స్వామి సుందరచైతన్య ఆత్మ తత్త్వాన్ని తెలుసు కొనడానికి దేశం ప్రధానం కాదు.. కాలం ప్రదానం కాదు. మరి ఎవరు ప్రధానం? జ్ఞానం కలిగిన గురువు. మోక్షాపేక్ష కలిగిన శిశ్యుడు. కాబట్టి మన గృహవాతావరణం కాని మన కుటుంబ పరిస్థితులు కాని మనకు ఇష్టం లేనివి కావచ్చు. అవి అనుకూలమైనవి కాకపోవచ్చు. కానీ అవసరమైనవేనని మనం గ్రహించాలి. అటువంటి పరిస్థితులలోనే మన భక్తిని, విశ్వాసాన్ని, ధృడపరచుకొని కర్మయోగం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని ముందు మన ఆంతర్యంలో తయారు చేసుకొని ఆ తరువాత పరిసర ప్రాంతాలలో ప్రసరింపజేయ గలుగుతాం. యేదీ కూడా మన దగ్గర లేనిదే ఇతరులకు పంచలేము. ఇంట్లో భర్త, బిడ్డలు, అత్తమామల మధ్య ప్రేమతో అవగాహనతో, సానుభూతితో అలవరచుకోవాలి. ఓర్పుతో, సహనంతో పిల్లల అలవాట్లను, వారి జీవితాలను చక్కదిద్దడం నేర్చుకోవాలి. ఇదంతా చేయగలగాలంటే ముందు మీరు ఆదర్శంగా జీవించగలగాలి.
అందుకుగాను ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన విషయాలను నాలుగు సూత్రాల రూపంలో అందిస్తున్నారు. వీటిని మీరందరూ వ్రాసుకొని నిత్యం మననం చేస్తూ హృదయంలో నిలుపుకోండి..
మొదటిది.. అనివార్యాలను జీవితంలో ఎప్పుడు తప్పించుకోలేమని గ్రహించండి. రెండవది... జరిగే వాటిని అంగీకరించడం, మూడవది:- సరైన అవగాహనతో ఇంట్లో అందరిని అర్థం చేసుకోవడం. నాల్గవది :- పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు ప్రవర్తన మన ఆధీనంలో ఉంటుంది అని తెలుసుకోవడం. భోంచేస్తే ఆకలి తీరుతుంది.. ఆచరిస్తే ఆవేదన అంతరిస్తుంది.
జీవితం పట్ల అవగాహన:- 1. మనం అనుకోనివి జరగడం 2. దేహబాధలు 3. మనోసంబంధమైన బాధలు 4. మనం ప్రస్తుతం ఉన్న స్థాయికన్నా ఉన్నత స్థాయిలో వుండాలని కోరుకోవడం 5. గృహంలోని వాతావరణం పై అయిదు కారణాలు...
దుఃఖానికి కారణాలు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.