తల్లిదండ్రులను మరువవద్దు
తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారువారు.... రాయివై వారి హృదయాలను ప్రక్కలు చెయ్యవద్దు... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్నుపెంచారు వారు........ నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతావ్యర్ధమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మంమరువవద్దు........ ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవుతడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్నికురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.... ఆమార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు ... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు...... వారి పాదాల గొప్పదనం జీవితాంతంమరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలముఆదరణీయుడు కాగలడు...telugudevotionalswaranjali.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
-
SRI BHAGAVATM_EPISODES_DOWNLOAD LINK: https://mega.nz/#F!AZZxhJQB!K8sQpIbEaPoY_1cFb7YYL SRI BHAGAVATAM ETV EPISODES Loading...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.