telugudevotionalswaranjali.blogspot.com
Saturday, June 29, 2024
గీతామృతం - జగము - జగతి
గీతామృతం - జగము - జగతి
హృదయానికి అన్నిటి కంటే ఆకర్షనీయమైనది.
ఒక్క ప్రేమ మాత్రమే. హృదయంలో ప్రేమ
లేనప్పుడు దాన్ని బలవంతంగా భగవంతుని వైపునకు
మళ్ళించడానికి ఎంత ప్రయత్నించినప్పటికి ఫలితం
ఉండదు. క్షణం సేపైనా భగవంతుని యందు నిలువదు.
కర్మయోగ జ్ఞానయోగాలు రెండూ భక్తి యోగానికి
సహకరించినప్పుడే అవి చరితార్థ మవుతాయి.
కర్మ మార్గం - జ్ఞానమార్గం ఒకదాని కొకటి కలుసుకున్న చోట
భక్తి మార్గం ద్యోతకమవుతుంది.
భక్తి లోని మాధుర్యంతో ఆ రెండూ ఒక దాని లోపాన్ని నురొకటి పూర్తిచేసుకుంటాయి.
అప్పుడు ఆ రెండింటికీ లక్ష్యం ఒకటే అవుతుంది. చరితార్ధత కలుగుతుంది.
భక్తియోగానికి ఆధారమైనది కేవలం భగవత్కృప మాత్రమే. భక్తి సహాయం లేకుంటే కర్మయోగి యొక్క నిష్కాను జీవితం సఫలం కాదు. మానవ హృదయం నిష్కామంగా ఉండటం దుర్లభం. భక్తియోగాన్ని ఆశ్రయిస్తే హృదయం దానంతట అదే శాంతిస్తుంది.
భగవదనుభూతి కలిగిన వెంటనే మనస్సుకున్న మాయా
బంధాలు తెగిపోతాయి. భక్తికి రెండు రూపాలున్నాయి.
1. ఉపాసన 2. కెంకర్యం
భగవంతుని యందు విశ్వాసముంచి నిరంతర
చింతన చేయడం ఉపాసన. భగవంతునితో మానవ
హృదయం ఏకాకారం కావడం ఉపాసన.
ఉపాసన సఫలం కావడానికి భగవంతుని పట్ల అత్య
ధికమైన ప్రేమ ఆవశ్యకమవుతుంది. ప్రీతి ఉంటే ప్రేమ
కలుగుతుంది. మనం అధికంగా ప్రేమించిన దానినే రాత్రింబవళ్ళు స్మరిస్తుంటాము. ఆస్మరణలో, చింతనలో, ధ్యానంలో ఆనందానుభూతిని పొందుతాము. దాని మీద ప్రేమతో ఉన్మాదుల మవుతాము. ఒక్కక్షణం ప్రేమించిన దానిని మరచిపోతే ఎంతో వ్యాకుల పడతాము. అంతా పోగొట్టుకొన్నట్లుగా వ్యధ చెందుతాము. ఇందుకు కారణమేమిటి మనస్సు చాలా చంచలమైనది. మనస్సును బంధించడం గాలిని పట్టి మూట కట్టడమే.
మనస్సు భగవంతుని యందు నిలిచి నట్లుగా
నిలిచి హఠాత్తుగా ఇంద్రి)య సుఖాల వైపు
మళ్ళుతుంది. ఎప్పుడు మళ్ళిందో కూడా మనకు తెలియదు.
అంతేకాదు అలవాటు పడిన విషయంలో కూడా.
చలించి పోయే స్వభావం మనస్సుకు ఉంది.
ఇంద్రియ భోగరస పానానికి అలవాటు పడిన
చంచలమైన మనస్సును భగవంతునివైపునకు మరలిం
చడానికి రెండు సాధనాలు ప్రారంభంలో
అవసరమ వుతాయి.
అభ్యాసం. 2. వైరాగ్యం
అభ్యాసానికి మొదలు, వైరాగ్యానికి ప్రారంభం
నకు అవసరమైనది అభిరుచి, అదే ప్రీతి, ప్రేతి
కలగడానికి రామాయణ, భాగవతాది గ్రంథాలు పఠించాలి.
శ్రద్ధాసక్తులతో వినాలి. భగవంతుని పట్ల వైముఖ్యాన్ని
కలిగించే మాయను ఎప్పటికప్పుడు పారదోలాలి
మాయాదేవికి నమస్కారం పెట్టి" అమ్మా! నీవు నా జోలికి రావద్దని వేడుకొనవలెను.”
'జగమును' నపుంసకమనుకొన్నవారికి వైరాగ్యం కలుగుతుంది. ' జగతి' స్త్రీలింగ మనుకొన్నవారికి భోగబుద్ధిజనిస్తుంది.
వైరాగ్యం ద్వారా భగవంతుని యనురక్తి, జగత్తు పట్ల విరక్తి
ఉత్పన్నమవుతాయి. భక్తికి మరొక రూపం కైంకర్యంజీవుడు
శాశ్వతంగా భగవంతునికి దాసుడు. భగవత్ సేవ చేయడం
జీవుని ధర్మం.
****************
**అహంకారియగు మానవుని ప్రసంగం
ఎప్పుడూ అప్రస్తుతంగాను , ఉన్మాద
హాస్యదోరణిలోనే యుంటుంది.
జ్ఞానులైనవారికి అవి ఎప్పుడూ నవ్వులాటగానే తెలుస్తాయి.
- సజ్జనులు తమ హృదయములలో బాధలను నింపుకొని,
ప్రతికూల వాతావరణమును భరించుచున్నను తమ
బాధలను, వ్యక్తపరచక, నవ్వు నభినయిస్తూ
దుర్జనులకు కూడా సంతసము నొనగూర్చుచుందురు.
దుర్జనులగు వారు అనుకూల వాతావరణమున
హాయిగా సంచరించు చున్నను, తమ స్వభావజనిత
దురాలోచనలతో సజ్జనుల హృదయాలను కూడా
గాయపరచుచునే వుంటారు. ఆశల మధ్య చరించే
వారికి, ఆశయాల మధ్య రమించేవారికి ఇదియే తేడా.
***********
**సంగీతం నేర్చుకునే వారికి సందేశం: -
* 1) గొంతు పూర్తిగా విప్పి పాడటం అలవర్చుకోవాలి
2) వచ్చినా రాకపోయినా కచ్చేరీలు బాగా వినడం అలవర్చుకోవాలి. Radio ద్వారా రోజూ చాలా కచేరీలు విన్పిస్తాయి కదా!
3) సంగీత సభలకి వెళ్ళడం అలవర్చుకోవాలి, మొదట ఒక్క
అరగంట తరువాత గంట ఆ తరువాత క్రమంగా సభల్లో
స్థిరంగా కూర్చుని నిశ్శబ్ధంగా వినడానికి అలవాటు పడాలి.
దీని వల్ల అద్భుతమైన ఫీలింగ్స్ వినే వారికి కల్గుతోంది.
పాడేవారికి ఇంకా పాడాలనిపిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
ANNAMACHARYA KIRTANALU G BAKLAKRISHNA PRASAD@DAILY MOTION VIDEOS
SRI VENKATARAMANA GOVINDA_G.BALAKRISHNAPRASAD https://dai.ly/x64etea ...
-
SRI BHAGAVATM_EPISODES_DOWNLOAD LINK: https://mega.nz/#F!AZZxhJQB!K8sQpIbEaPoY_1cFb7YYL SRI BHAGAVATAM ETV EPISODES Loading...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.