Friday, July 7, 2023
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand
Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
తెలిసుంటే చెట్టంత నా బిడ్డనీ .. తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు
పువ్వులో పువ్వునై నీ పూజ జెశాను ... నీరునై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్కపోద్దులు ఉంటు ముడుపు చెల్లించాను ... దిక్కు నీవని మొక్కి దీమాగ ఉన్నాను
నా కన్నబిడ్డ పై ఈశ్వరా... ఆ...నీ కరుణ ఏమైందిరా శంకరా
నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ...
శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీప మారానీక పడిగాపు లున్నాను
కళ్లలో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు
నీ ఆత్మ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టదుర శంకరా
ఎందుకని రాశావు ఈ రాతను పూలు రాలిన చెట్టులా ఈ జన్మనూ
ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికింది. అమ్మా అనె పిలుపుకై
అల్లాడిపోయింది
చిననోట తొలిసారి అమ్మాఅని పలికితే ఆడజన్మని నేను గెలిచాను అనుకొంది
పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ... నీ పార్వతిని అడగరా శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా ...
Subscribe to:
Post Comments (Atom)
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.