Friday, April 14, 2023

#శంకరచైతన్యం_1#శివాపరాధ_క్షమాపణ_స్తోత్రం#స్వామి_సుందర_చైతన్యానంద#1_2_TELUGU_LYRICS_WITH_AUDIO

#SIVA_APARADHA_KSHAMAPANA_STOTRAM_TELUGU_LYRICS_&_MEANING; #శివాపరాధ_క్షమాపణ స్తోత్రం#Shiva_Aparadha_Kshamapana_Stotram; #Sri_Shiva_Aparadha_Kshamapana_Stotram_With_TeluguLyrics_Audio; #Shiva_Aparadh_Kshamapana_Stotram_Lyrics_Meaning_HD#शिव_अपराधक्षमापन_स्तोत्रम; #SIVAAPARADHA_KSHAMAPANA_STOTRAM_TELUGU_LYRICS_&_MEANING; #chaitanya_vignanam #jai_giridhari #Chaitanya_Bhagavad_Gita_Swami_Sundara_Chaitanyananda #swami_sundara_chaitanyananda#Chaitanya_Bhagavad_Gita #pravachan,#om_sri_gurubyo_namaha, GITAMAKARANDAM https://www.youtube.com/channel/UC3DYg27nM2FSLxGUoFVU1Ag CHAITANYA SWARANJALI https://www.youtube.com/channel/UCbOjdEsM-ydRNPOkK8x3gxg BHARATH CHAITANYA JYOTHI 
https://www.youtube.com/channel/UChepWHMrkfiHpu-bOPtVN9Q 
మనుష్య జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరం ఏ విషయాల గురించి శోకించకూడదో, చింతించకూడదో వాటి గురించి ఆలోచిస్తున్నాము..ఏదో కొద్ది మంది మాత్రమే జీవాత్మను..పరమాత్మతో సంగమం చేయడానికి సదా ప్రయత్నం చేస్తున్నారు. జీవి యొక్క అంతిమ లక్ష్యం ఆ పరమాత్మను చేరడమే అని పద కవితా పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారు..పామరులకు కూడా అర్థం అయ్యే రీతిలో ఎన్నో కీర్తనలా రచించి, కీర్తించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇవే విషయాలు శ్రీ ఆదిశంకరాచార్యులు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చక్కగా తెలియజేసారు అర్దము. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం విన్న, చదివిన పుణ్యం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు. మనిషి పుట్టిన దగ్గర నుండి గతించే వరకు చేసే అపరాధలకు..భగవంతుని క్షమించమనే వేడుకోలు. శ్రీ ఆదిశంకరాచార్యులు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ఓ శివా! తల్లి గర్భమునందున్న నన్ను పూర్వజన్మలో చేసిన పాపకర్మ చుట్టుకొనుచున్నది. అపవిత్రములైన మల, మూత్రముల మధ్యనున్న నన్ను తల్లి కడుపులో ఉన్న జఠరాగ్ని ఉడకబెట్టుచున్నది. గర్భము నందు ఉన్నపుడు ఏఏ దుఃఖము పీడించునో దానిని వర్ణించుట ఎవడి తరము? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (1) పసితనము నందు మిక్కిలి దుఃఖముననుభవించి , మలములో దొర్లుచూ పాలుత్రాగదలచి ఇంద్రియములను కదిలించుటకు కూడా శక్తిలేని వాడనైతిని, మలమునందు పుట్టు పురుగులు నన్ను పీడించుచున్నవి. నానా రోగములచే దుఃఖితుడనై పరాధీనుడనై శంకరుని స్మరించలేకుంటిని. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (2) నేను యువకుడనైనంతనే సుఖములను ఆశించు పంచేంద్రియములనే సర్పములచే మర్మస్థానము నందు కరువబడితిని. మంచి చెడులు తెలుసుకొను వివక్షణా జ్ఞానము నశించినది. పుత్ర, ధన, యువతి సుఖమునను భవించుటలో మునిగితిని. అభిమానము నిండి గర్వించిన నా హృదయము శివధ్యానము విడిచినది. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (3) ముసలితనము నందు ఇంద్రియములు పనిచేయక తాపత్రయముచే సంప్రాప్తించిన రోగములతోనూ , బంధుజన వియోగములతోనూ, నా శరీరము కృశించిపోయినది. మనస్సు జ్ఞాపక శక్తిని కోల్పోయి దీనమై అసత్యములైన ఆశలతో భ్రమించుచూ పరమేశ్వరుని ధ్యానించుటలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (4) ఓ శివా ! ప్రాతఃకాలమునందే స్నానము చేసి నీ అభిషేకము కోసమై నేనెన్నడూ గంగాజలము తీసుకురాలేదు. నిన్ను పూజించుటకై దట్టమైన అడవికి పోయి ముక్కలు గాని మారేడు దళమును ఎప్పుడూ తేలేదు. నిన్ను అలంకరించుటకై సరస్సునందు వికసించి, పరిమళములు వెదజల్లుతున్న పద్మములమాల తీసుకురాలేదు, శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (5) ఓ శివా ! పాలతో , తేనెతో, నేతితో , పెరుగుతో బెల్లముతో నీ లింగమును నేను అభిషేకించలేదు. చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు పూయలేదు. బంగారు పూలతో పూజించలేదు, ధూపములతో, కర్పూరముతో, దీపములతో, నిన్ను అర్చించలేదు. వివిధములైన రుచులుకల పిండి వంటలతో నీకు నైవేద్యం పెట్టలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (6) ఓ శివా ! ప్రతిపదము అర్దముకానిదీ, ప్రాయశ్చిత్తముతో నిండినదీ, అగు కర్మమార్గమునందు స్మార్తపూజ కర్మను ఆచరించుట నాకు శక్యం కాదు. బ్రహ్మ మార్గముననుసరించు వారిచే చేయదగిన శ్రౌతకర్మ నాకెట్లు సాధ్యమగును ? శ్రవణ మననములు తెలుసుకొని నిదిధ్యాస మెట్లు కలుగును? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (7) ఓ శివా ! "శివ " అను నామమును ధ్యానించి మిక్కిలిగా దానము చేయలేదు. లక్షల కొలది బీజమంత్రములతో హోమము చేయలేదు. వ్రతములతో, జపముతో, నియమముతో, గంగాతీరము నందు తపస్సు చేయలేదు. జపించవలసిన శివ మంత్రములను జపించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (8) ఓ శివా ! నగ్నమైనవాడు, సంసార బంధములు తొలగినవాడవు, సత్వరజస్తమో గుణములు లేనివాడు, అజ్ఞానాంధకారము నశించినవాడు. ముక్కు చివరి దృష్టిని కేంద్రీకరించి తపస్సు చేయువాడు, సంసార మందలి గుణముల నెరిగినవాడు నా కెప్పుడు కనబడలేదు. ఉన్మాదావస్థలో మతి చెలించినవాడనై నిన్ను స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (9) ఓ శివా ! సహస్రారపద్మము నందు నిలచి ప్రణవమయమైన వాయువుచే కుంభితమైన సూక్ష్మమార్గమునందు ప్రశాంతమగు మనస్సును విలీనము చేసినచో శివుడను పేరుకల నీ దివ్యరూపము యొక్క వైభవము తెలియును. లింగమునందు, వేదవాక్యమునందు సకల జీవరాసుల యందు నిండి ఉన్న శంకరుని నేను స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (10) ఓ శివా ! మనోహరుడవు, వేదాంతముచే తెలియబడువాడవు, హృదయపద్మము నందు వెలుగొందుచున్నవాడవు, ప్రకాశవంతుడవు, సత్యము, శాంతము, అగు స్వరూపము కలవాడు, సకల మునుల హృదయ పద్మములందున్న వాడవు, సత్వరజోస్తమో గుణములు లేనివాడవు, అగు నిన్ను మేలుకువ యందు కానీ గాఢనిద్ర యందు కాని ఎన్నడూ స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (11) చంద్రుడు తలపై ప్రకాశంచుచున్న వాడు, మన్మధుని సంహరించినవాడు, గంగను ధరించినవాడు, శుభము చేయువాడు, మెడలోను చెవులయందు సర్పాభరణములను ధరించినవాడు, కంటియందు మండుచున్న అగ్ని కలవాడు, ఏనుగు చర్మము చుట్టుకున్నవాడు, మూడు లోకములకు సారమైనవాడు అగు శివుని యందు ఓ చిత్తమా ! మోక్షము కొరకై నిష్కల్మషముగా ప్రవర్తించుము, వేరు కర్మలతో ఏమి ప్రయోజనము? (12) వాహనములతో, ధనముతో, గుర్రములతో, ఏనుగులతో, అధికారముతో, పుత్రులతో, భార్యతో, మిత్రులతో, పశువులతో, శరీరముతో, ఇంటితో ఏమి ప్రయోజనము? ఇదంతా క్షణములో నశించుపోపునని తెలుసుకోని ఓ మనసా ! వీటిని దూరముగా వదిలిపెట్టుము. ఆత్మలాభము కొరకై గురు ఉపదేశము ద్వారా శ్రీ పార్వతీవల్లభుని సేవించుము. (13) పౌరోహిత్యము, రాత్రిసంచారము, గ్రామాధికారిగా ఉండుట, నౌకరిచేయుట, మఠాధిపతిగా వ్యవహరించుట, అబద్ధములాడుట, సాక్ష్యముపలుకుట, పరాన్నము భుజించుట, వేదములను ద్వేషించుట, దుష్టులతో సహవాసము, ప్రాణుల పట్ల దయలేకుండుట అనునవి ఓ పశుపతీ ! నాకు జన్మాంతరములందు కలుగకుండు గాక! (14) చూచుచుండగానే ఆయువు నశించుచున్నది. ప్రతిదినమూ యవ్వనము క్షీణించుచున్నది. గడిచిన రోజులు మరలా తిరిగిరావు. కాలము లోకమును భక్షించుచున్నది. నీటి అలలవలే లక్ష్మీ (సంపద) చంచలమైనది. మెరుపు వలే జీవితము చంచలమైనది. కనుక శరణాగతుడనైన నన్ను కరుణతో నీవే ఇప్పుడు రక్షించుము. (15)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

  చింతన  -  గీతా  జయంతి సందర్భంగా .. గీతామృత  స్నానం ' సకృద్  గీతామృత స్నానం సంసార మలనాశనం '    అని  ' గీతా  మహాత్మ్యం '  పల...