Thursday, October 9, 2025

భగవద్గీత సారాంశము

 

పరమాత్మనేనమ మః                                                                     శ్రీ గురుధ్యానము:

                                              భగవద్గీత సారాంశము

వ్యర్థంగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు?

ఎవరు నిన్ను చంపగలరు? ఆత్మకు చావులేదు, పుట్టుకాలేదు జరిగిన దానిగురించి బాధ,

జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, అంతా మన మంచికే. జరగబోయే దాని గురించి 

ఆతృతావద్దు. జరుగుతున్న వర్తమానం మీద శ్రద్ధ వహించు. నీదేమి పోయిందని దుఃఖిస్తున్నావు? వెంట ఏమి తెచ్చావని నీవు పోగట్టుకున్నానని బాధ పడడానికి ? నువ్వేం ఉత్పత్తి చేసావు, అది నాశనమైందని చింతించడానికి ? నువ్వేమీ వెంట తీసుకుని రాలేదు. సంపాదించిందేదో 

ఇక్కడే సంపాదించావు.,. ఇవ్వడం కూడా ఇక్కడి వారికే ఇచ్చావు అంతేకాదు, తీసుకున్నది కూడా, 

పరమాత్మ దగ్గర నుంచే  తీసుకున్నావు. ఇవ్వడం కూడా, పరమాత్మకే ఇచ్చావు. ఖాళీ చేతులతో, వచ్చావు, తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్తావు. ఈ రోజు నీదనకుంటున్నది, నిన్న వేరొకరిది, మొన్న ఇంకెవరిదో. దీనిని నీదనుకుని మురిసి పోతున్నావు. ఈ ఆనందమే, నీ దుఃఖాలకు మూలం.

మార్పు జీవన సిద్ధాంతం. నీవు మృత్యువని భావిస్తున్నావే, నిజానికి అది జీవితం. ఒక్క క్షణంలో నీవు కోటిశ్వరుడవు కాగలవు, మరుక్షణంలో దరిద్రుడవూ కాగలవు. నాది. నీది, చిన్న, పెద్ద, స్వపర,

వంటి భేద భావాల్ని తొలగించుకో, అప్పుడు అన్నీ నీవిగా, అందరూ నీవారుగా, నీవు అందరికీ చెందిన వ్యక్తిగా భావించుకోగలుగుతావు.

ఈ శరీరం నీది కాదు, నువ్వీ శరీరానికి చెందిన మనిషివీ కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, మట్టి, ఆకాశం - వీటితో తయారైంది. తిరిగి వాటిలోనే ఐక్యమైపోతుంది. కాని, ఆత్మ శాశ్వతమైనది,

మరి నీ వెవరు ?

నిన్ను నీవు పరమాత్మకు అర్పితం చేసుకో. ఇదే నీకు సర్వోత్తమమైన ఆధారం. ఇది తెలిసినవారికి భయము, చింత, దుఃఖము కలుగవు..

నీవు చేసే ప్రతి పనినీ ఈశ్వరార్పితం చెయ్యి. ఇలా చేయడం వలన నీకు సదా జీవన్ముక్తికి సంబంధించిన అనందం కలుగుతుంది.

(కృష్ణం వందే జగద్గురుమ్)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Archives links#must_view#must_share

https://archive.org/details/bhajale-re-man-krishna-bhajan-by-yesudas_202408 https://archive.org/details/madhurashtakam-by-yesudas-adharam-m...