Thursday, October 3, 2024

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వత#వలిశెట్టి లక్ష్మీశేఖర్

\
*స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం*.! 
 *స్నేహం* ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహాని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమో గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. *స్నేహం* ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. *స్నేహం ఓ మధురం..! స్నేహం ఓ వరం*..!! స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. *స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భరించడమే నిజమైన స్నేహం*..! ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది. *కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేదే స్నేహం*...! ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ. వలిశెట్టి లక్ష్మీశేఖర్ ... - 98660 35557 ....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

AYYAPPA SONGS LATEST VIDEOS UPDATED #MUST WATCH

Sharanamayyo Sharanamayyappa Full Song | Ayyappa Swamy Song 2024 | Rampur Sai, Shekar Nani, Anika Link:  https://youtu.be/oyfRKKqdN1o?si=t5a...