Saturday, October 11, 2025

రాగాలు రోగాల్ని కుదురుస్తాయి...& "అల్లం తల్లిలాంటిది" అనే సామెత

రాగాలు రోగాల్ని కుదురుస్తాయి...

సంగీతానికి శ్రమ మరపించే శక్తి, వ్యాధులు నయం చేసే గుణం ఉంది.

 - శరీరంలో మెదడు పెరుగుదలకు సంగీతానికి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంది .

- సంగీతం, మాటలు రెండూ మన మెదడులోని అర్ధగోళాలను స్పందింపజేస్తున్నాయని తెలుస్తున్నది.

- మానవత్వానికి దృష్టికన్నా వినడంతోనే ఎక్కువ సంబంధం ఉంది. పసిగుడ్డు కనులు విప్పక ముందే శబ్దాలు వినగలుగుతుంది. గర్భ౦లో పెరుగుతున్న పిండం కూడా తల్లి, మాటలు, గుండెచప్పుడు,

ఆమె చుట్టూ వినిపిస్తోన్న శబ్దాలు వినగలుగుతుంది.

- లయబద్ధమైన సంగీతం దైనందిన జీవితంలో నుండి మనలను మరో ప్రపంచం లోనికి తీసికెళ్ళి కాసేపు సర్వం మర్చిపోయేలా చేస్తుంది.

- మనిషికి క్షణాల్లో సేద తీర్చే శక్తి సంగీతాని కుంది.

- సంగీతం వింటూ పనిచేసుకుంటున్న వర్కర్స్ మానసిక ధైర్యం పెరగటమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందట

- బాధాకరమైన శస్త్రచికిత్సలకు కూడా 15 నిమిషముల ముందు సంగీతాన్ని వినిపించినట్లయితే,

ఆ పేషెంట్ కు ఇవ్వవలసిన మత్తుమందు సగమిచ్చినా సరిపోతుందని పరిశోధనలో తేలింది.

- సంగీతం మెదడు కన్నా నరాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని కొందరి అభిప్రాయం

- డిప్రేషన్ లో ఉన్న వ్యక్తికి అక్షర సంగీతం చాలా ఉపయోగకరం

- నరాల బలహీనత ఉన్న వ్యక్తికి Instrument Music చాలా ఉపయోగకరం

- పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తికి Fast Music ను ఆస్వాదించేలా చేయడం డాక్టర్ పని.

- ఆనందభైరవి రాగం ఆందోళనతో బాధ పడేవారికి చాలా ఉపయోగకారి

- శంక భరరరాణం - మానసిక స్థిమితం లేనివారికి చాలా ఉపయోగకారి

కాబట్టి ఆనందం ఇవ్వడంతో బాటు, ఆరోగ్యానికి మేలు చేసే సంగీతాన్ని

మరింత దగ్గరకు చేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది.


"అల్లం తల్లిలాంటిది" అనే సామెత

అల్లాన్ని తగిన మోతాదులో వాడితే వీర్యవృద్ధి, దేహపుష్టి, కలిగి శరీం కాంతివంతమవుతుంది.

- అల్లం వాడకం వలన పాండువు, ఉబ్బు, కంఠము, నాసికములలో వచ్చు వ్యాధులు అరికట్ట బడతాయి.

- అల్లం తగిన మోతాదులో వాడితే 'లివర్ 'కు బలం చేకూరుతుంది. లివర్ ను శుభ్రపరచడంలోనూ, కడుపులోని క్రిములను నశింప చేయటంలోనూ శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం రసం

కుంకుమపువ్వు కొద్దిగా మిశ్రమం చేసి దూది ముంచి ముక్కులో రెండు లేదా మూడు చుక్కలు వేస్తే తలనొప్పి వెంటనే తగ్గి పోతుంది. అల్లం బెల్లంతో కలిపి తింటే అరికాళ్ళు, అరచేతులపై నాలుకపై ఊడే పొరలు గట్టిపడతాయి. అల్లం. రసం 2 చెంచాలు, తేనే 2 చెంచాలు, దనియాల రసం,

నిమ్మకాయ రసం, ఒక గ్లాసు నీళ్ళలో కలిపి రోజూ ఉదయంపూట తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.

గుండె బలంగా ఉంటుంది. అల్లంరసం, పసుపు, తులసి ఆకు, నూరి చర్మవ్యాదులు వున్నచోట దద్దుర్లు, దురదలు, మచ్చలు మొదలైనవి పోయిమొటిమలు తగ్గిపోతాయి. గోమూత్రంలో 3 రోజులుంచి తీసిన

కరక్కాయ చూర్ణంను అల్లం రసంలో ఊరబెట్టి మూకుడులో చూర్ణం మిగిలేవరకూ వేసి ప్రతిరోజు మూడు

వేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో పుచ్చుకుంటే బోదకాలు తగ్గుతుంది.

-అల్లం శుభ్రంగా కడిగి, చర్మం తీసివేసి ముక్కలుగా తరిగి ఉప్పు మిశ్రమంలో ముంచి తింటే అజీర్ణం, పుల్లని త్రేపులు, హరించివేస్తుంది, నోటి వెంట నీరు వూరటం కూడా తగ్గుతుంది .

** 

మీరు జీవితాన్ని ఇతరుల వ్యక్తిత్వం కోసం పెట్టుబడిగా పెడితే అతి వివేకంతో కూడుకున్న

గొప్ప పెట్టుబడి అవుతుంది. యువకులు మంచి .చెడుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకునేలా చేసే ,

ఏదో పురోగతి కాకుండా అతి ఉత్తమమైన అభివృద్ధిని కాంక్షించి వారిలా తీర్చిదిద్దే చదువును మీరు చెప్పించగలిగితే వారు తమకు యోగ్యమైన ఉన్నత లక్ష్యాలను ఎన్నుకుని ఆ దిశలో

పాటు పడతారు. వారి ఉన్నతమైన కలలు వారికి శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తాయి.

మీరు మీ జీవితాన్ని ఇతరుల బాధలను కష్టాలను దూరం చేయగల పనులను చేయడంలో

అధైర్యంగా ఉన్న వారి మాటలను చెవి ఒగ్గి ఓపికగా వినడంలో, రోగులు, వయసు మళ్ళిన వారి

సేవలో వెచ్చిస్తే మీకు తప్పకుండా భగవంతుడి పక్కన స్థానం దొరుకుతుంది.

పతితులను ఉద్దరించండంలో, చెరసాల పాలైన అభాగ్యులను చూచి రావడంలో ఆకలి గొన్నవాడి

ఆకలి తీర్చడంలో, బట్టకరువైన వారికి బట్టనివ్వడంలో, మా జీవితాన్ని వెచ్చిస్తే మీలో దయ, క్షమ

ఇతరుల పట్ల సహానుభూతిని ప్రకటించగల దయగల హృదయం, ఉదారత మొదలైనవి

చోటు చేసుకుంటాయి. (wisdom jan 97)



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

సద్గురు స్తోత్రము

ఓం గాన ప్రియాయ నమః భగవద్గుణములను కీర్తించుట యందు ప్రీతి గల వారికి నమస్కారము ఓం గాన కళాకోవిదాయ నమః గానకళ యందు నిపుణులైన వారికి నమస్కారము. ఓం ...