ఓం గాన ప్రియాయ నమః
భగవద్గుణములను కీర్తించుట యందు ప్రీతి గల వారికి నమస్కారము
ఓం గాన కళాకోవిదాయ నమః
గానకళ యందు నిపుణులైన వారికి నమస్కారము.
ఓం నాట్యాచార్యాయ నమః
స్వరూపమును సదా గుర్తుంచుకొని సంసారమున మన
పాత్ర పోషించు టెట్లో తెలుపు గురుదేవులకు నమస్కారము
ఓం కవయే నమః
క్రాంతిని దర్శించువారికి నమస్కారము.
ఓం నిగమాగమ పారగాయ నమః
వేద వేదాంగముల యందు పారంగతులైన వారికి నమస్కారము
ఓం నిత్యతృప్తాయ నమః
సదా సంతుష్టులై ఉండువారికి నమస్కారము
ఓం నిరహంకారాయ నమః
అహంకారము నంతమొందించిన వారికి నమస్కారము.
ఓం నిరామయాయ నమః
భవరోగ దూరునకు నమస్కారము.
ఓం నిరంజనాయ నమః :
నిరంజన స్వరూపునకు నమస్కారము.
ఓం నిర్మలాయ నమః
విమల చరితునకు నమస్కారము
ఓం నిర్గుణాయ నమః
సత్వరజస్తమో గుణముల కతీతులైన వారికి నమస్కారము
ఓం నిత్యాయ నమః
ఎల్లప్పుడు ఉండువారికి నమస్కారము
ఓం నిరుపమాన ప్రబోధకాయ నమః
సాటిలేని ప్రబోధకునకు నమస్కారము
ఓం నిరాకారాయ నమః
రూపమునకు అతీతులైన వారికి నమస్కారము
ఓం నిరంతర శ్రీకృష్ణ పాదపంకజ భ్రమరాయ నమః
నిరంతరం శ్రీకృష్ణుని పాదపద్మముల యందలి ఆనంద మకరందమును గ్రోలు చుండు
తుమ్మెదకు వందనము
ఓం మనోవాగతీతాయ నమః
మనస్సునకు, వాక్కునకు అందని వారికి నమస్కారము
ఓం మాతృముక్తి ప్రదాయకాయ నమః
మాతృదేవికి ముక్తినిచ్చిన వారికి నమస్కారము
ఓం భావాతీతాయ నమః
ఆలోచనకు అందని వారికి నమస్కారము
ఓం గుణాతీతాయ నమః
త్రిగుణముల కందని నిర్మలునకు నమస్కారము
ఓం పరిపూర్ణాయ నమః
పరిపూర్ణ స్వరూపునకు నమస్కారము.
ఓం పరిశుద్ధాయ నమః
నిష్కళంకునకు నమస్కారము.
ఓం పరితోష ప్రదాయినే నమః
ఆనందము ననుగ్రహించు వారికి నమస్కారము
ఓం పరాత్పరాయ నమః
శ్రేష్ఠులకు శ్రేష్ఠు లైన వారికి నమస్కారము
ఓం పవిత్రాత్మనే నమః
జ్ఞానపూతులైన వారికి నమస్కారము
ఓం ప్రణవ స్వరూపాయ నమః
ఓంకార రూపునకు నమస్కారము
ఓం తీర్థ స్వరూపాయ నమః
తరింప జేయు వారికి నమస్కారము.
ఓం త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపాయ నమః
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తినే తన స్వరూపముగా గల వారికి నమస్కారము
ఓం ప్రకాశైక స్వరూపాయ నమః
తేజోవంతునకు నమస్కారము.
ఓం మంగళ స్వరూపాయ నమః
శుభకరునకు నమస్కారము
ఓం మంత్ర స్వరూపాయ నమః
అనేక మంత్రములచే స్తుతించబడు దివ్యరూపము.
తామే యైనవారికి నమస్కారము
ఓం ఆనంద స్వరూపాయ నమః
ఆనందమే తమ స్వరూపముగ గల వారికి. నమస్కారము
ఓం ఆత్మ స్వరూపాయ నమః
సకల జీవులలో 'నేను'గా తెలియు స్వరూపము తానే యైనవారికి నమస్కారము
ఓం అక్షయ రూపాయ నమః
నశింపు లేనివారికి నమస్కారము.
ఓం చిన్మయ రూపాయ నమః
జ్ఞానమయునకు నమస్కారము.
ఓం శాంతరూపాయ నమః
ప్రశాంత స్వరూపునకు నమస్కారము
ఓం తత్త్వమసీత్యాది వాక్య లక్ష్యార్థ రూపాయ నమః
'తత్వమసి' (నీవే అది) మొదలగు శ్రుతివాక్యముల నిజ అర్థమే తన స్వరూపముగ
గలవారికి నమస్కారము
ఓం బ్రహ్మానందమయాయ నమః
బ్రహ్మానందముతో నిండియుండు వారికి నమస్కారము
ఓం దయామయ దేహాయ నమః
కరుణ ననుగ్రహించు ఆలయము వంటి శరీరము గల వారికి నమస్కారము
ఓం ప్రేమ నిలయాయ నమః
ప్రేమకు నిలయమైన వారికి నమస్కారము
ఓం జితేంద్రియాయ నమః
సకలేంద్రియములను జయించిన వారికి నమస్కారము
ఓం అభినవ శంకరాచార్యాయ నమః
నేటి సమాజమున ఆదిశంకరుల వలె ధర్మోద్ధరణ గావించుచున్న వారికి నమస్కారము
ఓం అద్వైత వివేకాయ నమః |
అద్వైత జ్ఞానము ననుభూతిగ గల వారికి నమస్కారము
ఓం అద్వితీయాయ నమః
రెండవది లేని ఏక స్వరూపము తానే యైన వారికి నమస్కారము
ఓం అవికారాయ నమః
మార్పు లేనివారికి నమస్కారము
ఓం అశేష జనాకర్షకాయ నమః
సకల జనులను తమ ప్రేమ, జ్ఞానము లతో ఆకర్షించు వారికి నమస్కారము
ఓం అచిన్త్యాయ నమః
యోచించలేని స్వరూపము తానే యైన వారికి నమస్కారము
ఓం అనర్గళ భాషణశీలాయ నమః
గంగా ప్రవాహము వలె బోధ ననుగ్ర హించు వారికి నమస్కారము.
ఓం ఆత్మస్థితాయ నమః
ఆత్మయందే స్థిరుడై ఉండువారికి నమస్కారము
ఓం ఆదిమధ్యాంత రహితాయ నమః మొదలు, నడుమ,
తుది అనునవి లేని వారికి నమస్కారము
ఓం ఆనంద ప్రదాత్రే నమః
దివ్యానందము ననుగ్రహించు వారికి నమస్కారము
ఓం ఆర్షధర్మ దీపికాధారిణే నమః
సత్యసందేశాలు వెలుగులు విరజిమ్మే సనాతన
ధర్మదీపికను ధరించినవారికి నమస్కారము
ఓం జనక నివారిణే నమః
జనన మరణ సంసార చక్రమును నిరోధించు వారికి నమస్కారము
ఓం బ్రహ్మచారిణే నచుః
నిరంతరం బ్రహ్మమునందే రమించు వారికి నమస్కారము
ఓం బుద్ధి సాక్షిణే నమః
బుద్ధికి వెనుక ఉండి నిర్లిప్తులై వీక్షించు వారికి నమస్కారము
ఓం సుమకోమల భావ సంపన్నాయ నమః
పువ్వుల వంటి సున్నిత భావములను సంపదగ గలవారికి నమస్కారము
ఓం లలిత కళాకోవిదే నమః
జీవన కళను తెలిపే లలితకళల యందు నిష్ణాతులైన వారికి నమస్కారము.
ఓం గజారోహణ కృతే నమః
గజారోహణ పురస్కారము పొందిన వారికి నమస్కారము
ఓం భవసాగర సేతు కృతే నమః
సంసార సాగరమును దాటుటకు వంతెన గట్టిన వారికి నమస్కారము
ఓం దోష దూరీకృతే నమః
గుణదోషములను క్షాళన మొనరించు వారికి నమస్కారము
ఓం కాంస్య ఘంటారవ భాషిణే నమః
కంచువలె మ్రోగు కంఠము గల వారికి నమస్కారము
ఓం దుస్సంగ ద్వేషిణే నమః
దుర్జన, దుష్టభావ సాంగత్యమును సహించని వారికి నమస్కారము
ఓం సత్సంగ ప్రియాయ నమః
సత్సాంగత్యము నిష్టపడు వారికి నమస్కారము
ఓం భక్త హితాయ నమః
భక్తులకు శ్రేయము నొనగూర్చు వారికి నమస్కారము
ఓం భక్త సులభాయ నమః
భక్తులకు అత్యంత సన్నిహితులైన వారికి నమస్కారము
ఓం శిష్య వత్సలాయ నమః
తండ్రివలె శిష్యులను కాచి, కాపాడు వారికి నమస్కారము
ఓం శిష్య సన్మార్గ శాసకాయ నమః
నిజధామమును చేరు మార్గమును శిష్యులకు చూపు వారికి నమస్కారము
ఓం శిష్యాణాం కల్పవృక్షాయ నమః
శిష్యులకు హితమైన దంతయు ఇచ్చు కల్పతరువైన వారికి నమస్కారము
ఓం అజ్ఞాన తిమిర నాశకాయ నమః
అజ్ఞాన చీకట్లను చీల్చు వారికి నమస్కారము
ఓం ద్వంద్వ నాశకాయ నమః
సాపేక్షికములైన ద్వంద్వములను నాశము చేయువారికి నమస్కారము
ఓం తాపత్రయ వినాశకాయ నమః
అధిభూత, అధిదైన, అధ్యాత్మ తాప ములను హరించు వారికి నమస్కారము
ఓం కామ వినాశకాయ నమః
కామమును దగ్ధమొనర్చు వారికి వందనము
ఓం శిష్య హృదిస్థ సంశయ విఛ్ఛే దకాయ నమః |
శిష్యుల హృదయముల యందలి సందేహములను నశింపజేయువారికి నమస్కారము.
ఓం భేదభావ దృష్టిదోష నివారకాయ నమః
సత్యము అందని దశలో తెలిసే భేద భావ
చత్వారమును తొలగించువారికి నమస్కారము.
ఓం భయశోక హరాయ నమః
భేదభావ జన్యములైన భయమును, శోకమును
తొలగించువారికి నమస్కారము.
ఓం భవసాగర తారకాయ నమః
సంసార సముద్రమును దాటించు వారికి నమస్కారము
ఓం కరుణామృత సాగరాయ నమః
కారుణ్యమనే అమృతముతో నిండిన సాగరము వంటి వారికి నమస్కారము
ఓం యశఃకామ రహితాయ నమః
కీర్తి కాంక్ష నెరుగని వారికి వందనము
ఓం మనోభీష్ట ఫలప్రదాయ నమః
మన ఆంతర్యములోని వెలితిని తామే గ్రహించి
తొలగించు వారికి నమస్కారము
ఓం విశిష్ట నూపుర సత్క్రుతాయ నమః
గండపెండేరముచే సత్కరింపబడిన వారికి నమస్కారము
ఓం ప్రవచన సమ్మోహిత శ్రోతృజనాయ నమః
తమ ప్రబోధముచే ఆలకించు వారిని ఆనంద సాగరమున ఓలలాడించు వారికి నమస్కారము
ఓం భవబంధ విమోచకాయ నమః
సంసార సంకెళ్ళనుండి విడుదల చేయు వారికి నమస్కారము
ఓం శతాధిక జ్ఞానయజ్ఞ నిర్వాహకాయ నమః
వందకు మించిన జ్ఞానయజ్ఞములను నిర్వహించిన వారికి నమస్కారము.
ఓం శతాధిక సత్సంగ సంయోజకాయ నమః
వంద కంటే ఎక్కువ సత్సంగ శాఖల నేర్పరచిన వారికి నమస్కారము
ఓం శతాధిక గ్రంథగ్రంథకర్త్రే నమః
నూటికి పైగా గ్రంథములు రచించిన వారికి నమస్కారము
ఓం స్థిరాయ నమః
అచల స్వరూపునకు నమస్కారము
ఓం స్వతంత్రాయ నమః
తనకు తానే ఆధార స్వరూపమైన ఉన్న వారికి నమస్కారము
ఓం పరమ గురవే నమః
గురువుల కెల్ల గురువైన వారికి నమస్కారము.
ఓం సుందర చైతన్యానంద స్వామినే నమః
శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారికి నమస్కారము