Friday, April 18, 2025

Special Debate With Analyst Paparao About Telangana Financial Status Falldown | T News

ఆ ఎరుకే ఆధ్యాత్మికత!…జిడ్డు కృష్ణమూర్తి#linkindescription#must


CLICK THIS LINK FOR MORE VIDEOS BOOKS; 

narayanateertha tarangalu

DEVULAPALLI LALITHA GEETAALU

#Sri_Devulapalli_Krishna_Sasthry#bhakti_songs_telugu

#manchimatalu#ఈశ్వర్_9948023503#lyricalvideo#part01-04_Quotes#manchimataluteluguquotes

BRS Leader Ravinder Reddy Mass Warning To MLA Mynampally Rohit | KCR | KTR | BRS | Mirror TV

Tuesday, April 15, 2025

ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD VIDEO LINKS@DAILYMOTION CHANNEL

 

ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-8

https://dai.ly/x64szk2

ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-4

https://dai.ly/x64t20r

ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-6

https://dai.ly/x64n51w

ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNA PRASAD_disk-7

https://dai.ly/x64o5nf

ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-5

https://dai.ly/x64n3uj

ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNAPRASAD-disk3

https://dai.ly/x64i25r

ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-1

https://dai.ly/x64hg65

ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNAPRASAD-disk2

https://dai.ly/x64hefx

SRI VENKATARAMANA GOVINDA_G.BALAKRISHNAPRASAD

https://dai.ly/x64etea

alara chanchalamyna_GBKP

https://dai.ly/x64eu4v

yeduTa nunnADu veeDubAluDu

https://dai.ly/x64eton

yedayanemi hari ecchina janmame- G. Balakrishna prasad

https://dai.ly/x64ets5

muddulumomuna_g.balakrishna prasad

https://dai.ly/x647b14

satulala_GBKP

https://dai.ly/x647bs7

sapta girulu datali_GBKP

https://dai.ly/x647bgf

MUNULA TAPAMULA_GBKP

https://dai.ly/x647b6g

padiharu vannela_GBKP

https://dai.ly/x647b9t

mudugare_GBKP

https://dai.ly/x647b0d

meluko_GBKP

https://dai.ly/x6478sk

kondalu dati vachinamayya_GBKP

https://dai.ly/x6478nz


Kalashapuramu kada_GBKP

https://dai.ly/x6478l0

DAYAGANAVAYYA_gbkp

https://dai.ly/x647853

Ideshirasu manikya_gbkp

https://dai.ly/x6478ha

ANI ANATICHE_GBKP

https://dai.ly/x64788a


Sunday, April 13, 2025

జీవిత పరమార్థం #PURPOSE OF LIFE


for salvation.






















Guru: Who is that? Child! Why are you so anguished? Student I am blind and groping in darkness unable to perceive the purpose of this life. G: Do you think there is a purpose to this life? S: Isn't there any, master! There were Rishis who learnt and taught Vedas and Upanishads, there kings and Monarchs who conquered the worlds and also the mean and the meaningless. What happened to them all after death, Master? G: You innocent duckling! When the whole world is mad of sensual pleasures with this body, why do you bother what happens after death? Forget about that inquisitiveness. I will teach the way to possess all the eight coveted treasures. Enjoy them. S: No master! No! I enjoyed them all and learnt that they are ephemeral and mean. I hold no desire for them. There is one question that plagues me. Where do we come from? Where do we go? Enough if you clear this doubt. G: When it is beyond the realm of divinity to grasp it, what to speak of mortals? S: If seers like you deny teaching us about it, master, where have we to go? Do you condemn us to this world of strife and the circle of life and death forever? Is there no way out, master for us? G: Why not? There is. This body is equipped to learn the temporal as well as the spiritual or eternal knowledge. This body is the raft for both for anchoring in Sansara or navigate to salvation. Infatuated with the enticing ephemeral world and confusing it to be the only and the lasting, we are rolling on the Potter's Wheel of life and death cycles. We have to realise that all that we see is transitory and there is some primal cause which is permanent that is responsible for this apparent drama. One has to self-experience it internally and that is the purpose of life. S: How can I get that self-realisation, master? G: There are several schools... like the school of intellect, the school of devotion etc. But it is the concerted opinion of elders that Rajayoga is the easiest to follow for salvation. S: G: Rajayoga? Who is going to teach me that, master? When the time comes, God himself shall come to you as Guru and shall teach you. S: For a man groping in utter darkness, you chanced upon me like a beacon. You are my Guru. You are my God. Kindly teach me the secret of that Yoga and unveil the truth. G: Then let me teach you the arcane knowledge. Pay attention to it. Just as you can't convert metal to gold without arresting its quintessence, you can't see the truth unless you arrest your mind. Mind is the chief hurdle that stands between us and salvation. It is the cause of our temporal bonds. If you can conquer your mind, you can conquer everything else. This is called Yoga. When you stand in the state of Samadhi subduing the wavering mind, and the sensual desires, your mind assumes infinite power. Then there is nothing you can't do. The nature that toyed with you thus far becomes itself a toy in your hands. It surrenders to you. Is this what is meant by salvation, master? S: G: No, my child. This is the first step to it. And if you continue to meditate with unwavering mind, and without being fooled by that infinite power, you come out as a self luminous, blissful, eternal and self evident truth. That is what is meant by Tat Tvam Asi. You can see yourself in me. So go ahead and enjoy the fruits of Rajayoga. S: Guru is the creator, Guru is the sustainer, and Guru is the annihilator Guru is a veritable Supreme Being, and to that Guru, I bow my head. 

ఎవరు? నాయనా! నీవు ..... ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి, జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకుంటున్నావా? లేదా స్వామీ? వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే! వీరంతా మరణించిన తరువాత ఏమౌతున్నారు స్వామి? పిచ్చివాడా! లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే మరణించిన తరువాత ఎమౌతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదలుకో ! నీకు అప్లైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామీ! అవన్నీ అనుభవించి క్షణికములని, క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే! మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం? ఈ సందేహం నివారించండి! ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యం అవుతుందా? మీవంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు? స్వామీ! మేమీ దుఃఖ భాజనమైన సంసారం లో కృశించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా? మానవునికి తరుణోపాయం లేదా స్వామీ? లేకేం నాయనా ఉంది ... ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం అవిద్యచే మొహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని, దుఃఖ భాజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుచున్నాము. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతా కారణమైన మహా చైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మను భావము పొందాలి అదే జీవిత పరమార్థం.. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామీ? భక్తి మార్గం తో కొందరు జ్ఞానమార్గం తో కొందరు సాధించారు, కాని, జీవన్ముక్తి కి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజ యోగమా?! నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు, వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి, సత్య స్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము. రసాన్ని కట్టేస్తేనే కాని స్వర్ణం కానట్టు, మనస్సుని కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సుని స్వాధీనం చేసుకుంటే, మనకు స్వాధీనం కానిదే లేదు. ఆ సాధనే యోగామంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి, చిత్త వృత్తులనణచి, సమాధి స్థిరుడవైనప్పుడు, నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది, అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు, నిన్నింత వరకు తన చేత చిక్కిన్చుకుని ఆడించే ప్రకృతి, నీ స్వాధీనం అవుతుంది. 'మోక్షం' అంటే అదేనా! స్వామీ? కాదు నాయన ! అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక, సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే, స్వయం ప్రకాశము, సచ్చిదానంద మయము, శాశ్వతము అయిన స్వస్వరూపానుభావం కేవల జ్ఞాన రూపంగా నీవనుభవిస్తావు.. ''అంటే అదే! అప్పుడు నువ్వు నేను ఒక్కటే! రాజ యోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు ! గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

20. భగవద్ధ్యానమే ధ్యేయం

20. భగవద్ధ్యానమే ధ్యేయం శిష్యుడు : శ్రీరామకృష్ణ గురుదేవులు ఇంకా సజీవులై ఉన్నారనే భావిస్తున్నారా స్వామీ? స్వామి : నీకేం మతిపోయిందా? లేకపోవడం ఏమిటి? ఆయన ప్రత్యక్షంగా లేకుంటే ఇల్లు వాకిలీ వదలిపెట్టి మాకీ సన్న్యాసి బ్రతుకు ఎందుకు? ఆయన ఉన్నారు. హృదయపూర్వకంగా ఆయన్ను ప్రార్థించు. ఆయనను దర్శించాలని, ఆయన గురించి తెలుసుకోవాలని వేడుకో. నీ సమస్త సందేహాలు నివృత్తిచేసి తన నిజస్వరూపాన్ని నీకు చూపుతారు. శిష్యుడు : అంటే, ఆయన ప్రత్యక్షమై మీకు దర్శనం ఇస్తారా, స్వామీ? స్వామి : ఇస్తారు. అదే ఆయన దయ, నా భాగ్యం. ఆయన దయ అంటూ ఉంటే ఎవరైనా ఆయన్ను దర్శించుకోవాలని ఉందో, ఎందరికి ఆయనంటే | ఇష్టమో భగత్సాక్షాత్కారం పొందడమంటే మాటలు కాదు. శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సామరస్యం చెంది వికాసం పొందకుంటే, ధర్మం, పారమార్థిక జీవితం అసంభవం. అందుకు వలసినది శ్రద్ధ, అఖండ శ్రద్ధ, శ్రద్ధావంతుడవైతేనే భగవద్దర్శన మహాభాగ్యం లభిస్తుంది. శ్రద్ధ జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది. శ్రద్ధ కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి. సంసారం పట్ల వైరాగ్యం జనించనిదే శ్రద్ధాభక్తులు వికసించవు. వైరాగ్యం కలగాలి, భగవంతునిపై ధ్యాస నిలవాలి. అహంకారం వర్ణించడమే వైరాగ్యం. శిష్యుడు : స్వామీ! నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మనస్సు పరిపరి రీతుల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ చాంచల్యాన్ని అరికట్టడం ఎలా స్వామీ? స్వామి : ప్రారంభంలో ఆ విధంగానే ఉంటుంది. గంగానదికి ఆటుపోట్లు ఉన్నట్లే మొదటి దశలో సాధకుని పారమార్థిక మనోభావాలకూ ఆటుపోట్లు ఉంటాయి. కాని సాధన కొనసాగిస్తూ ఉంటే క్రమంగా ఇటువంటి ఒడుదుడుకులు ఎదురవకుండా నిరంతరం మనస్సు భగవంతుని వైపే పయనిస్తుంది. కాబట్టి నీ చిత్తచాంచల్యాన్ని అరికట్టడానికి శ్రద్ధతో ప్రయత్నం చేయాలి. ఆ కిటుకు చెబుతా విను: ఆసనం మీద కూర్చోగానే ధ్యానం ప్రారంభించవద్దు. బాహ్య వ్యవహారాల నుండి మనస్సును మరలించి ఇష్టదేవతా పావన చరణాలపై నిలిపి మానసికంగా జపధ్యానాలు అనుష్ఠించు. ఇలా కొంతకాలం సాగిస్తే మనస్సే పరిభ్రమించడం స్వయంగా మానేస్తుంది. జపమార్గం గమ్యాన్ని చేరడానికి సులువైన విధానం. నిరంతర జప సాధనతో మనస్సు ప్రశాంతమవుతుంది; కించిత్తు కూడ చంచలం చెందక నిశ్చలమై భగవద్ధ్యానంలో లయిస్తుంది. కనుక సక్రమంగా జపం చేయడం, దానితో పాటు ఇష్టదేవతా ధ్యానం చేస్తూ ఉండమనే నా హితబోధ. జపధ్యానాల మేళవింపుతో సత్వరమే విజయం ఒనగూరుతుంది. అచంచల దీక్షతో సదా సాధనలు కొనసాగించు. సాధన చేయని రోజు అంటూ ఏదీ ఉండకూడదు. ఇష్టం ఉన్నా, లేకున్నా ఏమరుపాటులేక ఈ క్రమంతో కనీసం మూడేళ్ళపాటు సాధన కొనసాగిస్తే, నీలో భగవద్భక్తి పెంపొందుతుంది. విశేషమైన భగవత్ సాన్నిధ్యమూ ప్రాప్తిస్తుందని నొక్కివక్కాణిస్తున్నాను. అంతేకాదు, అప్పుడు నీ మనస్సుకు భగవత్ స్వరూపం తప్ప మరేదీ కనబడదు. దేనిమీదా ధ్యాసపోదు. అట్టి స్థితిలో సాధకుడు ఆధ్యాత్మిక జీవితం ఒసగే ఆనందాన్ని చవిచూడ గలుగుతాడు. భక్తి లేనిదే ఏకాంతవాసం కుదరదు; ఆధ్యాత్మిక సాధనలు కొనసాగవు. ఏకాంతంలో ఉన్నప్పుడు భ్రమ ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అందుకోసమే ఒకే విధానం, ఒకే రకమైన మనోధోరణులున్న ఇద్దరు కలిసి జీవించాలి. అలాంటప్పుడు ఉభయులలో ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, కాలుజారే ప్రమాదం తలెత్తినా పరస్పర సహాయ సహకారాలు అందుతాయి. ఇద్దరే కలిసి ఉండాలి, అంతకంటె ఎక్కువమంది ఉంటే పర్యవసానం గందరగోళమే. అందరూ ఒక చోట చేరితే లోకాభిరామాయణంలో దిగవచ్చు. ఆ వ్యర్థప్రసంగాలు ఉదాత్త ప్రవృత్తుల్ని, ఉన్నత ఆశయాలను వమ్ముచేయడమేగాక భగవంతుణ్ణి విస్మరింప దారితీస్తాయి. తీవ్రసాధనలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు ఆహారాన్ని కనిష్ఠ పరిమాణానికి తగ్గించాలి. కడుపార భుజిస్తే జపధ్యానాలు కుదరవు. నీకున్న శక్తిసామర్థ్యాలలో అధిక భాగం జీర్ణప్రక్రియలోనే వ్యయం కావడమే ఇందుకు కారణం. మనస్సు కలవరపాటు చెందుతుంది. అందుకే మితనిద్ర, మితాహారం గురించి భగవద్గీత అంతగా నొక్కి వక్కాణిస్తున్నది. "మితిమీరి తినేవాడికి, అమితంగా ఉపవాసాలు ఆచరించేవాడికి యోగం లభించదు. మితిమీరి నిద్రించే వాడికి, అర్థంలేని జాగరణ చేసేవాడికి కూడ యోగం సాధ్యం కాదు.””1 పవిత్రమైన ఈ మఠంలో సాధన నిమిత్తం ఎన్ని సదుపాయాలు కల్పించబడి ఉన్నవో గమనించు. అన్న వస్త్రాదుల గురించి మీరెలాంటి తాపత్రయం చెందనక్కర్లేదు. సర్వమూ సంసిద్ధమే. ఇక్కడే ఉంటూ జపధ్యానపరాయణుడవై మనస్ఫూర్తిగా సాధనచేస్తూ *************************************************** 
  1. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః | న చాతి స్వప్న శీలస్య జాగ్రతోనైవ చార్జున. ॥ - గీత 6.16
************************************************* 
 జీవితాన్ని గడుపు నాయనా! ఊరకే దేశద్రిమ్మరిలా జీవించడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఇటూ అటూ పరిభ్రమిస్తూ ఉన్నంతమాత్రాన ఋషివో మహాత్ముడవో కాగలననుకొంటున్నావా? పొరపాటు. ద్రిమ్మరివైనంత మాత్రం చేత ఋషివయ్యేవా? నిరంతర సాధన లేకుండా పారమార్థిక అనుభూతి లభించదు. కేవల పటాటోపంతో దేన్నీ సాధించలేవు. ఆ భగవదేచ్ఛ నీలో ఉండి ధ్యానపరాయణుడవు కావాలి, భగవత్ చింతనలో సంలీనమైపోవాలి సుమా! 21. సదా నామజపమే శరణ్యం ఇంద్రియాలకు సంచాలనకర్తయైన మనస్సును మొట్టమొదట నియంత్రించాలి. ఆ తదుపరి మనస్సు బుద్ధిని ఆత్మలో లయింప చేయాలి. సాధుసాంగత్యం నెరపినప్పుడుగాని కామక్రోధాదులు తొలగిపోవు. అవి వైదొలగినట్లు అనిపించినా, సూక్ష్మరూపంలో ఉండనే ఉంటాయి. సమాధి స్థితిని పొందినప్పుడే ఆ సూక్ష్మం కూడ తొలగిపోవడం సంభవిస్తుంది. కనుక బాహ్యస్మృతిలో ఉన్నప్పుడు సదా మెలకువతో మసలుకోవాలి సుమా! భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం, పరమార్థం మిథ్య కాదు, యథార్థం. కేవలం జనాన్ని నైతికవర్తనులను చేయడానికీ, సాంఘికపరమైన కట్టుబాట్ల కోసమూ ఈ తత్త్వాలు నిర్దేశింపబడలేదు. నిజంగా దేవుడు ఉన్నాడు. భగవంతుడు నిత్యసత్యస్వరూపుడు. ఆయనను మనం దర్శించగలం. ఎప్పుడు? మనోనిగ్రహం సంతరించుకొని, ప్రశాంతచిత్తుడవై సుఖదుఃఖాదులనే ద్వంద్వాలను సమానదృష్టితో చూడగలిగినప్పుడు. అందుకై వేకువ జామున, మధ్యాహ్న సమయాన, సంధ్యాసమయాన, నడిరేయి సమయంలో నియమనిష్ఠలతో ధ్యానం చేస్తూండాలి. అదే ధ్యానానికి సముచిత వేళలు. ఒక లక్ష్యం మీద నీ మనస్సును కేంద్రీకరించి, స్థిరచిత్తుడవై ఎలాంటి పరిస్థితులు తలెత్తినా నిష్ఠగా నీ సాధనలు అనుష్ఠిస్తూ ఉండాలి. అనునిత్యం గీతలో ఒక అధ్యాయం పారాయణ చేయాలి. పనికిమాలిన తలంపులతో, తాపత్రయాలతో ఆందోళన చెందినప్పుడు గీత పారాయణ చేస్తే శాంతి చేకూరుతుంది, మనస్సు స్థిమితపడుతుంది. అనుభవ పూర్వకంగా చెబుతున్న మాట ఇది. ప్రతి రోజు ఆత్మవిచారణకై కొంత సమయం వినియోగించు. నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకో: "ఈ లోకానికి నేనెందుకు వచ్చాను? నేను ఏ విధంగా జీవితం గడుపుతున్నాను? నిజంగా నాకు భగవంతునితో అవసరం ఉందా? ఆ భగవంతుని దివ్యదర్శనానికై నిజంగా ప్రయత్నిస్తున్నానా?” ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు మనిషిని మోసం చేస్తూ ఉంటుంది. మనస్సుకు లోబడి మనిషి జీవించరాదు, అధీనుడు కారాదు; అందుకు మారుగా తానే దాన్ని లోబరచుకోవాలి, దానిని తాను శాసించగలగాలి. నువ్వు సత్యనిష్ఠను విడువరాదు. నీ హృదయం నిర్మలమై ఉండాలి. నిర్మలత్వం సంతరించుకొనేకొద్దీ నీ మనస్సు భగవంతుని వైపే మొగ్గుతూ ఉంటుంది. దీన్ని నువ్వు గమనించవచ్చు. నీ మనస్సు నిన్ను అలవోకగా మోసగించి ఏ రీతిలో లోబరచుకొంటుందో కూడ నువ్వు గుర్తించగలుగుతావు. నీ ఇంద్రియాలే నీకు శత్రువులు. అయినా నువ్వు వాటిని నియంత్రించ గలిగితే, అవి నీకు నేస్తాలవుతాయి. మరో విధంగా చెప్పాలంటే మనస్సే నీకు శత్రువు, మిత్రుడూను.' 
************************************************* 
1. ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మానమవసాదయేత్ | ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥ - గీత 6.5 
మానవుడు ఆత్మవలననే (ఆత్మను) తనను ఉద్ధరించుకోవాలి. కనుక ఆత్మను బలహీన మొనర్చుకోరాదు. ఎందుకంటె ఈ ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మే శత్రువు. బన్దురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితం । అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥ - గీత 6.6 *************************************************** 
జపధ్యాన సాధనలలో నిమగ్నుడవవు. మనస్సు స్థూలమై ఉన్నందున స్థూల విషయాలనే పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటుంది. కాని జపధ్యానాలు అనుష్ఠించిన కొద్దీ మనస్సు సూక్ష్మమై సూక్ష్మతత్త్వాలను గ్రహించ గలుగుతుంది. సాధనలను కొనసాగిస్తూనే ఉండాలి. శారీరక పరంగా చేసే తపంకూడ కొద్దోగొప్పో మేలే ఒనగూరుస్తుంది. అమావాస్య, ఏకాదశి తిథులలో ఒంటిపూట మాత్రమే భుజించాలి. వ్యర్థప్రసంగాలతో కాలక్షేపం చేయరాదు. సదా భగవంతుని మదిలో తలచుకోవాలి. నువ్వు తింటున్నా, కూర్చున్నా, లేచినా, పడుకొన్నా ఎల్లవేళలా ఏ పనిచేస్తూన్న భగవద్ధ్యానం మానరాదు. 
********************************************************
 (సవివేకమైన) ఆత్మ యొక్క తోడ్పాటుతో దేహేంద్రియ సంఘాతాన్ని లోబరచుకొన్న వ్యక్తికి ఈ ఆత్మ బంధువు. కాని లోబరచుకోని వ్యక్తికి ఈ ఆత్మే శత్రువై (బాహ్య) శత్రువులా వర్తిస్తుంది. లోకము లన్నియున్ గడియలోన జయించిన వా డవింద్రియా నీకముఁ జిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుఁజేయు నీ భీకర శత్రు లార్యురఁబ్రభిన్నులఁ జేసిన బ్రాణికోటిలో నీకు విరోధి లేఁడొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా! - శ్రీమదాంధ్ర భాగవతం, ప్రహ్లాదచరిత్ర - 7.267 ********************************************************** 
ఈ రీతిగా సాధన చేసినట్లయితే, ధ్యానానికి నువ్వు కూర్చోగానే నీ మనస్సు నీ ధ్యాస భగవంతునిపై లీనమౌతాయి. మనస్సు ధ్యానంలో మగ్నం కాగానే నీ హృదయం ఆనంద సరోవరమైపోతుంది. వ్యర్ధప్రసంగాలలోను, అనవసర వ్యవహారాలలోను నీ కాలాన్ని వృథా చేసుకోకు. అక్కరలేని మాటలు నీ శక్తిసామర్ధ్యాలను దుర్వినియోగపరుస్తాయి. కనుక 'అప్రస్తుత ప్రసంగాన్ని విడిచిపెట్టు' అని ఉపనిషత్తు' బోధిస్తోంది. ధ్యానం నిమిత్తమే నీ కాలాన్ని వినియోగించు. 'మనస్సును నాకు అర్పించు. నా భక్తుడవవు, నన్ను పూజించు, నాకు ప్రణమిల్లు' అని గీతాచార్యుని వాక్కు “నీ మనోశక్తిని ఎన్నడూ దుర్వినియోగపరచకు” అనేవారు శ్రీరామకృష్ణులు. నిరంతరం భగవంతుని స్మరించమని అది హెచ్చరిక. లౌకికుడు తన ధ్యాసనంతా ధనం మీద పెట్టి అదెక్కడ ఖర్చయిపోతుందోనని ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. కాని మనస్సును ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో అతగాడు గ్రహించడు. ****************************************************** 
1. ఆత్మాన మన్యోవాచో విముంచథ - ముండకోపనిషత్తు మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. - గీత, 9-34 
****************************************************** 
భగవత్సాక్షాత్కారానికి సతతం భగవత్స్మరణ చేయడం కంటె సులభమైనది, మహత్తరమైనది, అనువైనది మరొక సాధన లేదు. అటువంటి సాధనే కుండలినీ శక్తిని మేల్కొల్పుతుంది. అప్పుడు ఒకదాని వెంట ఒకటిగా మాయావరణాలు తొలగిపోతాయి. నూతన దృష్టి ఏర్పడుతుంది. ఎంతటి అపురూప నిధి నీలో దాగుకొని ఉందో అప్పటికి నీకు తెలుస్తుంది. నీలోని దివ్యత్వం వికసిస్తుంది. శ్రీరామకృష్ణులను ప్రార్థించు, ఆయన ఇంకా ఉన్నారు సుమా! మనసారా ప్రార్థిస్తే ఆయనే నీకు దారిచూపుతారు. 'నేను మీవాణ్ణి, మీరు నా వారు' అంటూ ఆయనలో నీ మనస్సు లయం చేయి. సామాన్యంగా మనస్సు నదిలా పల్లం వైపుకే పయనించడం కద్దు; అంటే అధోగతిపాలవుతుంది. కామినీ కాంచనాల, పేరుప్రతిష్ఠల కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ మనోగమనాన్ని మార్చాలి. మనస్సును ఉన్నత దిశకు మరలించాలి, భగవంతుని కేసి త్రిప్పాలి. శ్రీరామకృష్ణుల మనస్సు సదాసర్వవేళల ఇంద్రియాతీతమైన భూమిలో సంచరించేది. విశేషప్రయత్నం మీదగాని ఆయన మనస్సు సాధారణ బాహ్యజగత్తుకి దిగివచ్చేది కాదు. జపం, జపం, జపం. ఏ పనిలో ఉన్నప్పటికీ సతతం జపం చేస్తూనే ఉండాలి. ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా భగవన్నామమనే చక్రం ఆగక పరిభ్రమిస్తూనే ఉండాలి. అదే సాధన. దానితోనే సమస్త తాపత్రయాలు అణగిపోతాయి. భగవన్నామాన్ని ఆశ్రయించి ఎందరు పాపాత్ములు పావనులయ్యారో, విముక్తులయ్యారో, దివ్యత్వం సంతరించుకొన్నారో తెలుసు కదా! కనుక భగవంతునికి, భగవన్నామానికి ఉన్న మహిమను ప్రగాఢంగా విశ్వసించు. భగవంతునికి ఉన్నంత శక్తి ఆ నామానికి కూడ ఉన్నదని గ్రహించు. భక్తుని మనస్సే భగవంతుని నివాసస్థానమని గుర్తించు. మనస్ఫూర్తిగా భగవంతుని, "దయతో నాకు శ్రద్ధాభక్తులు అనుగ్రహించు” అని ప్రార్థించు. నీ మనోవాక్కులు రెండూ ఏకమై ఉండాలి. సమస్తాన్ని భగవత్స్వరూపంగా గాంచాలి. సకల జీవరాసుల్లోను పరమాత్మనే చూడగలగాలి. సర్వత్రా ఆ సర్వేశ్వరుని చూడగలగాలి. 'తృణాదపి సునీచేన' అన్నట్లు గడ్డిపోచకంటే కూడ వినమ్రత్వం సంతరించుకోవాలి. భగవత్కథలనే వినాలి. భగవంతుని కీర్తించాలి, భగవన్నామాన్నే జపించాలి. భగవద్గుణగానాదులు లేని చోటు నిశ్మశానం వంటిదిగా ఎంచి విడిచిపెట్టాలి. భగవంతుడు సర్వులకూ ఆప్తుడు, అత్యంతాప్తుడు. ఆయన నీకెందుకు దర్శనం ఇవ్వడు? నీ హృదయం విప్పి ఆయన్ను వేడుకో. ఆయనే నీకు సరియైన మార్గం చూపుతాడు, ఆ దారిలో నిన్ను నడిపిస్తాడు. భగవన్నామం కంటే, ఆయన ధ్యానం కంటె మనలను పవిత్రులను చేసే మార్గం మరేది లేదు. భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో మురిసిపోతాడు. 
1* ******************************************* *
1. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట... విష్ణుఁడింతియ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండు నొక్కచోట... ఆయన - శ్రీమద్భాగవతం, ప్రహ్లాదచరిత్ర 7.124 ********************************************** 
జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు. జ్ఞానమార్గం అనుసరించినా, భక్తిమార్గం అనుసరించినా అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానజ్యోతి, ఆపరంజ్యోతి వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగుకు ఆవలనున్న దేమిటో, మరి ఆ పరమాత్మునికే ఎరుక. అది, ఇది అని ఉన్నదున్నట్లుగా చెప్పగలవారెవరూ! 22. మంత్రోపదేశం ఆవశ్యకమా? శిష్యుడు : స్వామీ! మంత్రోపదేశం పుచ్చుకోవడం నిజంగా అవసరమంటారా? స్వామి : అవసరమే. మంత్రోపదేశం లేక మంత్రదీక్ష పుచ్చుకోవడం ఆవశ్యకమే. మంత్ర సహాయం ఉన్నప్పుడే మనస్సును ఇష్టదేవతపై లగ్నం చేయడం సులభతరమౌతుంది. మంత్ర సహాయం లేనప్పుడు మనస్సుకు ఏకాగ్రత కుదురదు. అప్పుడు మనస్సు భగవద్భావం నుండి మరో భావానికి పరుగుపెడుతుంది. పరిపూర్ణ చిత్త ఏకాగ్రత అలవడనిదే ఆధ్యాత్మిక జీవితంలో ఏదీ సాధించలేము. కనుక ఈ విషయంలో గురువు సహాయం ఎంతో అవసరమని గుర్తుంచుకోవాలి. తన మనస్తత్వానికి అనుగుణంగా ఇష్టదేవతను ఎంచుకొనే విషయంలో శిష్యునికి గురువు సహాయం ఉండాలి. అంతేకాదు, అనుకూలమైన మంత్రం ఉపదేశించాలి. గురువు మాటపై అచంచల విశ్వాసం నిలిపి శిష్యుడు అనునిత్యం నియమపూర్వకంగా మంత్రజపం చేస్తూ, మంత్రార్థాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే అతడికి మనశ్శాంతి లభిస్తుంది. బ్రహ్మమార్గం దుర్గమమైనది. మనిషి ఎంతటి ధీమంతుడైనా, చతురుడైనా కూడ బ్రహ్మజ్ఞానియైన గురువు చేయూత లభించనిదే పురోగమించలేడు; పైగా పెడదారిన పడే ప్రమాదం కూడ ఉంది. జపధ్యానాదుల నిర్ణీత క్రమం ఆధ్యాత్మిక జీవిత ప్రారంభదశలో జపధ్యానాదుల నిమిత్తం ఒక నిర్ణీతక్రమాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది. జపధ్యాన పారాయణాదులకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించడం అవసరం. మనస్సు సుముఖంగా ఉన్నా, లేకున్నా ఈ నిర్ణీత క్రమాన్ని యథావిధిగా కొనసాగించడం ఎంతో ముఖ్యం. అప్పుడే కుదురుగా అభ్యాసం చేయడం సాధ్యమౌతుంది. బహుశా నీకిప్పుడు ధ్యానం. అంతగా రుచించక పోవచ్చు, ఆనందదాయకం కాకపోవచ్చు. కాని అలవాటయ్యాక ధ్యానించకుంటే తోచదు సరికదా, ఏదో బాధ, లోటు అనిపిస్తుంది. ఆ స్థితికి నువ్వు చేరుకోగలిగితే, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తున్నట్లు అది సూచిస్తుంది. ఆకలి వేసినా, నిద్రపట్టకపోయినా ఎవరికైనా బాధ, వ్యధ ఉంటుంది కదా! భగవత్ప్రప్తి కలుగలేదే అని, అదే విధంగా వ్యధ చెందితే, పరితపిస్తే అది నీకెంతో చేరువవుతుంది. ఆ అమృతమయుని అనుగ్రహం ఆశించి అమరుడవు కాగోరు నాయనా! అప్పుడు ఇక ఎక్కడున్నా, ఏం చేస్తూన్నా ఏ బాధా ఉండదు. పరుసవేదిని తాకించి ఇనుమును బంగారంగా మార్చివేసిన పిదప ఆ బంగారాన్ని నేలలో పాతిపెట్టినా, పెట్టెలో ఉంచినా ఒక్కటే; అది చెక్కుచెదరదు. అది ఎన్నటికీ మెరుగు చెడని మేలిమి బంగారంగానే ఉండిపోతుంది. “అద్వైత జ్ఞానాన్ని నీ కొంగున ముడివేసుకొని స్వేచ్ఛగా తిరుగు” అని చెప్పేవారు శ్రీరామకృష్ణులు. అంటే భక్తిజ్ఞానాలను సంతరించుకొన్న తరువాత, బ్రహ్మసాక్షాత్కారం పొందాక నువ్వు ఎలా జీవించినా, ఏం చేసినా సక్రమంగానే చేస్తావని గురుదేవుల అభిప్రాయం. ఆ స్థితిని చేరుకొన్న వ్యక్తి ఎన్నటికీ జీవితంలో తప్పటడుగు వెయ్యడని అంతరార్థం. పారమార్థిక జీవితానికి ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు. కనుక వాటిని తొలగించమని భగవంతుని వేడుకోవడం ముఖ్యం. భగవత్కృప నిమిత్తం నువ్వు ఎంతో తహతహలాడాలి. మనిషి మనస్సును ఈ జన్మకు, గత జన్మకు సంబంధించిన పాపపుణ్య వాసనలెన్నో కమ్ముకొని ఉంటాయి. వాటితో పెనగులాడిన కొద్దీ, అవి మరింత బలీయమై, బిగుసుకుంటాయి. ఈ జన్మలోనే తన జీవిత ధ్యేయాన్ని మరువక, విడువక సదా ప్రయత్నిస్తూ సాధన కొనసాగించగలవాడే ఈ భవసాగరాన్ని దాటి, తరించగలడని గుర్తుంచుకో. ప్రతి వ్యక్తిలోను రెండు ప్రవాహాలు పారుతూ ఉంటాయి. ఒకటి భగవంతుని వైపుగా, రెండవది సంసారం వైపుగా. వాటిని భావనాస్రవంతులంటారు. ఒక భావవాహిని నిన్ను త్యాగవైరాగ్య మార్గంలో భగవత్సన్నిధికి తీసుకుపోతుంది. రెండవది ప్రాపంచిక భోగాల కేసి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది వాంఛనీయమో ఎంచుకోవలసిన బాధ్యత మనదే. దైవత్వాన్ని నిరూపించుకోవడమా, పశుప్రాయంగా జీవించడమా? ఎంపిక చేసుకోవాలి. సాంసారిక విషయాలు మోహ జనకాలు. నిగనిగ లాడుతూ, కళకళ్ళాడుతూ తమ పైమెరుగులతో మనిషి ఎదుట గోచరించి, మనస్సును ఆకట్టుకొంటాయి. అప్పుడు అంతకంటె యోగ్యమైన, మహత్తరమైన ఆనందం ఇచ్చే విషయం ఏదైనా ఉంటుందా అనే ఆలోచనే మృగ్యమవుతుంది. ఉత్తమ పురుషార్థం గురించి వినవచ్చు. అయినా ఏం లాభం? భగవద్దర్శనం గాని, విషయోపభోగ ఆనందంగాని పొందగలమనే ఆధారం ఏం ఉందని తనలో తాను మథనపడుతూ ఉంటాడు; మనస్సుతో ఘర్షణ పడుతూ ఉంటాడు. నేటి సుఖాలను రేపటి ముక్తికోసం బలిపెట్టడం అతడికి అర్థరహితంగా తోస్తుంది. ఇలా తలపోసి ఎటూ తేల్చుకోలేక మరింతగా సంసార దావానలంలో చిక్కుకుంటాడు; తాపత్రయాలతో కుమిలిపోయి, జవసత్వాలు ఉడిగిపోయి, పడుచుతనపు బింకం అంతా చప్పగా చల్లారి, నిరాశాహతుడై మూఢత్వానికి చింతిస్తూ, మనశ్శాంతికోసం అప్పుడు పరితపించడం మొదలుపెడతాడు. పూర్తిగా బానిసై పోవడం వల్ల తన స్థితి నానాటికీ దిగజారడమేగాని, తాను ఆశించిన మనశ్శాంతి లభించదు. ఇక ఆ జన్మ అలా కడతేరవలసిందే...

ShilaNeeveShilpiNeeveShilpamNeevefullSong#Jayaraj#MohanBallepalli#BommakuMurali#Vijayyesudasu#song

 TO DOWNLOAD THIS SONG CLICK THIS LINK: https://archive.org/download/shila-neeve-shilipi-neeve-shilpam-neeve-full-song-jayaraj-mohan-ballepalli/SHILA%20NEEVE%20SHILIPI%20NEEVE%20SHILPAM%20NEEVE%20full%20SONG%20-JAYARAJ-%20MOHAN%20BALLEPALLI.mp4


ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు ఈరోజు .ఈపాటవిన్నందుకు.చాలాసంతోషంగాఉంది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.ఇందులోభాగమైనవారందరికీ.వందనాలు.విన్నంతసేపుఎంతోఅహ్లాదకరంగాఅనిపించింది.దన్యవాదములు.🙏🙏🙏🙏 మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇‍♀️🌷🙏👌👍🇮🇳👍 జయరాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 జయరాజన్న మీ కలానికి మీ కల్పన కు మీ రచనకు శతకోటివందనలు🙏🙏🙏♥️💐. ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏 పాట సాహిత్యానికి, అర్థవంతముగ పాడినవారికి, గాత్రానికి లోపడిన సంగీతానికి, వినులవిందు చేసిన అందరికి వంద. Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌 3 weeks ago ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పాట ఈ పాటకు శత కోటి వందనాలు ఇలాంటి గొప్ప పాట విని మనుషుల్లో మార్పు రావాలి 🙏🙏🙏 సమాజమును మేల్కొలిపే విధముగా గీతాన్నీ ర చించిన శ్రీ జయరాజ్ గారికి మరియు మధురముగ గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి ధన్యవాదములు శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏 ప్రకృతిని మానవతను శ్రీ జయరాజ్ గారు ఆద్యంత్యం అద్భుతంగా రచించారు. గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏 ఈ పాట వెనుకాల కష్టపడిన వాళ్ళ అందరికి ధన్యవాదాలు❤❤ 1 Mohan Ballepall Music Director& Singer This is a great song that deserves to be spread all over the world. An english translation of the lyrics will help for people other than Telugus also to enjoy. This will become an Epic in our culture. మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏 మా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽 జయరాజ్ sir గారికి, గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి , డైరెక్టర్ బొమ్మకు మురళి గారికి , సంగీత దర్శకులు టీమ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు,నైతిక విలువలను పెంచి ప్రపంచ ప్రజలకు మంచి మార్గం చూపిన జయరాజ్ sir గారికి నా వందనాలు,అందరికీ వందనాలు. స్వరం మధురం, రచన రసరమ్యం, ప్రకృతిలో పారవశ్యం, సంగీత దర్శకులకు సలాం సలాం, అందరికీ పాదాభివదనాలు 🙏🙏🙏 రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏 పాట అద్భుతం రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు 🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు. అభినందనలు..మంచిసందేశాత్మక గీతం అందరికీ అభినందనలు.. ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷 సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏 పాడిన వారికి వ్రాసిన వారికి అందరికీ పాదాభివందనం సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤ మనిషిలో దైవత్వాన్ని నిలిపి, మనసులో మాటలకందని మాధుర్యాన్ని నింపే అద్భుతమైన పాట జయరాజు అన్న మీ మేధస్సుకు మీ రచన జ్ఞానానికి నా శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్న Yesudas anna మీ గళం మీ గానం స్వర్గతుల్యమైనది ఈ సమాజానికి జ్ఞాన సంపద నిధి ఐనది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤ Wonderful song after a long time Kudos to Jaya Raj Sir for your good lyrics No words to express the awesome singing of Vijay Jesudas 💐💐💐 2 months ago నిజంగా... శిలా నీవే...శిల్పి నీవే...శిల్పం నీవే...మీ ముగ్గురికీ మనఃపూర్వక ధన్యవాదాలు ఓం నమఃశివాయ 🙏 అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏 Mohan Ballepall Music Director& Singer జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 Mohan Ballepall Music Director& Singer Excellent song. Excellent voice and Excellent meaning. Daily I am listening atleast two times. Thank you very much for whole team especially Vijay J esudas. Each and every lyric highlights the diversified mammoth creation which makes us exuberant and ecstatic while going through this melodious song by Vijay Jedudass.Hats after the lyrics writer who poured his heart to couch these Gems of impactful words. Simply indescribable. One Can, rather one should listen this song as many times as convenient. Mohan Ballepall Music Director& Singer జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి. మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది. నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి. మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉 A great song by Jairaju garu and greatly sung by Vijay and equally the credit goes to the composer. ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤

SADHKUDU_WEB SIGHTS_USEFUL FOR EVERY ONE

  

మానసిక ఆనందం

    

మానసిక ఆనందం


మానసిక ఆనందం
★★★★★★★
జీవితం అనే యుద్ధంలో ప్రతికూల ఆలోచనలు అనే
శత్రువులు మనపై దాడి చేయడానికి ఎప్పుడూ పొంచి
ఉంటాయి.పౌరాణిక యుద్ధాలలో ఒక ఆయుధాన్ని మరొక
ఆయుధం జయించేది. శత్రువు అగ్ని బాణం వేస్తే
కథానాయకుడు నీటి బాణం వేసి ఆర్పేవాడు.ప్రతికూల ఆలోచన
బాణం మన వైపు దూసుకువస్తే ‘అనుకూల ఆలోచన’ అనే
అసాధారణమైన బాణాన్ని అందుకోండి…
‘మైండ్ మనం పెంచుకునే పూలతోట లాంటిది’
అంటారు ప్రఖ్యాత రచయిత రాబిన్శర్మ. ఆ తోటను ఎంతబాగా
చూసుకుంటే అంత అందంగా వికసిస్తుంది. అదే
నిర్లక్ష్యం చేస్తే ఆ తోటలో
కలుపుమొక్కలు పుట్టుకొస్తాయి. అలాగే వదిలేస్తే..
కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి. కొన్నాళ్లకు ‘తోట’
అనే పదానికే అర్థం లేనట్టుగా తయారవుతుంది అంటారాయన.
కలుపుమొక్కలను తొలగించాలంటే పాజిటివ్ థింకింగ్ ఒక్కటే
సరైన ఆయుధం. అనుకూలమైన ఆలోచనలతో మన మైండ్లో
ఉన్న కలుపుమొక్కల్లాంటి నెగిటివిటీని దూరం చేసుకుంటే
శక్తివంతంగా ఎదుగుతాం.ప్రతిభ సమానంగా
ఉన్నవారందరిలోనూ పరాజితుల నుంచి విజేతలను వేరుచేసేది
వారి ఆలోచనలే.
ఆలోచనే మొదటి మెట్టు…
మన ఆలోచనలను విత్తుగా నాటితే అది చర్య అనే మొక్కలా
పెరుగుతుంది. ఆ చర్య దాన్ని మళ్లీ విత్తుగా నాటితే అది
అలవాటు అనే మొక్కలా పెరుగుతుంది. ఆ అలావాటునే విత్తితే
అదినడవడిక అనే పంటలా ఫలిస్తుంది. ఆ నడవడికనే నాటితే అది
మన అదృష్టాన్నే మార్చివేస్తుంది. అంటే ముందుగా మన
మైండ్లో ఒక ఆలోచన ఉదయించాలి.
రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేవాలనే ఆలోచన
వచ్చిందనుకుందాం. అదే ఆలోచన రోజూ కలిగితే ఒక
రోజు అనుకున్న సమయానికే మేల్కొంటాం. పనులను చకచకా
చేసేస్తాం. అదే రోజూ త్వరగా నిద్రలేవడం అనేది అలవాటుగా
మారి, పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటే కొన్నాళ్లకు అది ఒక
క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది. చివరకు అది మన
క్యారెక్టర్నే మార్చివేస్తుంది. అదే ఒకరిలో ‘మద్యం తాగాలి’ అనే
ఆలోచన కలిగిందనుకుందాం. ఒకరోజుతో ‘తాగడం’
మొదలుపెట్టి, దానిని రోజూ ఓ అలవాటుగా తాగుతూ పోతే
చివరకు అతని క్యారెక్టర్ అందరిలోనూ తాగుబోతుగా
ముద్రపడే అవకాశం ఉంది. అందుకే మొదట మైండ్లో
ఉదయించే ఆలోచన ‘మంచి, చెడు’ ఎలాంటి
క్యారెక్టర్ను సృష్టిస్తుందో మనకు మనమే చెక్ చేసుకోవాలి.
నెగిటివ్ చీడ…
నెగిటివ్ ఆలోచనలు చీడపురుగుల్లాంటివి. అవి
ఎప్పుడూ మైండ్ను తొలుస్తూనే ఉంటాయి. పాజిటివ్
ఆలోచనలతోనే వాటిని ఎదుర్కోగలం.
ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను, భర్తను భార్యను,
ఉద్యోగిని పై అధికారి తిట్టడం, దూషించడం వంటివి
చూస్తుంటాం. వారి మాటలు, ప్రవర్తన మనలో ఎంతో
నెగిటివిటీని నింపవచ్చు. ఇలాంటప్పుడు నిరాశ
నిసృ్పహలకు లోనైతే మరింత కుంగుబాటు తప్పదు.
మనల్ని మనం మరింత శక్తివంతంగా మలుచుకోవాలంటే ఆ
నిరాశను దూరం చేసుకోవాలి. ‘నా బాగు కోసమేగా ఇలా జరిగింది.
వారంత నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన
ఇప్పుడు కోల్పోయిందేముంది.. దీనిని సవాల్గా తీసుకొని
ఇంకాస్త ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం’ అని
ఎప్పటికప్పుడు మనల్ని
మనం అనుకుంటూ ప్రోత్సహించుకుంటే ఉంటే కొత్త
ఉత్సాహం చెంతకు చేరుతుంది. మరింత బాగా పని చేసి,
శక్తివంతులమవుతాం.
లోకంలో రకరకాల మనస్తత్వాలు గలవారు ఉంటారు. వారికి
తోచినట్టు వారు మాట్లాడుతుంటారు. ప్రవర్తిస్తుంటారు.
వీలైతే అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి. వారి స్థానాన్ని
పాజిటివ్గా ఉండేవారితో భర్తీచేయాలి. ఏ కారణంగానైనా మనలో
నెగిటివిటీ తొంగిచూస్తే ఒక్క పాజిటివ్ ఆలోచనతో దానిని రీప్లేస్
చేస్తే సరి అనుకూలమైన ఆలోచనలతో జీవితం ఆనందంగా మారినట్టే.
పాజిటివ్ – టెక్నిక్స్
ఆశావాద దృక్ఫథంతో వ్యవహరించే మనుషుల మధ్య ఉంటే
నిరాశావాదం మెల్లగానైనా తప్పుకుంటుంది.
గుడికి వెళ్లడమో, నచ్చిన సినిమా చూడటమో, కొత్త
వంటకం చేయడమో, పుస్తకం చదవడమో… ఏదైనా
మనసుకు నచ్చినపనిని చేస్తూ ఉండాలి. ఆ పనిలో కలిగే
సంతృప్తి నిరాశను తరిమికొడుతుంది.
ఒంటరిగా ఉండటంలో వచ్చే నిరాశాపూరితమైన
ఆలోచనలను వదిలించుకోవాలంటే నలుగురితో కలివిడిగా
ఉండాలి. వీలైనంతవరకు సహోద్యోగులతోనో,
బంధుమిత్రులతోనో, ఇరుగుపొరుగువారితోనో..
మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాజిటివ్నెస్ను పెంచుతుంది.
మనకు అందరూ ఉన్నారు అన్న భరోసాను ఇస్తుంది.
బలం, బలహీనతలు గుర్తించాలి
ఆలోచనలు విశాలంగా ఉండాలి. మన బలం, బలహీనతలేంటో
ఎవరికి వారు అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడే
బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేయగలం.
మరింత శక్తివంతులుగా మారగలం. అందుకే నెగిటివ్
ఆలోచనలను దరికి రానీయకుండా బలహీనతలను దాటడానికి
మనల్ని మన మే ప్రోత్సహించుకోవాలి. అలాగే మన
బలాలను గుర్తించి వాటిని ఇంకా బాగా వాడుకోవాలి.
నా కోసం నేను… అనుకోవాలి…
శుభ్రంగా ఉన్న కాఫీ గ్లాసు లాంటిది మన మైండ్. కాఫీ తాగిన
ప్రతిసారి ఆ గ్లాసును శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా అదే
గ్లాసులో మళ్లీ మళ్లీ కాఫీ పోసుకొని తాగితే ఎలా ఉంటుందో ప్రతి
ఒక్కరు ఆలోచించగలిగితే మన మైండ్
మనకు అర్థమైపోతుంది. పాజిటివ్ ఆలోచనలు మళ్లీ మళ్లీ
రానిస్తే మన మైండ్ అలాగే తయారవుతుంది. ‘నాకు మంచి
జరగాలని నేను కోరుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోరు’
అనుకున్నా పాజిటివ్ ఆలోచనలతో జీవితం హ్యాపీగా
గడిచిపోతుంది.

దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

 *గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని

    స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి,
    పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే
    'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజ
    భరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం.
    నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు,
    జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి
    కదా! అసలేమి లేదు. *

      *నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత
      లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే
      సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత
      పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న
      విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం,
      పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి
      పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే లబ్ది దారుడే గొప్పవాడు.
      ముత్యాలహారం కంటే దానిని ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటే సంపంగి
      ముక్కు విలువైనది. 'అమ్మాయి' నామ వాచకం. ఆమె ధరించిన 'నగ' విశేషణం. హారం
      పోయినా పర్వాలేదు, కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పది కోట్లు. ముక్కెర
      లేకపోయినా నష్టం లేదు. ముక్కు ఉంది. అదే మహాభాగ్యం.నీ తలపై ధరించే తలపాగా
      లేదా నవరత్న ఖచిత కిరీటం కంటే, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటం లోని
      మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నె చిన్నెలను తక్కువగా చెప్పడం కూడా
      కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు. అన్వేషించు,
      శతవిధాల ప్రయత్నించు. సాధించు. తప్పులేదు. కానీ, దానికోసం లేనిపోని
      తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పి కట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరో
      భూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం
      ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితం గా ఉంటుంది. ఒక మంచి వక్తను
      చూడండి. చక్కటి కృషితో భాషా విజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమను
      పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం
      తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగుడుతున్నారు. అది అతనికి
      ప్రత్యెక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన
      వ్యవహారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనందరికీ గర్వకారణం. చాకచక్యంగా
      సంభాషించలేక పోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని
      మూగవారి గురించి ఆలోచించండి! వారికంటే మనమెంత అదృష్టవంతులం! ఒకసారి సరదాగా
      మిత్రులతో అన్నాను, నేను విశేషణాలు, ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని.
      'నేను నేనుగా' ఉన్నాను. 'నీవు నీవుగా' ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా
      సరే, నీకంటే గొప్పవి కావు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాల కంటే చాలా
      అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా
      అజీర్ణ వ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనం
      చేయడం, జీర్ణం చేసుకుని శక్తిగా మార్చుకోవడం మామూలు విషయం కాదని అప్పటికి గానీ
      తెలిసి రాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయాలంటే, రెండు - మూడు వేలు
      ఖర్చు అవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్ చేస్తాయి.
      అంటే రోజుకు లక్ష రూపాయలను మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు
      బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ
      అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటి నిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే
      నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండడమే నీ పరమ
      గమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ
      ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి, అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
      సాధించకపోయినా ఇబ్బంది లేదు. పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి
      చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వును సమాధానంగా ఇస్తుంది.
      పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే.
      శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ! కూడు, గూడు నిత్యావసరాలకు
      సరిపడినంత ధనం ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే
      మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప
      గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత
      మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని
      (జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢతను పెంచేలా ఉండాలి. మనం
      సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరఫున సాధించిన లక్ష్యం
      (ఆరోగ్యంగా జీవించడం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని
      కటాక్షించాలి. అంతే కానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా
      ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను
      సాధించడానికి వృధాగా ధారపోయరాదు. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ
      సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతితో తాదాత్మ్యం చెందడం మన మొదటి
      లక్ష్యం, చివరి లక్ష్యం. *
      *ఆడడం నెమలి లక్ష్యం. పాడడం కోయిల లక్ష్యం ఆడుతూ పాడుతూ బ్రతకడం మనందరి
      లక్ష్యం *
      --
      *ఓం నమో భగవతే వాసుదేవాయ *
      *సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
      *కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
       

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు

 

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.



ఏ రోజు ఏ అభరణాలు ధరిస్తే శుభం..?
.......................................................
మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.
వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.
అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.
ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.
* ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.
* సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.
* మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.
* బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.
* గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.
* శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.
* శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

రాగితో ఆరోగ్యం బోలెడు....?
.......................................................
గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. కాని నేడు ఫ్యాషన్‌ ఎక్కువయ్యి ప్లాస్టిక్‌ వచ్చిపడింది. దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. నీళ్ళు తాగాలంటే ప్లాస్టిక్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్సులు కూడా ప్లాస్టికే. నేటి ఇళ్ళు మొత్తం ప్లాస్టిక్‌ సామానుల మయమైపోయాయి. అయితే రాగి పాత్రలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
* రాగిలో యాంటి బ్యాక్టిరియల్‌ నేచర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.
* మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు.
* చెవులు కుట్టినప్పుడు కూడా చిన్న పిల్లలకి కొన్ని చోట్ల మొదటిసారి రాగి తీగలు చుడతారు. ఎందుకంటే పుండు పడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటి బ్యాక్టిరియల్‌ లక్షణం పిల్లలకు ఆ ప్రమాదం రాకుండా చేస్తుంది.
* గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడ్డాయి.
* రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది. అలా తాగితే కడు పులో వున్న చెడు అంతా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
* బ్రిటిష్‌కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు.
రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు. రాత్రి నిద్ర పోయేముందు అర లీటర్‌ నుండి లీటర్‌ ఉండే రాగి చెంబు నిండా మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15 నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్‌, కడుపుబ్బరము, కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాధుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.
ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి సందేహం రావచ్చు .
రాగి గురించి వరాహ పురాణంలో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడకేశుడు అనే ఒక రాక్షసుడు తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గూడకేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఒక శుభ మూహూర్తంలో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞంలో రాగి పాత్రలను మాత్రమే వాడతారు అంతేగాక రాగికి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది .

కష్టాలతో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధన ఏది...!
.............,.........................................
దుర్గాదేవి ప్రీతి కోసం చీర, రవికల గుడ్డ, గాజులు, పువ్వులు అన్నీ ఎర్ర రంగులో ఉండేవి దానం ఇవ్వాలి. దీని ద్వారా శక్తి సామర్థ్యాలు, ధైర్యం పెరిగి, కార్య జయం కలుగుతుంది.
విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కు తోచని స్థితిలో దుర్గాదేవి దేవాలయంలో 14 రోజులు ప్రదోషంలో అమ్మవారి ఎదురు గుండా పసుపు రంగు గుడ్డ మీద మేలిమి గంధం, పసుపు, కుంకుమ పొడి చల్లి, దాని మీద మట్టి ప్రమిదలో ఆవనూనెతో ఒక వత్తి వేసి, తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి.
వాహన ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నప్పుడు 8 బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయంపాకం దానంగా ఇచ్చి, మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోసి, దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి.

పాపాలు తొలగించు పాలాభిషేకం...!
.....................................................
మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.
శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. ఆ మహాదేవునికి అభిషేకానిసి నీళ్లు, పాలు, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్ల రసాలు లాంటి ద్రవ్యాలు వాడుతుంటారు. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని చెబుతుంటారు. పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, దుఖాల నుంచి విముక్తి లభిస్తుంది.
జీవితంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వ్యథ. ముఖ్యమైన కార్యాలలో విజయం లభించకపోవడం, అనుకున్న పనులు నెరవేరక పోవడం, ఆటంకాలు ఏర్పడటం, అయినవాళ్లు ఆపదలు, అనారోగ్యం పాలవడం లాంటివి ఎన్నో. అన్ని రకాల దుఃఖ బాధల నుంచి విముక్తికి పరమశివుడి అనుగ్రహమే మార్గం. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి. తద్వారా పాపవిముక్తి, భగవత్ అనుగ్రం కలుగుతాయి.

ధాత్రీ ఫలం....!
ఉసిరికాయనే ఆమలక ఫలం,ధాత్రీ ఫలం అని పిలుస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా పౌర్ణమి, అమావాస్య రోజులలో గాని ఉసిరి వృక్షాన్ని పూజిస్తే సర్వ శుభములు కలుగుతాయని శాస్త్రవచనం.బ్రహ్మ ఆనందబాష్ప బిందువులనుండి ఉసిరిక ఉద్భవించింది. శ్రీమహావిష్ణువుకు ధాత్రి, తులసి దళాలు ప్రియములు. ధాత్రి మూలమున శ్రీహరి, స్కంధమున రుద్రుడు, ఊర్ధ్వమున బ్రహ్మ, శాఖలందు సూర్యుడు, ఉపశాఖలందు దేవతలు ఆశ్రయించి ఉంటారట.
"ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే - ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా" అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.
ఉసిరికాయలతో నివేదన, ఉసిరికాయలపై ఆవు నేతితో తడిపి వస్తులు వేసి దీపారాధన, ఉసిరిచెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉసిరి వనంలో అన్నసమారాధానలు చేయడం, సాలగ్రామాలను, దీపాలను దానం చేయడం వలన అఖండ అష్టైశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తిక మాసంలో బంధు మిత్రులతో కలిసి ఉసిరి చెట్ల నీడలో వనభోజనాలు చేసినట్లయితే సకల పాపములు తొలగిపోయి, విష్ణులోకం పొందుతారని, కలియుగమందు ధాత్రీమాల నరుల ఎన్ని దోముములను స్పృశిస్తుందో అన్నివేల సంవత్సరములు వైకుంఠమందు వలసి లభిస్తుందని కార్తిక పురాణోక్తి.
మానవుడు తన ఆరోగ్యమును కాపాడుకొనుటకై ఉసిరికాయను ఏదో ఒక రూపములో ఉపయోగించవలసిందిగా, అది సాధ్యము కాలేనిచో కనీసం ఈ కార్తికమాసమునందైనా, తప్పక ఉసిరిని ఉపయోగించాలని ధార్మికముగా నియమము చేసినారు మన మహర్షులు. ఆయుర్వేదరీత్యా ఉసిరి వలన శరీరపు ఉష్ణమును తగ్గించి, జీర్ణశక్తిని పెంపొందింపజేసి, వీర్యవృద్ధిని కలిగించి, మంచి పుష్టిని పుట్టించును. దాహమును తీర్చే, మధుమేహ రోగులకు మంచి హితకారి. ఉసిరిక త్రిదోషహరము ‘సంజీవిని’ అని పిలువబడుతున్నది. కార్తిక మాసమునందు వాతావరణ ప్రభావము నుంచి ఉష్ణాశం తక్కువై త్రిదోషములు వికృతి పొందును. కార్తిక మాసంలో మనము బృందావనమునందు ఏర్పాటుచేసికొన్న ఉసిరిక కొమ్మ-తులసి రెమ్మల వాసనలవలన చక్కటి ఆరోగ్యము చేకూరుతుందని ఈ మాసంలో వనభోజనాలు ఏర్పాటుచేసినారు మన ప్రాచీనులు.

తులసి మొక్క ప్రాధాన్యత....!

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?
మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.
మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.
తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.
తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.
తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.
ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.
తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.
నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.
తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?
.....,................................................
పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.
పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?
.....,.................................................
ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.
పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?
.................................................
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.
ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?
..,....................................................
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
.......................................................
తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.
తీర్థ మంత్రం:
.........................................
అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
స్నానము ఎలా చేయ వలెను?
.................................................
నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.(అవి పూడి పోకుండా ఉండటానికి)
ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?
.....................................................
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?
...................,.................................
తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?
....,..................................................
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )
హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?
......................................................
కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.
ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?
.......................................................
మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.
పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?
..............,......................................
పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి,
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?
......................................................
వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు.
శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?
..................,..................................
సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
అయిదో తనమంటే ?
................................
ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.

నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు
...................................................
కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటా.రు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి.
స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి.
సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న్యాయాధీశుని లేదా నగరరక్షకుని దిక్కరించినవాడు. తులసీదళం చేబూనికూడా మాటతప్పినవాడు, దైవప్రతిమ ఎదుటప్రమాణంచేసి తప్పినవాడు.. నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
మిత్రులను మోసంచేసినా, చేసిన మేలు మరచినా, తప్పుడు సాక్ష్యాలు సమర్పించినా, దేవబ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు అయినవారు తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ-రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరకప్రాప్తి.
బ్రాహ్మణ, దేవతార్చన, శంఖద్వని, తులసి, శివారాధన లేని చోట, విష్ణు భక్తులని నిందించిన చోట, సంధ్యావందన విహీనుడు ఉన్నచోట, ఆచార వర్జితుడి ఇంట, వాచాలుడైన వాడి ఇంట, తడికాళ్ళతో, నగ్నంగా నిదురించేవాడి ఇంట, తోడపై దరువువేసే వాడిఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవ హింస చేసేవాడి ఇంట, దయాశున్యుడి ఇంట, విప్రులని నిందించే వాడి ఇంట, లక్ష్మిదేవీ క్షణకాలం కూడా నిలువదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రుద్రాక్షధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అసత్యం చెప్పరాదు. శుభ కార్యాలకి బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనుక నడవాలి. అశుభకార్యాలకి బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనుక నడవాలి.
నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టకూడదు. ఎవరికైతే వస్త్రం ఉండదో వారికీ ఆయుక్షీణం. నురుగు ఉన్న నీరు పూజకి పనికిరాదు, అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టాలి అనుకునేవారు మానసిక పాపులు.
పాడ్యమి, షష్టి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణలయందు, వ్రత, శ్రాద్ధ దినముల యందు శరీరమునకు తైలమును పట్టించుకూడదని విష్ణు పురాణం చెబుతోంది.
భోజనం చేసేటపుడు నిషిద్ధ కర్మలు
ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలోవెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో(ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన(శుద్ధి) తరువాత తినాలి.
నిదురించేటపుడు.. ఉత్తరం వైపు తలవుంచి నిద్రపోకూడదు. తడికాళ్ళతోకానీ, నగ్నంగా కానీ నిద్రపోకూడదు.
దేవాలయ దర్శనంలో నిషిద్ధకర్మలు
దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరి పోతుంది.
పెళ్లి విషయంలో నిషిద్ధకర్మలు
ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడుకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి చేయరాదు, అలాచేస్తే పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, పెళ్లి జరిపించిన పురోహితుడు అందరూ నరకానికి వెళతారు. ఇది ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది. పెళ్లికాని అన్నగారిని పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానంచేయడం అపాత్రదానం అవుతుంది.
వారము - క్షారకర్మ ఫలితాలు (వారాహీసంహిత - గర్గాది మహర్షులు)
వారము ఫలితము
ఆదివారము ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది
పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. వెడం చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
పురుషులకి నిషిద్ధకర్మలు
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షారకర్మ పనికిరాదు.

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు....?
............................................,..........
ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో..., అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు...అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే... పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు...
- మన కాళ్ళు...ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన కళ్ళు...అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ... చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే... మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.
- కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
- మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే...భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే... ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ...,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే...పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు...అంటే....
- ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం...శబ్దం.
- వాయువుకు ఉన్నగుణాలు రెండు...శబ్దము, స్పర్శ.
- అగ్నికి ఉన్న గుణాలు మూడు...శబ్ద, స్పర్శ, రూపములు.
- జలముకు ఉన్న గుణాలు నాలుగు...శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
- భూమికి ఉన్న గుణాలు ఐదు...శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
- జలము...‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
- అగ్ని...‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
- వాయువు...‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
- ఆకాశం...‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు..., ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే..., పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా...ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.



మానవ నిత్య జీవితంలో ఆచరించాల్సిన, ఆచరించని కర్మల గురించి తెలుసుకోవడం మంచిది....!!
వారము - క్షారకర్మ ఫలితాలు (వారాహీసంహిత - గర్గాది మహర్షులు)

వారము ఫలితము
ఆదివారము ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది.
పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు.......
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. వెడం చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు....
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు.
పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
పురుషులకి నిషిద్ధకర్మలు.....
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షారకర్మ పనికిరాదు.