Sunday, October 20, 2024

ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డోడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో

 

ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డోడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో 
ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల బడ్డాడో అరవై ఏళ్ళ గోస దీసి సంబుర మిచ్చాడో 
అరవై ఏళ్ళ గాయాలు మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను జూడగా తీర్చినావు మా కలలు తూడ్చినావు కన్నీళ్ళూ నిన్నుచూస్తే గుర్తొస్తాడు ఇంట్ల ఉన్న నా అమ్మే అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులు కాసే సామి నీ పేరే వింటే జయహో జయహో మా జాతి ప్రథముడా జయహో జయహో కల్వకుంట చంద్రుడా జయహో జయహో మా రాజ్య అగ్రజుడా జయహో జయహో కల్వకుంట చంద్రుడా కన్న మాటలు విన్నాడో కల తిరిగి జూసాడో పిల్ల జల్లలు గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ల ఇలువ తెలువది ఏనాడో కాలం అంత గడిసినంక నెమరేసుకుంటారో యినరా భారత యీర కుమారా యీరుని హరికథను మన కల్వకుంట్ల కథను కనరా భారత యీర కుమారా నేల గన్న కలను చంద్రశేఖరన్న కథను నూనూగు మీసాల పోరడప్పుడే మెదడు ఎంత పదును కలత చెందెటోడు చిన్ననాడే చూసి నేల తల్లి ఎదను వదిలిపెట్టడంట రంగం ఏదైనా దొరికేనంట ఆగును సామికి దొరికేనంటే ఆగును చింతమడక గ్రామంలోన చేరిత మొగ్గ తొడిగిందమ్మా వెంకటమ్మ రాఘవయ్య కడుపునిండా గన్నారమ్మా బడికిబోయే రోజుల్లోనే నెత్తురంత ఉడికిందమ్మ బడుగుజనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మా ఉన్నతచదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసుంది ఉక్కువజ్ర సంకల్పముంది దాశరథి మన కాళోజి కవిత గుణమే సామికుంది చిన్నఈడున పెళ్లాడే సక్కనితల్లి శోభమ్మను రాముడంటి రంగారావుకు లక్ష్మణుడమ్మో తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకి తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటీఆర్ కవితమ్మో తెలంగాణ సాధనలోన పోరుచేసి పద్నాలుగేళ్ళు భూమి ఎపుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగళ్ళ పారేటి గంగమ్మ తల్లినే నల్లరేగళ్ళకే మళ్లించినాడమ్మ కాళేశ్వరముతోటి లక్షల ఎకరాలు కళకళలాడించే మన పెద్ద రైతన్న ఎట్లుండె మన కొండలు గతమంతా నెర్రెబారిన నేలలు ఏడేండ్ల ఈ పొద్దులో చిగురించే మెల్లగా మన బతుకులు బక్క పలుచనివాడు ఉక్కు గుండెలవాడు బందూకూలా కదిలినాడూ అక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేదతల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్నిఏండ్ల గోసల ఫలమై ముందునిలిచే మన పెద్దసారూ ఒక్కడే కేసిఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కళ్లార చూసాము ఈ మనిషిని మునుముందుతరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణమెందుకన్నా అతడు రాజ్యమే తెచ్చిన వీరుడన్న తెలంగాణ అంటే కేసీఆరు మన కేసీఆరే తెలంగాణ కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కళ్ళ చూద్దాం మంచీ కాలాలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD VIDEO LINKS@DAILYMOTION CHANNEL

  ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-8 https://dai.ly/x64szk2 ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-4 https://dai.l...