Wednesday, February 5, 2025

#నా_కథే_నాపాట_ఎంతని_పిలిచేది_నిన్ను#swami_sundara_chaitanyananda

ఎంతని పిలిచేది నిన్ను మాయ లెరుగని పిచ్చిమనసుకు ఎందుకు ఈ భారం? 1. కలువకు చంద్రుడు నేలకు మేఘుడు దగ్గరున్నారా? పంకజానికి తిమిర హరునికి దూరము నిలిచిందా? దూరము లేని భారము తెలియని భక్తికి అడ్డుందా? 2. ఏనాడైనా కాలం లోనే పోతారందరు పోయేకాలం రాలే దేహం తెలిసిన వారెవరు? కాలే దేహం కాటి కేగినా కాలదు మన బంధం ఎంతని పిలిచేది నిన్ను భగవంతుడంటే ఏమిటో సరియైన అవగాహన లేకపోవడం వల్ల నా మనసు లోని నిర్ణయాలు, ఆవేశాలు నా బ్రతుకును కుదిపేసేవి. దూరంగా ఉన్న వ్యక్తిని కేకేసి పిలిస్తే, అతడు మన దగ్గరకు వచ్చినట్లు, భగవంతుని భక్తితో పిలిస్తే, మనిషి లాగే దగ్గరికి వస్తాడని భావించటం చేత, అది జరగక పోయే టప్పటికి కుమిలి పోయేవాణ్ణి, తీవ్రంగా కలత చెందేవాణ్ణి. ఎందుకని భగవంతుడు నా దగ్గరికి రావడం లేదు? నాలో ఏదన్నా లోపముందేమో? లేక భగవంతుడు మనిషి లాగా దగ్గర లేడేమో! చాలా దూరం నుండి రావాలేమో అనుకునేవాణ్ణి. మళ్ళీ అనిపించేది, ఎక్కడో అరణ్యంలో ఉండి గజేంద్రుడు పిలిస్తే శ్రీహరి తొందర తొందరగా వచ్చాడు కదా! మరి నేను పిలిస్తే ఎందుకు రావడం లేదు? అని విలపించే వాణ్ణి. ఏది ఏమైనా, నేను భగవంతుడి కోసమే జీవించాలి. భక్తి తోనే బ్రతకాలి. భగవంతుడు వచ్చాడా, నేను తరించి పోతాను. ఒకవేళ రాకపోతే ఏమి చేయాలి? ఏముంది చేయడానికి? ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట చచ్చిపోతాను. కాని మళ్ళీ పుడుతామని అందరూ చెప్పుకుంటున్నారే! అప్పుడైనా భగవద్దర్శనం కాకుండా పోతుందా? అని ఊహించుకొని నన్ను నేను ఓదార్చుకొనే వాణ్ణి. బాధ మరీ ఎక్కువైతే, ఒంటరిగా కైవల్యా నదీ తీరంలో కూర్చుని బిగ్గర గానే రోదించేవాణ్ణి. ఆ రోజుల్ని తలుచుకుంటే, ఈ రోజు కూడా గగుర్పాటే. అలా ఏడుస్తూ భగవంతుణ్ణి వేడుకొనేవాణ్ణి. ఆ భావాలనే గుర్తుకు తెచ్చుకొంటూ ఈ పాట వ్రాశాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

BHAGAVADGITHA PARAYANAM - 18 CHAPTERS#SRI RAMAKRISHNA MUTH

https://drive.google.com/drive/folders/1abi1R2DLoCWhFX976n2HeRYDaWluTv8F?usp=drive_link