Tuesday, February 20, 2018

SAKALA DEVATA DHYANAMU




SAKALA DEVATA DHYANAMU https://www.youtube.com/watch?v=itQ_JfO5Yuc సకల దేవతా ధ్యానము ఓం శ్రీ గణేశాయ నమః శ్లోకం : తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి! పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవో, విశ్వదాభిరామ వినుర వేమ|| తాత్పర్యం : మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రేమించాలి. లేకుంటే మనము ఉన్నా లేనట్టుగానే చెప్పుకోవాలి. అటువంటివారు పుట్టలో చెదలతో సమానము. శ్లోకం : గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః - గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీ గురవేనమః || తాత్పర్యం : గురువే బ్రహ్మ, గురువే విష్ణుమూర్తి, గురువే స్వయం ప్రకాశుడగు మహేశ్వరుడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మము. కాబట్టి అట్టి సద్గురువుకు నమస్కారము. శ్లోకం : శుక్లాంబరధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ - సర్వవిఘ్నోపశాంతయే || తాత్పర్యం : తెల్లని వస్త్రములు ధరించినవాడు, సర్వ వ్యాపకుడు, తెల్లని చంద్రునివంటి వన్నె కలవాడు, నాలుగు భుజములు కలవాడు, ఎప్పుడూ నవ్వుచుండెడి మోముగలవాడు అగు వినాయకుని నా కార్యములకు విఘ్నము కలుగకుండుటకై ధ్యానింతును. శ్లోకం : జయతు జయతు దేవీ - సర్వదేవాత్మ భూతా | జయతు జయతు మాతా - సర్వమాంగల్య యుక్తా ! జయతు జయతు భక్తత్రాణ – నిత్యానురక్తా | జయతు జయతు గాయత్రీ - సర్వలోకైక మాతా !! తాత్పర్యం : సర్వదేవతా స్వరూపురాలైన గాయత్రీదేవి సర్వోత్కర్షతో విజయం చేయుగాక! సర్వమంగళ స్వరూపురాలైన గాయత్రీమాత విజయం చేయుగాక! సర్వదా భక్తులను రక్షించుటలో ప్రీతిగల ఆ తల్లి విజయం చేయుగాక! ఆ గాయత్రీమాత సర్వలోకాలకూ తల్లి. సర్వోత్కర్షగా విజయం చేయుగాక!! శ్లోకం : ఆదిత్యాయ చ, సోమాయ మంగళాయ బుధాయ చ | గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || తాత్పర్యం : సూర్యునకు, చంద్రునకు, కుజునకు, బుధునకు, గురు, శుక్ర, శనేశ్వరులకు, రాహువునకు, కేతువునకు నమస్సులు. శ్లోకం : సరస్వతి! నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || తాత్పర్యం : కోరిన వరములను అనుగ్రహించుచు కామరూపిణివై ప్రకాశించు అమ్మా సరస్వతీదేవీ! ఇదిగో నీకు వందనము చేయుచున్నాను. నేను విద్యలను పొందుటకు ప్రారంభించుచున్నాను. అవి ఎప్పుడును నాకు సిద్ధించుగాక! అని నన్ను అనుగ్రహింపుము. శ్లోకం : లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం | దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం | శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవద్ర్బహేంద్ర గంగాధరాం | త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్! తాత్పర్యం : క్షీరసాగరునీ కుమార్తె, శ్రీరంగని నివాసానికి రాణి, దేవతాస్త్రీలందరి చేత కొలువబడేది, లోక కాంతిప్రదయు, బ్రహ్మ, ఇంద్ర శంకరాదులచే కోలువబడే జనని, ముల్లోకములే కుటుంబంగా ఉండే పద్మోద్భవయు, నారాయణ ప్రియయు అయిన లక్ష్మీదేవికి నమస్సులు. శ్లోకం : సర్వ మంగళ మాంగల్యే - శివే సర్వార్థ సాధకే | శరణ్యే త్రయంబకే దేవీ - నారాయణీ నమోస్తుతే || తాత్పర్యం : అయిదవతనము, మంగళములను ప్రసాదించే పార్వతియై, మూడు కన్నులు గల దేవియై, నారాయణ స్వరూపురాలైన లక్ష్మియే అన్నికార్యములను సరిచేస్తూ ప్రకాశించే మహాశక్తికి నమస్సులు. శ్లోకం : వరాంకుశా పాశమభీతి ముద్రాం, కరైర్వహం తీం కమలాసనస్థాం! బాలార్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం, భజేహమంబాం జగదీశ్వరీం తామ్|| తాత్పర్యం : వర, అంకుశ, పాశ, అభయ ముద్రలతో కూడి చతుర్భుజాలతో,కమలాసనయై, కోటిసూర్య ప్రభలతో, త్రినేత్రాలతో ప్రకాశించే జగదీశ్వరి అయిన జగజ్జననికి ప్రణామములు. శ్లోకం : వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్ | తాత్పర్యం : ప్రపంచ ఆనందమూర్తియు, పార్వతీపతియు, దేవతలకు గురువు,జగత్తుకు కారణభూతుడు, అహిభూషనుడు (పాములు భూషణములుగా గలవాడు), లేడిని చేతియందు ధరించినవాడు, పశుపతి, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా గలవాడు, విష్ణుప్రియుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములనిచ్చువాడు,మంగళములు చేకూర్చు శుభమూర్తీ అగు శివుని నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఓం త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాత్ - మృత్యోర్ముక్షీయ మామృతాత్ || తాత్పర్యం : దోసకాయను తొడిమనుండి సులువుగ తృంచివేసినటుల మృత్యుబంధము నుండి మమ్ముద్ధరించి అమృతమొసంగుటకు సర్వజీవులకు పోషణకర్తయు, దివ్య పరిమళము గల దేహము వాడును అగు ముక్కంటినీ ఆరాధించెదను. శ్లోకం: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం | విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ! లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం | వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైకనాథమ్ || తాత్పర్యం : శాంతమూర్తియై, శేషశయ్య కలిగి, నాభియందు పద్మము కలిగి,దేవతా ప్రభువై, విశ్వమే రూపముగా కలిగి, ఆకాశమువలె మేఘమువలె నీలవర్ణము కలిగి, శుభకరమైన శరీరము కలిగి, లక్ష్మీనాధుడై, పద్మనేత్రుడై, యోగీశ్వరుల హృదయ ధ్యానమునందు గోచరించువాడై, తనను గొల్చువారి జనన మరణ రూపమైన సంసార భయమును హరించువాడై, సర్వలోకములకూ ఏకైక ప్రభువైన విష్ణుదేవుని గూర్చి నమస్కరించుచున్నాను. శ్లోకం : శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ: గుణాభిరామ: సీతాముఖాంభోరుహ చంచరీకః | నిరంతరం మంగళ మాత నోతు || తాత్పర్యం : ఆశ్రీతులకు కల్పవృక్షమైన, సమస్తమైన కళ్యాణ గుణములకు నిధియైన, సీతాముఖ పద్మమందలి తేనె త్రాగు తుమ్మెదయైన శ్రీరామచంద్రమూర్తి సదా నాకు మంగళమును కలిగించుగాక! శ్లోకం : శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం | సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం | ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం | రామం నిశాచర వినాశకరం నమామి || తాత్పర్యం : రఘువంశములో జన్మించినవాడు, దశరధునీ పుత్రుడు, ఊహకు అందనివాడు, సీతాదేవికి భర్త, రఘువంశమునకు మణిదీపము వంటి వాడు, ఆజానుబాహుడు, కమలదళములవలె విశాలమైన కన్నులు గలవాడును, రాక్షసులను అంతమొందించేవాడును అయిన శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కర్రీస్తున్నాను. శ్లోకం : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే | తాత్పర్యం : శివుడు పార్వతికి శ్రీరామ మంత్రోపదేశము చేసెను. పార్వతీ! 'శ్రీరామ రామ రామ' అని రామనామమును జపింపుము. ఒక్కసారి 'రామ' అని యన్నచో విష్ణు సహస్ర నామములను పఠించినచో కలుగు ఫలముతో సమానమైన ఫలము లభించును. శ్లోకం: జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రమ్ ! సకల నిగమ మంత్రం సర్వ శాస్రక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రమ్ || తాత్పర్యం : శ్రీరామమంత్రము సర్వదా జపించబడును గాక! ఆ మంత్రమును జపించిన జన్మ సఫలమగును. ఇక పుట్టుట గిట్టుట యనెడి దుఃఖము లేకుండ జేయును. సర్వ వేదముల సారము గాన సర్వ శాస్త్రములు చదివినంత జ్ఞానము కలుగును. రఘువంశమున పుట్టిన రాముని నామము అంతటి మహిమ కలిగినది. 'రామ రామ” అని ఉచ్చరించిన చాలు. అదే మహామంత్రము. శ్లోకం: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్ | సర్వాంగే హరిచందనం చ కలయన్ కంధే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః || తాత్పర్యం : లలాట భాగమున కస్తూరీ తిలకం కలవాడు, వక్షస్థలమున కౌస్తుభమణి కలవాడు, ముక్కుబులాకీగా మంచిముత్యం కలవాడు, కరతలమందు వేణువు కలవాడు, చేతులకు కంకణములు కలవాడు, దేహమంతా హరిచందనం పూయబడినవాడు, కంఠమందు ముత్యాలహారం కలవాడు, గోపస్త్రీలతో పరిశేష్టింపబడి ఉన్నవాడయిన గోపాల చూడామణి విజయం పొందుతాడు. (ఇంతటి మహిమాన్వితుడైన శ్రీకృష్ణ భగవానునికిదే నా వందనం.) శ్లోకం: వినా వేంకటేశం ననాథో ననాథః, సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ! ప్రసీద ప్రసీద, ప్రియం వేంకటేశ! ప్రయచ్ఛ ప్రయచ్ఛ!! తాత్పర్యం : శ్రీ వేంకటేశ్వరుడు తక్క నాథుడు లేడు (అనగా వేంకటేశ్వరుడు తప్ప వేరొక నాథుడు లేడని భావము) ఎల్లప్పుడు శ్రీ వేంకటేశ్వరునే స్మరింతును. హరీ! వేంకటేశా! కాపాడు. ఓ వేంకటేశా ! నాకు ప్రియమును ఇమ్ము (కల్గించుము). (రెండుసార్లు పలుకుట ఆదరాతిశయమును సూచించును). శ్లోకం : మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాంవరిష్ణమ్ | వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి || తాత్పర్యం : గాలితో సమానవేగము కల్గుటేగాక మనోవేగము గల్గినట్టియు, ఇంద్రియములను జయించినట్టియు, బుద్ధిశాలులలో అగ్రేశ్వరుడైనట్టియు, వాయుపుత్రుడైనట్టియు, వానర సైన్యమునందు ముఖ్యుడైనట్టియు, శ్రీరామ దాసానుదాసుడును, దూతయు అయిన హనుమంతునికి ప్రణామము. శ్లోకం : బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్ II తాత్పర్యం : భయాలను పోగొట్టే దైవం హనుమంతుడు. ఆస్వామి నామాన్ని నిత్యం స్మరిస్తే చాలు - బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, సంపూర్ణ ఆరోగ్యం, పీడ లేకపోవడం, సత్యవచనులైన ఋషుల వాక్కు - అనబడే ఎనిమిది గుణాలూ సిద్ధిస్తాయి. శ్లోకం : ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || తాత్పర్యం : ఆపదలను పరిహరించువానిని, సమస్త సంపదలను చేకూర్చు వానిని, ఎల్లరను ఆనందింపజేయు శ్రీరామచంద్రుని నేను మరల మరల నమస్కరించుచున్నాను. శ్లోకం: రామ రామ తవ నామ జపంతః పామరా అపి, తరంతి భవవాబ్దిమే | అంగనంగి భవదంగుళిముద్ర కీం విచిత్ర మతర, తపిరభిమే || తాత్పర్యం : ఓ శ్రీరామమూర్తీ ! నీ పేరును జపించుచుండు మూడులైనను సంసార సముద్రమును దాటుచుండగా తన శరీరముతో కలసిన నీ వ్రేలి ముద్రిక గల వానరుడు సముద్రమును దాటెననుట యేమి చిత్రము! సువర్చల ఆంజనేయ సమేత లక్ష్మణ సహిత సీతా రామచంద్రాయ నమః గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి. నిత్య స్మరణ మంత్రములు : శ్రీరామ జయ రామ జయ జయ రామ || ఓం రాం రామాయ నమః || శ్లోకం : ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ || పూజ అనంతరం క్షమార్పణ పూర్వక సమర్పణము శ్లోకం : యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే || తాత్పర్యం : జన్మజన్మలలో చేసిన పాపాలు ప్రదక్షిణ చేసేకొద్దీ ఒక్కొక్క అడుగుకీ నశించిపోతాయి. శ్లోకం : పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల || తాత్పర్యం : నేను పాపిని. పాపకర్ముణ్ణి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ శరణాగత వత్సలా! దయతో నన్ను కాపాడు. శ్లోకం : అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన - రక్ష రక్ష మహేశ్వర || తాత్పర్యం : నీవు తప్ప నాకు వేరే శరణం లేదు. నువ్వే శరణు కనుక ఓ మహేశ్వరా ! కారుణ్య భావంతో నన్ను రక్షించు! రక్షించు! శ్లోకం : మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! శ్లోకం : యదక్షర పరభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే || తాత్పర్యం : నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | పూజావిధిం న జానామి క్షమస్వ హనుమత్ర్పభో || తాత్పర్యం : పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత శ్రీరామదూతా! క్షమించమని ప్రార్ధిస్తున్నాను. శ్లోకం : గోహ్రూణా మపి గోప్తాత్వం గృహాణా మత్కృతం జపం | సిద్ధిం కురుష్య మే దేవ త్వా మహం శరణం గతః!! తాత్పర్యం : ఓ దేవా! నీవు గుప్తముగా ఉండు వారలలో అతి గుప్తముగా ఉండువాడివి. నేను చేసే జపాన్ని స్వీకరించి నాకు సిద్ధిని ప్రసాదించుము. ఇదే నా ప్రార్థన ! శ్లోకం : కాయేనవాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి|| తాత్పర్యం : మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను. శ్లోకం: అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్| సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభమ్|| తాత్పర్యం : అకాలమృత్యుహరణమైనది. సర్వవ్యాధి నివారకము, సమస్త పాపక్షయకరము, పావనము, శుభకరము అగు సువర్చల ఆంజనేయ లక్ష్మణులతో కూడియున్న సీతారామచంద్రుని పాదోదకమును స్వీకరించుచున్నాను. శాంతి మంత్రములు దైవమతము ప్రతిష్ఠితమగును గాక! కరుణామతము వృద్ధి పొందును గాక! శాంతి మతము స్థాపితమగును గాక! సత్యమతము స్థిర ప్రతిష్ఠినొందును గాక! ధర్మమతము ఉద్దరింపబడును గాక! ఋషిమతము వర్ధిల్లును గాక! స్వాతంత్ర్యమతముజయించును గాక! జ్ఞానమతము వ్యాపకమగును గాక! గీతామతము ప్రచారమగును గాక! అహింసామతము కాపాడును గాక! పూజ అనంతరం క్షమార్పణ పూర్వక సమర్పణము శ్లోకం : యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే || తాత్పర్యం : జన్మజన్మలలో చేసిన పాపాలు ప్రదక్షిణ చేసేకొద్దీ ఒక్కొక్క అడుగుకీ నశించిపోతాయి. శ్లోకం : పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల || తాత్పర్యం : నేను పాపిని. పాపకర్ముణ్ణి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ శరణాగత వత్సలా! దయతో నన్ను కాపాడు. శ్లోకం : అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన - రక్ష రక్ష మహేశ్వర || తాత్పర్యం : నీవు తప్ప నాకు వేరే శరణం లేదు. నువ్వే శరణు కనుక ఓ మహేశ్వరా ! కారుణ్య భావంతో నన్ను రక్షించు! రక్షించు! శ్లోకం : మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! శ్లోకం : యదక్షర పరభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే || తాత్పర్యం : నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్లోకం : ఆవాహనం న జానామి న జానామి విసర్జనం | పూజావిధిం న జానామి క్షమస్వ హనుమత్ర్పభో || తాత్పర్యం : పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత శ్రీరామదూతా! క్షమించమని ప్రార్ధిస్తున్నాను. శ్లోకం : గోహ్రూణా మపి గోప్తాత్వం గృహాణా మత్కృతం జపం | సిద్ధిం కురుష్య మే దేవ త్వా మహం శరణం గతః!! తాత్పర్యం : ఓ దేవా! నీవు గుప్తముగా ఉండు వారలలో అతి గుప్తముగా ఉండువాడివి. నేను చేసే జపాన్ని స్వీకరించి నాకు సిద్ధిని ప్రసాదించుము. ఇదే నా ప్రార్థన ! శ్లోకం : కాయేనవాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి|| తాత్పర్యం : మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను. శ్లోకం: అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్| సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభమ్|| తాత్పర్యం : అకాలమృత్యుహరణమైనది. సర్వవ్యాధి నివారకము, సమస్త పాపక్షయకరము, పావనము, శుభకరము అగు సువర్చల ఆంజనేయ లక్ష్మణులతో కూడియున్న సీతారామచంద్రుని పాదోదకమును స్వీకరించుచున్నాను. శాంతి మంత్రములు దైవమతము ప్రతిష్ఠితమగును గాక! కరుణామతము వృద్ధి పొందును గాక! శాంతి మతము స్థాపితమగును గాక! సత్యమతము స్థిర ప్రతిష్ఠినొందును గాక! ధర్మమతము ఉద్దరింపబడును గాక! ఋషిమతము వర్ధిల్లును గాక! స్వాతంత్ర్యమతముజయించును గాక! జ్ఞానమతము వ్యాపకమగును గాక! గీతామతము ప్రచారమగును గాక! అహింసామతము కాపాడును గాక! విశ్వశాంతి - తద్వారా ఆత్మశాంతి ఓం ధియః శాంతిః - బుద్దులు - శాంతమగుగాక! ఓం అంతరిక్షః శాంతిః - అంతరిక్షము - శాంతి కూర్చుగాక! ఓం పృధ్వీ శాంతి: - భూమి - శాంతి కూర్చుగాక! ఓం ఆపః శాంతిః - జలము - శాంతి కూర్చుగాక! ఓం ఔషధయః శాంతిః - ఔషధులు - శాంతి కూర్చుగాక! ఓం వనస్పతయః శాంతిః - వనస్పతులు - శాంతి కూర్చుగాక! ఓం విశ్వేదేవాః శాంతిః - విశ్వదేవులు - శాంతి కూర్చుగాక! ఓం బ్రహ్మ శాంతిః - బ్రహ్మ శాంతి - కూర్చుగాక! ఓం సర్వం శాంతిః - సర్వము - శాంతి కూర్చుగాక! శాంతి రేవ శాంతిః - శాంతియే శాంతి! సామా శాంతిరేధి - ఆ శాంతి నాకు వర్ధిల్లు గాక! ఓం శాంతిః శాంతిః శాంతిః తండ్రీ! శ్రీరామచంద్ర ప్రభూ! సర్వకాల సర్వ అవస్థలందును మమ్నల్నందర్నీ కాపాడుకునే పూచీ నీదే తండ్రీ! ఈశ్వరాంశ సంభూతుడైన గురుదేవా! మారుతీ! నీవే మాకు రక్ష! రక్షమాం! రక్షమాం! పాహిమాం! పాహిమాం! శరణు! శరణు! శరణు! దాసోహం! తవదాసోహం! (3 సార్లు)