Sunday, August 31, 2025

Anjaneya dandakam in Telugu

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||

పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

***************************************************************************************************************************** Hanuman Manthra and Dwadasa Naamaalu ****************************************************************************************************************************

శ్రీ ఆంజనేయ ప్రార్ధన మరియు దండకం


ప్రార్ధన:

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ 

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస
సదా బ్రహ్మచారీ నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమస్తే నమః.
**************************************************************************************************************************

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే


కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
*************************************************************************************************************************

Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman...

  Listen MS Rama Rao Telugu Hanuman Chalisa


- రచన -
M.S. Ramarao


శ్రీ హనుమను గురుదేవు చరణములు
ఇహపర సాధక చరణములు
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుధములని తెలుపు సత్యములు || శ్రీ||

హనుమాన్ చాలీసా

జయ హనుమంత జ్ఞానగునవందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామ దూత అతులిత బలధామ
అంజనిపుత్ర పవనసుతనామ
ఉదయ భానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజిత వేష
కుండలమందిత కుంచితకేస ||శ్రీ||

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రివున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మరూపమున సితను జూచి
వికతరూపమున లంకను గాల్చి
భిమ రూపమున అసురలను జంపి
రామ కార్యమును సఫలము జేసిన ||శ్రీ||

సిత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ
వానరసేనతో వారధి దాటి
లంకేసునితో తలబడి పోరి
హోరు హోరున పోరు సాగిన
అసురసేనల వరుసను గూల్చిన ||శ్రీ||

లక్ష్మణ మూర్చ తో రాముడడగ
సంజీవిని దేచ్చిన ప్రాణప్రదాత
రామ లక్ష్మణుల అస్త్ర దాటికి
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని రామభాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురు లేని ఆ లంకాపురమున
ఏలికగా విభీశునను జేసిన ||శ్రీ||

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారుతులందరి
అంతులేని ఆనంద ఆశ్రువులే
అయోద్యాపురి పొంగి పొరలే
సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతువదం నీ హృదయం
రామచరిత కర్ణామృత గాన
రామనామ రసామృత పాన ||శ్రీ||

దుర్గమమగు ఎ కార్యమైనా
సుగామమే యగు నీకృప జాలిన
కలుగు సుఖములు నినుసరనన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న
రామద్వారపు కాపరివైన నీ
కుత్తడి మీర భ్రంహాదుల తరమా
భూత పిశాచ సాఖినీ డాకినీ
భయపడిపారు నీ నామజపము విని ||శ్రీ|
ధ్వజవిరాజ వజ్రశరీరా
భుజబలతెజా గదాధరా
ఈశ్వరాంశ శంభూత పవిత్రా
కేసరి పుత్రా పావన గాత్ర
సనకాదులు బ్రమ్హాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమ కుభేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల ||శ్రీ||
"సోదర భారత నామానా " యని
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా
సాదుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిత కాలుడవన్నా
అష్ట సిద్ధి నవనిధులకు దాతగ
జానికీమాత దీవించెనుగ
రామరసామ్రుత పానము జేసిన
మ్రుత్యుం జయుడవై వెలసిన ||శ్రీ||
నీ నామ భంజన శ్రీ రామ రంజన
జన్మ జన్మాంతర దుఖభంజన
ఎచ్చటఉండిన రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవాలు సుఖములు
ఏందెందున శ్రీ రామ కీర్తన
అందందున హనుమాన నర్తన ||శ్రీ||
శ్రద్ధగ దీనిని ఆలకిమ్పుమా
శుభామఘు ఫలములు కలుగు సుమా
భక్తి మీరి గానము చేయగ
ముఖ్తి కలుగు గౌరీసులు సాక్షిగా
తులసీదాస హనుమాన చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగా
పలికిన సీతారాముని పలుకున
దోశాములున్న మన్నిమ్పుమన్న ||శ్రీ||
మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంతా ||

ఓం శాంతిహి శాంతిహి శాంతిహి
శ్రీ రామర్పనమస్తు  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...