Tuesday, September 3, 2024

NAMASTHE TELANGANA & TELANGANAM 03 September 2024

నమస్తే తెలంగాణ హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణకు రేవంత్రెడ్డి ప్రభుత్వం 'హైడ్రా' రూపంలో తలపెట్టిన ప్రయత్నం సూత్రరీత్యా ఆహ్వానించదగినదే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతవరకు స్వయంగా తను చెప్పిన విషయాలనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినవాటినీ, హైడ్రా కమిషనర్ చెప్పినవాటినీ, ఆచరణలో జరుగుతున్నవాటినీ, హైకోర్టు వ్యాఖ్యలూ, ఉత్తర్వులనూ గమనించిన మీదట ఇందులో అర్ధం కాని విషయాలు అనేకం ముందుకు వస్తున్నాయి. అవి తలెత్తటం మొదలైన తర్వాత కూడా వాటికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లభించటం లేదు. ఆ కారణంగా ప్రజలలో అయోమయాలు, భయాందోళనలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే వాటిని పరిగణనలోకి తీసుకుని అవసరమైన స్పష్టీకరణలు ఇవ్వటంతో పాటు తన కార్యక్రమానికి తగు మార్పుచేర్పులు చేయటం అవసరం. హైడ్రా లోగుట్టు ఏమిటి? టంకశాల అశోక్ ఇందులో అన్నింటికన్న ముందు కొట్టవస్తున్నట్టు కనిపించే విషయం ఒకటున్నది. హైదరాబాద్ వంటి సుదీర్ఘమైన చరిత్ర గల మహానగరంలో ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం సాధారణమైనది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ నగర పర్యావరణ, నిర్మాణాలకు సంబంధించి ఐదు రకాల ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఒకటి, చెరువులు, సరస్సుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎల్డీఎల్) పరిధిలో నిర్మాణాలు రెండు, వాటి బఫర్ జోన్లో నిర్మా ణాలు, మూడు, నాలాలను, పార్కులను ఆక్రమించి నిర్మా ణాలు, నాలుగు, ప్రైవేటుగా పట్టాలున్నప్పటికీ అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు. అయిదు, ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా చేసినవి. వీటిలో ప్రస్తుతానికి మొదటి మూడింటిపై దృష్టి పెడుతున్నామని అన్నారాయన. అదేవిధంగా హైడ్రా ప్రస్తుత పరిధి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకని చెప్పారు. ఈ పరిరక్షణలు జరగనందువల్ల కలుగుతూ వస్తున్న రకరకాల నష్టాలు ఏమిటో, అభివృద్ధి రీత్యా మునుముందు కలగగల నష్టాలు ఏమిటో వివరించారు. అందువల్ల నగర వర్తమానం కోసం, భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించారు. ఆ విధంగా ఇది సాధారణ కార్యక్రమం కాదు. బృహత్తర మైనది. అటువంటపుడు దాని అమలుకు రూపొందించే ప్రణాళికలు కూడా బృహత్తరంగా ఉండాలి. అందుకు సంబంధించిన సమస్త కోణాల గురించి ముందుగానే ఆలోచించి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. వాటి మంచి చెడులు, పరిధులు, అమలు కోసం ముసాయిదా ప్రణాళికలు, ఎదురవగల చిక్కులను పరిశీలిస్తూ, అందుకు పరిష్కారాలపై ఒకవైపు అధికారుల స్థాయిలో, మరొకవైపు బయటి నిపుణులు, అనుభవజ్ఞాల స్థాయిలో విస్తృతంగా సంప్రదింపులు జరపాలి. అప్పుడు కార్యాచరణకు ఒక నిర్దిష్టమైన, సమగ్రమైన రూపం ఇచ్చి ఆచరణకు పూనుకోవాలి. అంతచేసినా కొన్ని లోటు పాట్లు, సమస్యలు ఎదురుకావచ్చు గాక, అది ఏ విషయంలోనైనా ఉండేదే. కానీ, ఇటువంటి మహానగరం ఎదుర్కొంటున్న ఇంతటి బృహత్తర సమస్య విషయం లో ముందుగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. అటువంటి ప్రణాళికాబద్ధత లేనట్లయితే దానికి ఆరాచక లక్షణాలు వస్తాయి. హైడ్రాకు సంబంధించి గత కొద్ది వారాల మాటలను, చేతలను కూడా గమనించినపుడు దురదృష్టవశాత్తు కలుగుతున్న అభిప్రాయం అటువంటిదేమీ జరగలే దీని ఎటువంటి ముందస్తు మేధోమధనం జరగలేదని. అంతా హడావుడి, అట్టహాసం, సంచలనం. ఒకవైపు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.