ఊరుపేరు లేనివాడు లేనట్టే ఉన్నవాడు ఆనవాళ్ళు లేనివాడు అంతా తానైనవాడు#swami_sundara_chaitanyananda
ఊరు పేరు లేనివాడు లేనట్టే ఉన్నవాడు.
ఆనవాలు లేనివాడు అంతా తానైనవాడు ॥ ఊరు ॥
1. అందరి మనసులను కదిలించే వాడు
కదిలే మనసులకు కంటబడని వాడు.
ఎవరికి కానివాడు అందరివాడు.
అంతట అందముగ అలరారువాడు ॥ ఊరు ॥
2. అందరిలోన కలసిన వాడు
అన్నిటి లోన కరిగిన వాడు.
మరుగైనా తాను మరపు రానివాడు
ప్రతి మలుపును వలపుగా మలిచేవాడు ॥ ఊరు ॥
3. మనిషి తానై, మనసూ తానై
మనిషికి మనసుకు అందని వాడు
మొగ్గలో పువ్వులా పువ్వులో పిందెలా
పిందెలో పండులా పండులో తీపిలా ॥ ఊరు ॥
4. పున్నమి చంద్రికలా చల్లనైన వాడు
నిండు వసంతంలా పండిన వాడు
బంధములన్నీ తొలగించు వాడు.
వాడే మన వాడు - శ్రీ వాసుదేవుడు ॥ ఊరు ॥
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.