందుల వారి)సలహా.
జీవితమొక భయంకర సంగ్రామము. ఎప్పుడు, ఏవైపునుండి,
ఏవిధమైన కష్టా లొస్తాయో, దుఃఖా లొస్తాయో తెలియదు. వాటిని
పోగొట్టుకొనే ప్రయత్నంలో మనం ఎంతో శ్రమిస్తూ ఉంటాము.
మీకు కష్టాలు వచ్చినప్పుడు గాని, బాధలు ఎదురైనపుడు గాని,
సమస్యలు భయంకరంగా తలెత్తినపుడు గాని, వాటి పరిష్కారానికి
వారు యత్నించబోయే ముందు, హనుమంతుని మనసులో భక్తితో
ప్రార్థించి, పై శ్లోకాన్ని మూడుసార్లు ధ్యానించండి. తరువాత
మీప్రయత్నాన్ని సాగించండి. ఆంజనేయుడు నాకు అండగా ఉండి
మీ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు.దేనికైనా విశ్వాస ముండాలి.
విశ్వాసము పర్వతాల్ని కదిలిస్తుంది. సాగరచలనాన్నినిరోధిస్తుంది.
సూర్యచంద్రుల గమనాన్ని అడ్డగిస్తుంది. కార్యభారాన్ని
స్వీకరించమని, దుఃఖాన్ని పోగొట్టమని సీతమ్మ ప్రార్థించగానే
హనుమంతుడు“తథేతి" "అలాగే" అన్నాడు. అంతకన్నా మనకు
ఏమికావాలి? మారుతి మాటను విశ్వసించి మనుగడను
మహోన్నతంగా తీర్చిదిద్దుకుందాం.
పూజ్య శ్రీ సుందర చైతన్యానందుల వారు

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.