భగవదృష్టి - దివ్యదృష్టి
యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యతి || గీత 6-30||
సచమే న ప్రరాశ్యతి
ఏ యోగి నన్ను సర్వత్ర సమస్త ఆత్మలలో
చూస్తాడో, సమస్తమైన ఆత్మ వస్తువును నాయందు చూస్తాడో ఆ యోగికి నేను సాక్షాత్కరింపకుండా వుండను. ఆ యోగి కూడా నా దృక్పథం నుండి తొలగడు.
ఆ యోగి ఉత్తమ భక్తుడు. ఆ యోగినులు వ్రజ గోపికలు.
పై శ్లోకం వంటిదే శ్రీమద్భాగవతంలో కూడా వుంది.
""సమస్త చేతనా చేతనాలలో తన ఉపస్య
భగవానుని దర్శించే వాడు అలాగే తన ఉపాన్య
భగవానులో సమస్త చేతనా చేతనాలను దర్శించేవాడు
ఉత్తను భక్తుడు అని”
ఉత్తమ భక్తుని లక్షణమెటువంటిదో అనుభవ
గమ్యమానమైన మనస్సు తెలియయజేస్తున్నది. రెండవ
శ్లోకం. అనురక్తుడైన భక్తుడు తన ప్రియతముడైన
శ్రీకృష్ణుడ్ని, ఆయన నామాన్ని కీర్తిస్తూ ద్రవిత
చిత్తుడవుతాడు. ఉన్మత్తుని వలె ఉచ్ఛస్వరంతో
హసిస్తాడు . దుఃభిస్తాడు. కేకలు వేస్తాడు..
గానం చేస్తాడు. తన్మయుడై నాట్యం చేస్తాడు.
స్మృతిని కోల్పోతాడు.
భగనానామాన్ని కీర్తించేటప్పుడు, అభిమానపడటం.
సిగ్గు పడడం, మూర్ఖ లక్షణ వునువుతుంది . సర్వశుభాలను ప్రసాదించే అప్రాకృతమూ దివ్యమూ అయిన భగవనామాన్ని సంకీర్తన చేయడంలో సంకోచించడం భగవంతుడ్ని తక్కువ చేయడమే
అవుతుంది. భాగవత వాఖ్యాత శ్రీ వీరరాఘవస్వామి
" నడాంభిక మివపరాన్ పంచయితుం "తాను
మహాభక్తుడననే బడాయిని చాటుకుని పరులను
వంచించటానికి భక్తి పారవశ్యాన్ని చూపడం హేయ
మవుతుందని వాఖ్యానించారు. భక్తి పారవశ్యం లోకవంచన కాకూడదు.
భక్తుడు సమస్త స్థావర జంగమాలలో తన ఇష్టదైవాన్నే దర్శిస్తాడు.
భూమానందాన్ని అనుభవిస్తాడు. వ్రజ గోపికలు.
బృందావనంలోని తరులతా గుల్మాలను చూచి శ్రీ కృష్ణ
భావనా భావితలయ్యారు. ఫల భారంతో నేలకు వంగిన వృక్షశాఖలను చూచి అవి శ్రీకృష్ణునికి
ప్రణమిల్లుతున్నాయని భావించారు. పుష్పిత లతాతరువులు భగవంతుడ్ని పూజిస్తున్నాయని తలపోసాడు. చిగురు పెట్టిన చెట్లు పులకిస్తున్నాయనుకున్నారు. ఫల మధు ద్రవాలను ఆనంద భాష్పాలుగా ఎంచారు .
సమస్త వృక్ష లతలలో శ్రీ కృష్ణానుభూతిని పొందారు.
వ్రజ గోపికలు తమ వలెనే బృందావనంలోని
తరులతలు కూడా శ్రీ కృష్ణాను రాగంతో ఆనందించడం
చూచి విస్మయం పొందారని తాత్పర్యం.
శ్రీ కృష్ణ భక్తుడొక వృద్ధుడు బృందావనం
చూడటానికి బయలు దేరి మార్గమధ్యంలో ఒక
పట్టణ వీధిగుండా నడిచి పోతున్నాడట. అతని
నామాలు, నున్నని బోడితల చూచిన ఒక
దుర్మార్గుడికి ఆ బోడి తల మీద కర్రతో కొట్ట బుద్ధి పుట్టింది కొట్టాడు. ఆ భక్తుడు మూర్చపడిపోయాడు. ఎవరో సజ్జనులు అతడ్ని ఆసుపత్రికి చేర్చారు. తలకు కట్టు కట్టారు. కొంత సేపటికి ఆ భక్తునికి స్పృహ కలిగింది. ఆసుపత్రిలోని సేవకుడు వచ్చి వెచ్చని పాలగ్లాసు అతనికి అందిస్తూ "అయ్యా! ఈ పాలు త్రాగండి " అన్నాడు.
ఆనూట విని భక్తుడు నవ్వుకుంటూ "నీవు
భలే చిత్రమైనవాడవు సుమా ! అపుడు కర్రతో
కొట్టావు. ఇప్పుడు ప్రక్క మీదున్న నాకు పాలగ్లాసు
అతనికి అందిస్తున్నావు" అన్నాడు నిర్మలమైన నవ్వుతో.
పాపం ఆ సేవకుడు ఆ మాటలు విని
“అయ్యా ! మిమ్మల్ని కొట్టింది నేను కాదు.
ఎవడో మిమ్మల్ని కొట్టాడు. మీరు వివశులై పడిపోయారు. ఎవరో మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చారు. నేను
ఈ ఆసుపత్రిలో పని చేసేవాడ్ని. నేను మిమ్మల్ని
కొట్టినవాన్నికాదు కాదని మొరపెట్టుకున్నాను.'
అవునవును. నాకు తెలుసు. నీవు చిత్ర
విచిత్రమైన వేశాలు వేస్తావు. కర్పతో కొట్టేవాడవు
నీవే . పాలు తాగమని ఇచ్చేవాడవు నీవే. నీవు ఇతరులను
మోసగించగలవు. కానీ నన్ను మాత్రం మోసగించలేవు.
నీ మాయలన్నీ నాకు మొదటి నుంచే తెలుసు " అన్నాడా
భక్తుడు.
ఈ సమతా సంపన్నులైన భక్తులు దుఃఖరాజ్యానికి
బహు దూరంగా వుంటారు. వారికి వైరం వుండదు,
ప్రతీకారేచ్ఛవుండదు.
ఆ సేవకుడు ఆ భక్తునికి ఎలా తెలియ
చెప్పాలో తోచక సతమత మయ్యాడు ఉత్తమ
భక్తుడు సమస్త జనులలోను ఒకే ఒక తన
ప్రభువును దర్శిస్తాడని సారాంశం.
భక్తుడైన వాడెవడు తనను తాను భక్తుణ్ణని
చెప్పుకోడు. అతని స్వభావం, అతని పనులు,
ఆచరణ మొదలైనవే అతడు భక్తుడని చెబుతాయి.
సత్పురుషుడైన భక్తునివద్ద కొంచెంసేపు కూర్చున్నవానికి దైవీగుణం కలిగిందంటే చాలు ఆయన
మహా భక్తుడని ప్రణమిల్ల వచ్చు...
సర్వత్రా భగవదృష్టియే దివ్య దృష్టి అవుతుంది. అది భగవత్ కృప వల్లనే ప్రాప్తిస్తుంది.**
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.