Thursday, July 13, 2023

3 పంటలా 3 గంటలా కేసీఆర్ నినాదం - మూడు పంటలు.. కాంగ్రెస్ విధానం- మూడు గంటలు రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక

నమస్తే తెలంగాణ : 
3 పంటలా 3 గంటలా 
కేసీఆర్ నినాదం - మూడు పంటలు.. 
కాంగ్రెస్ విధానం- మూడు గంటలు 
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక... 
ట్విట్టర్లో మంత్రికేటీఆర్ హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): 
సీఎం కేసీఆర్దిది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్ మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక శ్రీరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీ ఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నినాదం.. మూడు పంటలు, కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు, బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా.. మతం పేరిట మంటలు కావాలా... తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది! అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. కాంగ్రెస్ వస్తే... నిన్న ధరణి తీసేస్తం అన డు.. రాబంధు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు నేడు మూడుపూటలు దండగ అంటున్నడు చోటా చంద్రబాబు మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం.. ముమ్మాటికీ పన్న, చిన్నకారు రైతును అవమానించటమే కాంగ్రెస్కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపు పన్నకారు రైతు అంటే సవతిప్రేమ నోట్లు తప్ప... రైతుల పాట్లు తెల్వని రాబంధును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం.. అన్నదాత నిండా మునుగుడు పక్కా.. నాడు... ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నేడు.. ఉచిత కరెంట్కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్నది. 3 గంటలతో 3 ఎకరాల పొలం పాఠించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటర్లు పెట్టాలి.. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం.. మళ్లోసారి రాబంధు 3 గంటల మాటెత్తితే... రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్ష సమయం..!! రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబంధు కావాలా?? అత్యధిక గ్రీన్ కవర్ దేశంలోనే అత్యధిక నర్సరీలు ఉన్న, గ్రీన్ కవర్ పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రీన్ బెల్ట్, గ్రీన్ ఇన్స్టిట్యూట్ అధ్య క్షుడు ఎరిక్ సోలిమ్.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నర్సరీలు, వాటిలో పెంచు తున్న మొక్కలను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...