దైవప్రార్థన - "గీతామకరందము"స్వామి విద్యాప్రకాశానందులవారి గ్రంధము నుండి
దైవప్రార్థన కరుణామూర్తియగు దేవా!
మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదారవిందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రమింపుము .
పరమ దయానిధీ!
ప్రాతఃకాలమున నిద్రలేనిచినది మొదలు మరల
పరుండువరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండునట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్బుధ్ధిని దయచేయుము .
సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా !
మా యంతఃకరణమునందు ఎన్నడును, ఏ విధమైన దుష్టసంకల్పముగాని, విషయవాసనగాని అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము.
వేదాంతవేద్యా! అభయస్వరూపా!
మా యందు భక్తి,జ్ఞాన,వైరాగ్యబీజము అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుము. మఱియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము.
దేవా!
నీవు భక్తవత్సలుడవు దీనులపాలిటి కల్పవృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకుఇంకెవ్వరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి . అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము . తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొనిపొమ్ము . మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. నీదరిజేర్చుకొనుము.
పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి. ఓం తత్ సత్
శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యాప్రకాశానందుల వారి "గీతామకరందము"
గ్రంధము నుండి సేకరించబడినది
ప్రార్థన చేసినవారు బ్రహ్మచారి విజయానంద శ్రీ శుకబ్రహ్మాశ్రమం శ్రీ కాళహస్తి
(ఈ ప్రార్ధనను ఎవరు ప్రతిదినము నియమముతప్పక ఉదయము నిద్రలేచునపుడును, రాత్రిపరుండబోవునపుడును మనస్ఫ్ఫూర్తిగా పఠించుదురో, అట్టివారికి జీవితమునందేలాటిదోషములున్ను కలుగకుండుటయేగాక భగవంతుని యొక్క అనుగ్రహమునకున్ను వారు పాత్రులు కాగలరు.)
దైవప్రార్థన - "గీతామకరందము"స్వామి విద్యాప్రకాశానందులవారి గ్రంధము నుండి
Subscribe to:
Post Comments (Atom)
ఆధ్యాత్మిక ఇంజనీర్ #టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #cell: 9849443752#https://lordofsevenhills.com/
• తిరుమలేశుడి విశేషాలపై రచనలు న్యూస్టుడే, ఫిలింనగర్ పేరు: టి.వి.ఆర్.కె.మూర్తి కలం పేరు: విశ్వపతి వయస్సు: 53 ఏళ్లు విద్య: వరంగల్ ఆర్ ఈసీలో...
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.